Andhra Pradesh

News July 16, 2024

అమరావతిలో ZSI పనులు ప్రారంభం

image

అమరావతి ప్రాంతంలోని రాయపూడి గ్రామంలో జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంస్థ నిర్మాణ పనులు ప్రారంభించనుంది. సోమవారం రాయపూడి పంచాయితీలో ప్రాథమిక అనుమతుల కోసం రుసుము చెల్లించి దరఖాస్తు చేసింది. ఈ సంస్థకు 2019 ఫిబ్రవరిలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రెండు ఎకరాల భూమిని 60 ఏళ్లకు లీజు ప్రాతిపదికన కేటాయించారు. ఈ సంస్థ దేశంలోని వివిధ జంతు జాతులపై సర్వే చేస్తూ, వాటి మనుగడకు పరిశోధనలు సాగిస్తుంది.

News July 16, 2024

అమరావతిలో ZSI పనులు ప్రారంభం

image

అమరావతి ప్రాంతంలోని రాయపూడి గ్రామంలో జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంస్థ నిర్మాణ పనులు ప్రారంభించనుంది. సోమవారం రాయపూడి పంచాయితీలో ప్రాథమిక అనుమతుల కోసం రుసుము చెల్లించి దరఖాస్తు చేసింది. ఈ సంస్థకు 2019 ఫిబ్రవరిలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రెండు ఎకరాల భూమిని 60 ఏళ్లకు లీజు ప్రాతిపదికన కేటాయించారు. ఈ సంస్థ దేశంలోని వివిధ జంతు జాతులపై సర్వే చేస్తూ, వాటి మనుగడకు పరిశోధనలు సాగిస్తుంది.

News July 16, 2024

శ్రీకాకుళం: MBA పరీక్షల ఫలితాలు విడుదల

image

ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో జనవరి- 2024లో నిర్వహించిన MBA 1వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. MBA -ఫారిన్ ట్రేడ్, రూరల్ మేనేజ్‌మెంట్, బ్యాంకింగ్ & ఫైనాన్షియల్ సర్వీసెస్ బ్రాంచ్‌ల ఫలితాలు విడుదల చేశామని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది. పరీక్ష ఫలితాలకై అధికారిక వెబ్‌సైట్ https://results.andhrauniversity.edu.in/ చెక్ చేసుకోవాలని సూచించింది.

News July 16, 2024

కృష్ణా: ఇగ్నోలో అడ్మిషన్ల దరఖాస్తు గడువు పొడిగింపు

image

ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) ద్వారా ఆన్‌లైన్, డిస్టెన్స్ లెర్నింగ్ విధానంలో పలు కోర్సులలో అడ్మిషన్లకై దరఖాస్తు చేసుకునే గడువును పొడిగించారు. నిన్నటితో ఈ గడువు ముగియగా, జులై 31 వరకు పెంచినట్లు వర్సిటీ వర్గాలు తెలిపాయి. వివరాలకు విజయవాడలోని ఇగ్నో స్టడీ సెంటర్‌లో సంప్రదించాలని లేదా https://ignouiop.samarth.edu.in/ వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించాయి.

News July 16, 2024

శ్రీకాకుళం: ఇగ్నోలో అడ్మిషన్ల గడువు పొడిగింపు

image

ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో) ద్వారా ఆన్‌లైన్, డిస్టెన్స్ లెర్నింగ్ విధానంలో పలు కోర్సులలో అడ్మిషన్లకై దరఖాస్తు చేసుకునే గడువును పొడిగించారు. సోమవారంతో గడువు ముగియగా, జులై 31 వరకు గడువు పొడిగించినట్లు వర్శిటీ వర్గాలు తెలిపాయి. వివరాలకు శ్రీకాకుళంలోని ఇగ్నో స్టడీ సెంటర్‌లో సంప్రదించాలని లేదా https://ignouiop.samarth.edu.in/ వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించాయి.

News July 16, 2024

ప.గో.: విద్యుత్ శాఖలో నలుగురికి పదోన్నతులు

image

ఉమ్మడి ప.గో. జిల్లాకు సంబంధించి విద్యుత్ శాఖలో పని చేస్తున్న సీనియర్ అసిస్టెంట్లు నలుగురికి జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్లుగా పదోన్నతులు కల్పించారు. ఈ మేరకు SE సాల్మన్ రాజు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్.వేణుగోపాల్‌ను తాడేపల్లిగూడెం నుంచి తణుకు, ఎం.శ్రీనివాసరాజును భీమవరం, చంద్రకళను నిడదవోలు నుంచి ఏలూరు టౌన్, యూవీవీ భాస్కరరావును తాడేపల్లిగూడెం నుంచి నిడదవోలు జేఏవోగా నియమించారు.

News July 16, 2024

కడప: జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో వర్షం

image

ఉపరితల ఆవర్తనం కారణంగా జిల్లా వ్యాప్తంగా 35 మండలాల్లో సోమవారం వర్షం కురిసింది. వల్లూరులో 14.8 మి.మీ, చెన్నూరులో 11.2, వేంపల్లిలో 9.2, విఎన్ పల్లెలో 9, పోరుమామిళ్లలో 8.2, చక్రాయపేటలో 8, సిద్ధవటంలో 7.4, వేములలో 7, దువ్వూరులో 6.8, కాశినాయనలో 6.4, సింహాద్రిపురం, కాజీపేట, కడపలో 6.2, కమలాపురంలో 5.4, కలసపాడు, బద్వేల్, పెద్దముడియంలలో 5.2, మైదుకూరులో 5, రాజుపాలెంలో 4.8 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.

News July 16, 2024

ఒంగోలులో రూ.101 కోట్ల ఆస్తులను కొట్టేశారు: సీఎం

image

ఒంగోలులో పలువురు రూ.101 కోట్లు విలువ చేసే ఆస్తులను కొట్టేశారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. సోమవారం సహజ వనరుల దోపిడీపై శ్వేతపత్రం విడుదల చేశారు. అందులో వైసీపీ ప్రభుత్వలో కొందరు నాయకులు, అధికారులు దొంగ పత్రాలు సృష్టించి ప్రభుత్వ, ప్రైవేటు భూములను కాజేశారని చెప్పుకొచ్చారు. వాటి విలువ సుమారు రూ.101కోట్లు ఉంటుందని తెలిపారు. ఇటువంటి వారిని విచారించి కఠిన శిక్షలు పడేలా చేస్తానని పేర్కొన్నారు.

News July 16, 2024

ఉమ్మడి గుంటూరు జిల్లాకు కొత్త బస్సులు

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలో RTCకి కొత్త బస్సులు కేటాయించడంతో ఆయా మార్గాల్లో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందనున్నాయి. కొన్నాళ్లుగా డొక్కు బస్సులతో ఇబ్బందిపడిన ప్రయాణికులకు కొత్త బస్సుల రాకతో ఊరట కలగనుంది. ఉమ్మడి జిల్లాకు RTC సొంత బస్సులు, అద్దె బస్సులు కలిసి 130 వరకు కొత్తవి సమకూరనున్నాయి. ఇప్పటికే 30 బస్సులు ఆయా డిపోలకు రాగా మిగిలినవి నెల నుంచి 2 నెలల వ్యవధిలో తీసుకురానున్నట్లు అధికారులు చెబుతున్నారు.

News July 16, 2024

VZM: వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కావాలా?

image

కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కావాల్సిన వినియోగదారులు టోల్ ఫ్రీ నంబరు 1912 కు ఫోన్ చేసి సర్వీసు పొందవచ్చని ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి సర్కిళ్ల పరిధిలోని వినియోగదారులు కనెక్షన్‌లను ఈ నంబరుకి ఫోన్ చేయవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం మీసేవా కేంద్రాలు, సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ జరుగుతుందన్నారు.