Andhra Pradesh

News July 16, 2024

జవాన్లకు జోహార్లు తెలిపిన కేంద్రమంత్రి రామ్మోహన్

image

కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు జమ్మూకశ్మీర్‌లోని అనంత్ నాగ్‌లో ఉగ్రవాదుల దాడులలో వీరోచితంగా పోరాడి అమరులైన జిల్లాకు చెందిన జవాన్లు డి.రాజేశ్, జగదీశ్వర్ రావుకు జోహార్లు అర్పించారు. వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ విషయం వారి కుటుంబాలతో మాట్లాడి పార్థివ దేహాలను స్వస్థలాలకు చేర్చేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని, వారికి అండగా ఉంటాం అని భరోసా ఇచ్చారు.

News July 16, 2024

సింహాచలం గిరిప్రదక్షిణ ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

image

సింహాచలం గిరి ప్రదక్షిణ ఏర్పాట్లను కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, విశాఖ సీపీ శంకభద్ర బాగ్చి మంగళవారం పరిశీలించారు. సింహాచలంతో పాటు పరిసర ప్రాంతాల్లో గిరి ప్రదక్షిణ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. గిరి ప్రదక్షిణ విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ విశ్వనాథన్, ఈవో శ్రీనివాసమూర్తి ఇతర అధికారులు పాల్గొన్నారు.

News July 16, 2024

కడప: బెస్ట్ టీచర్ అవార్డుల దరఖాస్తు గడువు పొడిగింపు

image

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్స్-2024 కోసం అర్హత గల జిల్లా ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకోవడానికి గడువును 18వ తేదీ వరకు పొడిగించినట్లు డీఈవో అనురాధ తెలిపారు. అర్హత/ఆసక్తి గల ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దరఖాస్తులను 21వ తేదీలోగా DEO ఆఫీసులో సమర్పించాలని సూచించారు. మరింత సమాచారానికి https://nationalawardstoteachers.education.gov.in సంప్రదించాలని అన్నారు.

News July 16, 2024

శ్రీశైలం రిజర్వాయర్‌లో గాలిస్తున్నాం: నంద్యాల ఎస్పీ

image

నంద్యాల జిల్లా ముచ్చుమర్రి ఘటనలో బాలిక మృతదేహం ఇంకా దొరకలేదని జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ తెలిపారు. ‘బాలికను ముగ్గురు మైనర్లు అత్యాచారం చేశారు. ఆ తర్వాత హత్య చేశారు. మృతదేహానికి రాళ్లు కట్టి రిజర్వాయర్‌లో పడేశారు. ఈ ఘటనలో ముగ్గురు మైనర్లను అరెస్ట్ చేశాం. ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయర్‌‌లో గాలిస్తున్నాం. మృతదేహం ఇంకా దొరకలేదు’ అని ఎస్పీ తెలిపారు.

News July 16, 2024

ఫిరంగిపురం: బాలిక మృతి.. పోక్సో కేసు నమోదు

image

యువకుడి వేధింపులతో బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. సీఐ వీరేంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం..  ఫిరంగిపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక ఇంటివద్దే ఉంటోంది. బాలికను మరో గ్రామ యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తుండటంతో బాలిక తండ్రి అతన్ని మందలించాడు. నీలాంబరం, మరి కొందరు బాలిక ఇంటికి వెళ్లి ఆమె తండ్రిపై దాడి చేశారు. మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్యకు యత్నించి చికిత్స పొందుతూ మృతి చెందింది.

News July 16, 2024

సైనికుల మృతి బాధాకరం: రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు

image

జమ్మూకాశ్మీర్ ప్రాంతంలో సోమవారం జరిగిన ఉగ్రవాదుల దాడిలో టెక్కలి నియోజకవర్గానికి చెందిన సనపల జగదీశ్వరరావు, డొక్కరి రాజేష్ అనే ఇద్దరు సైనికులు మృతిచెందడం తీవ్ర బాధాకరం అని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఈమేరకు ఆయన క్యాంపు కార్యాలయం నుంచి వివరాలు వెల్లడించారు. దేశసేవలో సైనికులుగా ఉన్న జవాన్లు మృతిచెందడం చాలా బాధాకరం అన్నారు.

News July 16, 2024

శ్రీకాకుళం: ఉగ్ర దాడిలో మరో జవాన్ మృతి

image

జమ్మూకశ్మీర్‌లో సోమవారం జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళి మండలానికి చెందిన డొక్కరి రాజేశ్(25) అనే జవాన్ కూడా మృతిచెందారు. ఇదే ఘటనలో నందిగం మండలానికి చెందిన సనపల జగదీశ్వరరావు అనే జవాన్ మృతి చెందిన విషయం విదితమే. కాగా సంతబొమ్మాళి మండలానికి చెందిన రాజేశ్ మృతిచెందటంతో టెక్కలి నుంచి ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు.

News July 16, 2024

భర్త మృతితో మనస్తాపానికి గురై ఆత్మహత్య

image

భర్త మృతితో మనస్తాపానికి గురై భార్య ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన వరికుంటపాడు(M), కనియంపాడులో మంగళవారం చోటుచేసుకుంది. ఇటివల కోడూరు బీచ్ జాన్ బాబు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన కొద్ది రోజులకే కర్ణాటకలోని KGFలో బంధువుల వద్ద ఉన్న జాన్ బాబు భార్య తన భర్త మృతితో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరు లేని సమయంలో హెయిర్ ఆయిల్ సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 16, 2024

పోలవరం ప్రాజెక్ట్ అధికారులతో మంత్రి నిమ్మల సమీక్ష

image

వెలగపూడి సచివాలయంలో మంగళవారం మంత్రి నిమ్మల రామానాయుడు పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్‌పై సంబంధిత ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష చేశారు. పలు అంశాలను అధికారులు మంత్రికి వివరించారు. కార్యక్రమంలో జల వనరుల శాఖ ముఖ్య సలహాదారులు వెంకటేశ్వరరావు, పోలవరం ప్రాజెక్ట్ సీఈ నరసింహామూర్తి, ప్రాజెక్ట్ ఎల్.ఎం.సి ఎస్ఈ ఏసుబాబు పాల్గొన్నారు.

News July 16, 2024

ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి: కిమిడి

image

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షులు కిమిడి నాగార్జున అన్నారు. చీపురుపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన నెల రోజుల్లోనే విప్లవాత్మకమైన పరిపాలన అందిస్తున్నారన్నారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు సమీక్షలు చేస్తూ, యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడతున్నారని తెలిపారు.