Andhra Pradesh

News July 16, 2024

శ్రీశైలం ఈవోగా IAS అధికారి.?

image

శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జునస్వామి పుణ్యక్షేత్రం తదుపరి ఈవోగా IAS అధికారిని నియమించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆలయం అభివృద్ధి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గతంలో IAS అధికారి డా.నారాయణ భరత్ గుప్తా ఈవోగా ఉండగా, ఆయనకు ప్రభుత్వం కమిషనర్ ర్యాంక్ అధికారాలను కల్పించింది. కాగా అత్యధికంగా గ్రూప్-1 ర్యాంక్ అధికారులు ఈవోలుగా పని చేశారు.

News July 16, 2024

చంపుతామంటూ బెదిరింపు కాల్స్: దువ్వాడ శ్రీనివాస్

image

టెక్కలి నియోజకవర్గంలోని వైసీపీ కార్యకర్తలకు గుర్తుతెలియని వ్యక్తులు చంపుతామంటూ బెదిరింపు కాల్స్ చేస్తున్నారని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ టెక్కలి పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం నుంచి వైసీపీ కార్యకర్తలపై దాడులకు సంబంధించి చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షులు అజయ్ కుమార్, తదితరులు ఉన్నారు.

News July 16, 2024

కృష్ణా జిల్లాలో 36.2 మి.మీల వర్షపాతం

image

కృష్ణా జిల్లాలో 36.2 మి.మీల సరాసరి వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను వెల్లడించారు. అత్యధికంగా బంటుమిల్లి మండలంలో 88.8 మి.మీలు నమోదవ్వగా అత్యల్పంగా బాపులపాడు మండలంలో 1.6 మి.మీలు వర్షపాతం నమోదైందని వివరించారు.

News July 16, 2024

‘పాలకొల్లు మంత్రిగారి తాలూకా’ పేరుతో భారీ కటౌట్

image

పాలకొల్లు పట్టణం లాకు సెంటర్లో ఏర్పాటుచేసిన మంత్రి నిమ్మల రామానాయుడు భారీ కటౌట్ అందరినీ విశేషంగా ఆకర్షిస్తోంది. కటౌట్‌పైన ‘పాలకొల్లు మంత్రి గారి తాలూకా’ అని ప్రత్యేకంగా రాయించారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ, ప్రజల మన్ననలు పొంది 3వ సారి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధించిన నేపథ్యంలో అభిమానులు ఈ కటౌట్ ను ఏర్పాటుచేశారు.

News July 16, 2024

విశాఖ: వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌కు టోల్ ఫ్రీ

image

నూతనంగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కావలసిన వినియోగదారులు టోల్ ఫ్రీ నంబర్ 1912 కు ఫోన్ చేసి సర్వీసు పొందవచ్చునని ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ ఇమ్మడి పృథ్వితేజ్ తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి సర్కిళ్ల పరిధిలోని వినియోగదారులు కనెక్షన్‌ల కోసం ఈ నంబర్‌కి ఫోన్ చేయవచ్చునని తెలిపారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఈ విధానాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు.

News July 16, 2024

REWIND: తిరుపతిలో గద్ద ముక్కు ఆటోలు

image

అవి 1980 నాటి రోజులు. అప్పుడే తిరుపతి పట్టణంగా అభివృద్ధి చెందుతోంది. ఆ రోజుల్లో తిరుచానూరు, రేణిగుంటకు వెళ్లాలంటే ఈ గద్ద ముక్కు ఆటోలే(టెంపోలు) దిక్కు. కోనేటి కట్ట దగ్గర(నేటి విష్ణు నివాసం) నుంచి చిత్తానూరు(తిరుచానూరు)కు ఇవి బయల్దేరేవి. రబ్బరు గొట్టం హారన్ మోగిస్తే వచ్చే శబ్దంతో ఎంతటోడైనా హడలేత్తి పక్కకు జరగాలసిందే. ఇందులో ప్రయాణం మరచిపోలేని అనుభూతి. మీరు ఇందులో ప్రయాణించి ఉంటే కామెంట్ చేయండి.

News July 16, 2024

హిందూపురం: 12ఏళ్లకే భగవద్గీత శ్లోకాలు చూడకుండా చెప్పడంలో దిట్ట

image

హిందూపురానికి చెందిన రాజేశ్, శ్రీలక్ష్మీల కుమారుడు రవికుమార్ 12ఏళ్లకే భగవద్గీతలోని 700 శ్లోకాలను చూడకుండా వినిపిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. ఏ శ్లోకం అడిగినా సులువుగా చెప్పగలగడంలో దిట్ట. భగవద్గీతపై ఆసక్తితో మైసూరులోని దత్తపీఠం నుంచి 7నెలల ఆన్‌లైన్‌లో శిక్షణ పొందాడు. పీఠంలో నిర్వహించిన భగవద్గీత శ్లోకాల పోటీల్లో ప్రతిభచాటి గణపతి సచ్చిదానంద చేతులమీదుగా బంగారు పతకం అందుకున్నాడు.

News July 16, 2024

కర్నూలు ఎస్పీ ప్రస్థానం

image

కర్నూలు జిల్లా ఎస్పీగా జీ.బిందు మాధవ్ బాధ్యతలు చేపట్టారు. విజయవాడకు చెందిన బిందుమాధవ్ 2017 బ్యాచ్‌కు చెందిన IPS అధికారి. SVPNPAలో శిక్షణ తర్వాత మొదట ప్రకాశం జిల్లా గ్రేహౌండ్స్‌లో పని చేశారు. అనంతరం రంపచోడవరం ఏఎస్పీగా, గుంటూరు సెబ్ జాయింట్ డైరెక్టర్‌గా, పల్నాడు అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు. ఎస్పీగా పదోన్నతి పొందిన తర్వాత గ్రేహౌండ్స్ ఎస్పీగా, పల్నాడు జిల్లా ఎస్పీగా పని చేశారు.

News July 16, 2024

కడప, అన్నమయ్య జిల్లాలో రూ.1000 కోట్ల భూ ఆక్రమణలు: సీఎం

image

కడప, అన్నమయ్య జిల్లాలో సుమారు రూ.1000 కోట్లు విలువగల భూములు వైసీపీ నాయకులు, కార్యకర్తల చేతిలో ఉన్నాయని సీఎం చంద్రబాబు ఆరోపించారు. తాజాగా సహజ వనరుల దోపిడీపై శ్వేతపత్రం విడుదల చేశారు. అందులో కడప జిల్లాలో 5,796.54 ఎకరాల భూములను 3,357 మందికి, అన్నమయ్య జిల్లాలో 103.15 ఎకరాలను 84 మందికి అక్రమంగా కట్టబెట్టినట్లు సీఎం ప్రకటించారు. ఇటువంటి వారిని విచారించి కఠిన శిక్షలు పడేలా చేస్తానని పేర్కొన్నారు.

News July 16, 2024

ప.గో.: గురుకులాల్లో పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

గురుకులాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి ప.గో. జిల్లా సమన్వయ అధికారి భారతి తెలిపారు. పురుష అభ్యర్థులు గణితం-5, సోషల్-1, బోటనీ-1, ఇంగ్లిష్-1, హిందీ-1, హెల్త్ సూపర్వైజర్-1, పీఈటీ-2, మహిళా అభ్యర్థులు హిందీ-1,బోటనీ-1, జువాలజీ-1,ఇంగ్లీషు-2 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ నెల 18 లోగా సర్టిఫికెట్ల జిరాక్స్‌లను జిల్లా సమన్వయ అధికారి, AP సాంఘిక సంక్షేమ శాఖ ఏలూరుకు పంపాలి.