Andhra Pradesh

News July 16, 2024

VZM: రైల్వే ఉద్యోగి సూసైడ్

image

విజయనగరంలోని అలకానంద కాలనీలో ఓ రైల్వే ఉద్యోగి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వన్ టౌన్ పోలీసుల వివరాల ప్రకారం, రైల్వేలో టీఏగా పనిచేస్తున్న శంకర్రావు మధ్యానికి బానిస కావడంతో భార్య ఆదివారం రాత్రి మందలించింది. మనస్తాపానికి గురైన శంకర్రావు తన రూమ్‌లో ఉరివేసుకున్నాడు. సోమవారం ఉదయం గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

News July 16, 2024

రావులపాలెం: రికార్డు స్థాయిలో అరటి ధరలు

image

అరటి ధరలు రికార్డు స్థాయికి చేరడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నెల రోజుల క్రితం రేట్లు లేక దిగాలు పడిన రైతులకు తాజా ధరలు ఆనందం కలిగిస్తున్నాయి. కర్పూర గెల గరిష్ఠంగా రూ.500, చక్రకేళి, ఎర్రచక్ర కేళి, అమృతపాణి, బొంత గెలలకు సైతం ధరలు పెరిగాయి. రాష్ట్రంలో అతిపెద్ద మార్కెట్ అయిన రావులపాలెం యార్డుకు నిత్యం 10 నుంచి 15 వేలు గెలలు వస్తుంటాయి. వీటిని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు.

News July 16, 2024

దేశపాత్రునిపాలెంలో దారుణ ఘటన

image

పరవాడ మండలం దేశపాత్రునిపాలెం గ్రామంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. గ్రామంలో సాయి నగర్ కాలనీ రైల్వే ట్రాక్ సమీపంలో గల తుప్పల్లో సోమవారం అప్పుడే పుట్టిన మగ శిశువును గుర్తుతెలియని వ్యక్తులు పడేశారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శిశువును పోస్టుమార్టం కోసం పంపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

News July 16, 2024

ఏయూ: సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని బ్యాచిలర్ ఆఫ్ ఫైనార్ట్స్ 2వ సెమిస్టర్, 6వ సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ ఫలితాలు, ఎంఎస్సీ మెరైన్ బయోటెక్నాలజీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షలు విభాగం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష ఫలితాలను ఏయూ వెబ్‌సైట్‌లొ పొందుపరిచామని, విద్యార్థులు తమ రిజిస్టర్ నంబర్‌ను నమోదు చేసి ఫలితాలను పొందవచ్చని తెలిపారు.

News July 16, 2024

శ్రీకాకుళం: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

విజయవాడ డివిజన్‌లో ట్రాఫిక్ నిర్వహణ కారణాల రీత్యా శ్రీకాకుళం, పలాస మీదుగా వెళ్లే నం.12509 SMV బెంగుళూరు- గౌహతి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణించే మార్గాన్ని మార్పు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ట్రైన్‌ జులై 29 నుంచి ఆగస్టు 30 వరకు విజయవాడ- తాడేపల్లిగూడెం మీదుగా కాక విజయవాడ- గుడివాడ- భీమవరం మార్గం గుండా నిడదవోలు చేరుకుంటుందన్నారు.

News July 16, 2024

బి.కోడూరు: పాఠశాల స్థలాన్ని తనఖా పెట్టారు: టీడీపీ

image

మండల పరిధిలోని గోవిందాయపల్లె జిల్లా ఉన్నత పాఠశాలను వైసీపీ నాయకులు ఆన్‌లైన్లో నమోదు చేసుకుని రుణాలు పొందారని మండల టీడీపీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, రాష్ట్ర రైతు కార్యదర్శి రమణారెడ్డి ఆరోపించారు. వారు మాట్లాడుతూ.. గోవిందాయ పల్లె జిల్లా ఉన్నత పాఠశాల 40 ఏళ్ల నుంచి అక్కడ ఉందన్నారు. 4.27 సెంట్లు భూమిని కొండ వెంకటసుబ్బమ్మ పేరిట ఆన్‌లైన్లో నమోదు చేసుకున్నారని విమర్శించారు.

News July 16, 2024

విజయవాడ: కిడ్నీ రాకెట్ నిందితుడి అరెస్ట్

image

విజయవాడ కిడ్నీ రాకెట్‌ కేసులో ఒక నిందితుడిని గుంటూరు నగరపాలెం పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. కిడ్నీ ఇస్తే రూ.30 లక్షలు ఇస్తామని ఓ ముఠా గుంటూరుకు చెందిన గార్లపాటి మధుబాబు వద్ద కిడ్నీ తీసుకున్నారు. చివరికి డబ్బు ఇవ్వకుండా మోసం చేయడంతో మధుబాబు గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి అనే వ్యక్తిని పట్టుకున్నారు.

News July 16, 2024

నంద్యాల: ఊటీ కాదు మన “నల్లమల” అడవే

image

నంద్యాల- గిద్దలూరు ఘాట్ రోడ్డులో అల్లుకుపోయిన పచ్చటి దట్టమైన చెట్లతో నల్లమల అడవి అబ్బురపరుస్తుంది. దీనికి తోడు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మంచు దుప్పటి నల్లమలను కప్పేసింది. ఊటీ, కొడైకెనాల్ ప్రాంతాలను తలపించేలా పొగ మంచు అందాలు ప్రయాణికులు, పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. నంద్యాల నుంచి విజయవాడకు బస్సు, రైలు మార్గం ద్వారా ప్రయాణించే వారు ఈ దృశ్యాలను చూసి మంత్రముగ్ధులవుతున్నారు.

News July 16, 2024

ఫార్మసీ పరీక్షా ఫలితాలు విడుదల

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఫార్మసీ కళాశాల పరిధిలో ఏప్రిల్ నెలలో నిర్వహించిన బీఫార్మసీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్, సప్లమెంటరీ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు ఏయూ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షా ఫలితాలను ఏయూ పోర్టల్‌లో విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. విద్యార్థులు నేరుగా పరీక్ష ఫలితాలను వెబ్‌సైట్ నుంచి పొందవచ్చు.

News July 16, 2024

జేసీ దివాకర్‌రెడ్డిపై కేసు కొట్టివేత

image

అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పై నమోదైన కేసును సోమవారం విజయవాడలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం కొట్టేసింది. 2019 డిసెంబరు 19న అనంతపురం నగరంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జిల్లా పార్టీ సమావేశంలో జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ.. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై రెండో పట్టణ ఏఎస్ఐ త్రిలోక్ నాథ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.