Andhra Pradesh

News July 16, 2024

సచివాలయ సెక్రటరీ జనరల్‌గా ప్రసన్నకుమార్

image

ఆంధ్రప్రదేశ్ సచివాలయ (శాసనసభ, శాసనమండలి) సెక్రటరీ జనరల్‌గా సుప్రీంకోర్ట్ మాజీ రిజిస్ట్రార్ సూర్యదేవర ప్రసన్నకుమార్ నియమితులయ్యారు. ఈ పదవిలో ఉన్న డా.PPK రామానుజాచార్యులు రాజీనామా చేయడంతో ప్రసన్నకుమార్ తాజాగా సెక్రటరీ జనరల్‌గా నియామకమయ్యారు. ప్రసన్నకుమార్ గతంలో ఢిల్లీ అసెంబ్లీ కార్యదర్శిగా కూడా పనిచేశారు. కాగా ఆయన మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు.

News July 16, 2024

కృష్ణా: ‘మాతా,శిశు మరణాలు సంభవించకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలి’

image

కలెక్టర్ DK బాలాజీ మంగళవారం మచిలీపట్నం కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్ సమావేశ మందిరంలో వైద్య శాఖ అధికారులు, సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన జిల్లాలో మాతా శిశు మరణాలు సంభవించకుండా ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయి సిబ్బందితో సమావేశమై మాతా శిశు మరణాల రేటు తగ్గేందుకు అధికారులు కృషి చేయాలన్నారు.

News July 16, 2024

శ్రీకాకుళం: డిగ్రీ స్పెషల్ డ్రైవ్ పరీక్షల నోటిఫికేషన్ విడుదల

image

BR అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ విద్యార్థులకై(ఇయర్ ఎండ్) స్పెషల్ డ్రైవ్ పరీక్షల నోటిఫికేషన్ మంగళవారం విడుదలైంది. 2011-15 మధ్య అడ్మిషన్ తీసుకున్న డిగ్రీ విద్యార్థులు రాయాల్సిన ప్రాక్టికల్, థియరీ పరీక్షలకై విద్యార్థులు ఆగస్టు 14లోపు ఫీజు చెల్లించాలని వర్శిటీ సూచించింది. ఆగస్టు 22 నుంచి ప్రాక్టికల్స్, సెప్టెంబరు 3 నుంచి థియరీ పరీక్షలు జరుగుతాయని, వివరాలకు వర్శిటీ అధికారిక వెబ్‌సైట్ చూడాలంది.

News July 16, 2024

డేటింగ్ యాప్‌లతో మోసం.. నంద్యాల యువకుడి అరెస్ట్

image

డేటింగ్ యాప్‌లతో యువతులకు వల విసిరి పెళ్లి చేసుకుంటానని మోసాలకు పాల్పడుతున్న నంద్యాల జిల్లా యువకుడిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. సంజామల మండలానికి చెందిన చిన్ని రెడ్డి శ్రీనాథ్ రెడ్డి.. టిండర్, నీతో డేటింగ్ అనే యాప్ ద్వారా హైదరాబాద్‌కు చెందిన ఓ యువతిని నమ్మించి రూ.6.41 లక్షలు వసూలు చేశాడు. మోసపోయానని తెలుసుకున్న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడి బండారం బయటపడింది.

News July 16, 2024

జేసీ పవన్‌కు కీలక నామినేటెడ్‌ పదవి?

image

అనంతపురం జిల్లా టీడీపీ నేత జేసీ పవన్‌కు కీలక నామినేటెడ్ పదవి వరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. స్వతహాగా క్రీడలపట్ల మక్కువ చూపే పవన్‌ గతంలో ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఈసారి ఏకంగా ఒలింపిక్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రముఖ క్రీడాకారులతో పవన్‌కు పరిచయాలు ఉండటంతో కూటమి సర్కారు ఈ అవకాశం కల్పించనున్నట్లు ప్రచారం సాగుతోంది.

News July 16, 2024

స్పీకర్ అయ్యన్నతో చీఫ్ సెక్రటరీ భేటీ

image

అమరావతిలో అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్లో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహించిన అయ్యన్నపాత్రుడుని తొలిసారిగా చీఫ్ సెక్రటరీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విధివిధానాలను చీఫ్ సెక్రటరీ స్పీకర్‌కు వివరించారు. అనంతరం స్పీకర్ అయ్యన్నపాత్రుడు తన అనుభవాలను ఆయనకు వివరించారు.

News July 16, 2024

శానిటేషన్‌లో ప్రజల భాగస్వామ్యం అవసరం: కలెక్టర్

image

సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పిస్తూ.. ప్రజల భాగస్వామ్యంతో పారిశుధ్యం, దోమల నివారణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని అమలు చేసుకోవాలని కలెక్టర్ సృజన అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం శానిటేషన్, సీజనల్ వ్యాధులపై అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి వారం ఫ్రైడేను డ్రైడేగా నిర్వహించాలన్నారు.

News July 16, 2024

కృష్ణా: ‘పామాయిల్ సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తాం’

image

పామాయిల్ సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని కలెక్టర్ డీకే బాలాజీ వెల్లడించారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో మంగళవారం ఆయన ఉద్యానవన శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరు మండలాల్లో పామాయిల్ అత్యధికంగా సాగవుతుందని, గత సంవత్సరం నుంచి అవనిగడ్డ, చల్లపల్లి, మోపిదేవి మండలాల్లో సైతం పామాయిల్ సాగుతున్నట్లుగా గుర్తించామని అధికారులు కలెక్టర్‌కు వివరించారు.

News July 16, 2024

మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డితో సవిత భేటీ

image

రాష్ట్ర రోడ్డు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డితో బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత మంగళవారం వెలగపూడి సచివాలయంలో భేటీ అయ్యారు. పెనుకొండ నియోజకవర్గంలోని సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలు పరిష్కరించి అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. చాలా గ్రామాలకు అంతర్గత రోడ్లు లేకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు. సీసీ రోడ్లు గ్రామాల నుంచి గ్రామాలకు కనెక్టివిటీగా బీటీ రోడ్లు వేయాలని కోరారు.

News July 16, 2024

VZM: రెండు ఆటోలు ఢీ.. వృద్ధురాలు మృతి

image

మెంటాడ మండలం మీసాలపేట సమీపంలో రెండు ఆటోలు ఢీకొన్న ఘటనలో ఓ వృద్ధురాలు మరణించిందని స్థానికులు తెలిపారు. ఈ రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలు కావడంతో అంబులెన్స్‌లో స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఆండ్ర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.