Andhra Pradesh

News July 16, 2024

కాకినాడ: మాజీ సిపాయి మృతి

image

డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం అయినాపురం గ్రామానికి చెందిన మాజీ సిపాయి సబ్బతి భీమరాజు (94) మృతిచెందారు. కాకినాడలోని స్థానిక కచ్చేరిపేటలో మనుమరాలు నివాసంలో ఉంటూ సోమవారం తుదిశ్వాస విడిచారు. భీమరాజు సైన్యంలో బెటాలియన్ హవల్దార్ మేజర్‌గా పనిచేశారు. గతంలో పాకిస్థాన్, చైనా యుద్ధాల్లోనూ పాల్గొన్నారు. కాగా ఆయనకు నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు.

News July 16, 2024

భోగాపురం భూములపై సీఎం రియాక్షన్

image

భోగాపురం మండలంలో అసైన్డ్ భూములపై సీఎం చంద్రబాబు స్పందించారు. వైసీపీ ప్రభుత్వం భూముల రీసర్వే పేరిట భూములను దోచుకున్నారని మండిపడ్డారు. మాజీ సీఎస్ జవహార్‌రెడ్డి భోగాపురం మండలంలోని అసైన్డ్ భూములను బినామీల పేర్లతో దోచుకున్నారు కదా అని పలువురు విలేకర్లు సీఎంను ప్రశ్నించారు. దీనికి స్పందించి ఉన్నత స్థాయిలో విచారణ జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. దీనికి ప్రజల నుంచి మద్దుతు కోరుతున్నామని తెలిపారు.

News July 16, 2024

ఏలూరు: 16 ఏళ్ల మైనర్‌పై అత్యాచారం

image

ఏలూరు జిల్లాలో ఓ మైనర్‌పై అత్యాచారం జరిగింది. పోలీసుల వివరాలు..టి.నరసాపురం మండలానికి చెందిన ఓ బాలిక జంగారెడ్డిగూడెంలో ఇంటర్ చదువుతూ హాస్టల్‌లో ఉంటుంది. ఓసారి ఆమె ఇంటికి వచ్చినపుడు గ్రామానికి చెందిన తాడి నాగకుమార్ అత్యాచారం చేశాడు. మళ్లీ ఈ నెల 6న బెదిరించి గ్రామశివారుకు పిలిపించి బలవంతంగా మరోముగ్గురితో కలిసి విశాఖపట్నం తీసుకెళ్లి హోటల్‌లో అత్యాచారం చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో వారిపై కేసునమోదైంది.

News July 16, 2024

విశాఖను అడ్డగోలుగా దోచుకున్నారు: సీఎం చంద్రబాబు

image

YCP నాయకులు విశాఖను అడ్డగోలుగా దోచుకున్నారని CM చంద్రబాబు ఆరోపించారు. ‘రామానాయుడు స్టుడియో భూములలో వాటా కొట్టేయాలని చూశారు. ఓల్డేజ్ హోమ్‌కోసం ఇచ్చిన హయగ్రీవ భూములను మాజీ ఎంపీ ఎంవీవీ దోచుకోవాలని చూశారు. తన సంస్థకు 10.57 ఎకరాలు కేటాయించి, ఆ భూమిలో లబ్ధిదారులకు 0.96 శాతం వాటా ఇచ్చారు. ఆయన కంపెనీకి రూ.65 కోట్ల విలువ చేసే TDR బాండ్లను జారీ చేసి కుంభకోణానికి పాల్పడ్డారు’ అని చెప్పారు.

News July 16, 2024

సిక్కోలులో రూ.215 కోట్లు జరిమానా వేసి లాక్కున్నారు: సీఎం

image

శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఆక్రమణలపై సీఎం చంద్రబాబు సోమవారం శ్వేతపత్రం విడుదల చేశారు. జిల్లాలో ఎంఎస్‌సీ గ్రానైట్‌కు రూ. 215 కోట్లు జరిమానా వేశారని అన్నారు. చివరకు రైల్వేకోడూరు మాజీ MLA కి వంశధార గ్రానైట్ పేరిట సొంతం చేసుకున్నారని ఆరోపించారు. ఈ అక్రమాలకు పాల్పడిన వారెవ్వరినీ వదిలేదిలేదని హెచ్చరించారు.

News July 16, 2024

రూ.15 కోట్లు టోకరా వేసిన ఔషధ వ్యాపారి

image

నరసరావుపేటలో ఓ ఔషధ వ్యాపారి అదృశ్యం కావడం సంచలనం రేకెత్తించింది. రాజాగారికోటలో ఔషధ దుకాణం నిర్వహిస్తున్న వ్యాపారి 2రోజులుగా కనిపించకపోవడంతో, అతనికి అప్పులిచ్చినవారు అతని అచూకీ కోసం ఆరా తీస్తున్నారు. ఇంటికి తాళం వేసి ఉండటం, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో దివాళా తీసినట్లు భావిస్తున్నారు. సుమారు రూ.15 కోట్ల అప్పులు ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై తమకు ఫిర్యాదు అందలేదని 2వ పట్టణ సీఐ భాస్కర్ తెలిపారు.

News July 16, 2024

మార్టూరు: రాజుపాలెంలో కత్తితో దాడి

image

మార్టూరు మండలంలోని రాజుపాలెంలో ఓ వ్యక్తి కత్తి దాడికి గురై తీవ్రంగా గాయపడిన ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామంలోని తూర్పు కాలనీలో జె. నాగేంద్రబాబు, జె. చిన నాగరాజు మధ్య రేగిన వివాదంలో జె. శ్రీనివాసరావు వారిని విడదీసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో నాగరాజు కత్తితో శ్రీనివాసరావుపై దాడి చేయడంతో ఎడమ చేతికి గాయమైనట్లు వెల్లడించారు. క్షతగాత్రుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

News July 16, 2024

నెల్లూరు జిల్లాలో రేపటి నుంచే రొట్టెల పండగ..!

image

నెల్లూరు జిల్లాలో జులై 17 నుంచి 21 వరకు రొట్టెల పండుగ జరగనుంది. హిందూ, ముస్లింలనే భేద భావం లేకుండా ఈ రొట్టెల పండుగను ఘనంగా జరుపుకుంటారు. దేశం నలుమూలల నుంచి ఇక్కడికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. ఇక్కడ రొట్టె పట్టుకొంటె కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం.

News July 16, 2024

నేడు, రేపు సెలవు: చిత్తూరు DEO

image

మొహర్రం సందర్భంగా చిత్తూరు జిల్లాలోని పాఠశాలలకు మంగళ, బుధవారాల్లో సెలవు ప్రకటిస్తున్నట్లు డీఈవో దేవరాజు తెలిపారు. మంగళవారం ఆప్షనల్ సెలవుగా ఉంటుందన్నారు. ఆయా యాజమన్యాలు ఇష్టప్రకారమే మంగళవారం సెలవు అని.. బుధవారం ప్రభుత్వ సెలవు రోజని చెప్పారు. మరోవైపు తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లోనూ మంగళవారం ఆప్షనల్ హాలిడేగా ప్రకటించారు.

News July 16, 2024

కర్నూలు జిల్లాలో 1145 ఎకరాల భూమి ఆక్రమణ: సీఎం

image

వైసీపీ పాలనలో ‘సహజవనరుల దోపిడి’పై సీఎం చంద్రబాబు సోమవారం శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. రాష్ట్రంలో ఐదేళ్లలో 1.75లక్షల ఎకరాల భూములు ఆక్రమణకు గురయ్యాయని పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలో 1145 ఎకరాలు పేదలకు చెందిన భూమిని 856మంది వైసీపీ నేతలు రాయించేసుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీ కార్యాలయాలకు రూ.300కోట్ల భూమిని 33ఏళ్లు లీజుకు తీసుకున్నారని వెల్లడించారు.