Andhra Pradesh

News July 16, 2024

GOOD NEWS: నెల్లూరు: పోస్టాఫీసులో 116 ఉద్యోగాలు

image

పదవ తరగతి అర్హతతో బీపీఎం/ఏబీపీఎం ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. నెల్లూరు డివిజన్‌లో 63, గూడూరు డివిజన్‌లో 53 పోస్టులను పోస్టల్ డిపార్ట్‌‌మెంట్ భర్తీ చేయనుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఎంపికైన వారికి బీపీఎం అయితే రూ.12 వేలు+అలవెన్సులు, ఏబీపీఎం అయితే రూ.10 వేలు+అలవెన్సులు జీతంగా ఇవ్వనున్నారు. పూర్తి వివరాలకు www.appost.gdsonline వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.

News July 16, 2024

ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల కోసం ప్రతిపాదనలు: డీఈవో శైలజ

image

జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల కోసం అర్హులైన ఉపాధ్యాయుల నుంచి ప్రతిపాదనలు కోరుతున్నట్లు గుంటూరు డీఈవో పి. శైలజ తెలిపారు. జిల్లాలోని ఉపాధ్యాయులు కేంద్ర ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. ఈ నెల 21వ తేదీ తుది గడువు అని డీఈవో వెల్లడించారు. ఈ అవకాశాన్ని ఉపాధ్యాయులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.‌

News July 16, 2024

కడప: 22న డిగ్రీ విద్యార్థులకు వైవా-వోస్ పరీక్ష

image

యోగివేమన విశ్వవిద్యాలయం పరిధిలోని అనుబంధ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు ఈనెల 22వ తేదీ ఉదయం 10 గంటలకు వైవా- వోస్ నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ప్రొ. ఎన్. ఈశ్వరరెడ్డి తెలిపారు. లాంగ్ టర్మ్ ఇంటర్న్‌షిప్ ప్రాజెక్ట్ ఫీజు చెల్లించిన విద్యార్థులు వైవావోస్‌కు కడపలోని నాగార్జున మహిళా డిగ్రీ కళాశాలలో హాజరు కావాలని సూచించారు. విద్యార్థులు ప్రాజెక్ట్ రికార్డు హార్డ్ కాపీని సమర్పించాలన్నారు.

News July 16, 2024

టీచర్స్‌కు గమనిక.. దరఖాస్తు గడువు పెంపు

image

ఏలూరు జిల్లాలో అర్హత కలిగిన ఉపాధ్యాయులు జాతీయ అవార్డులకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు గడువు పెంచినట్లు విద్యాశాఖ అధికారి అబ్రహం తెలిపారు. http://natioonlawardstoteachers.education.gov.in వెబ్‌సైట్ నందు అప్లికేషన్స్ పొందుపరిచామన్నారు. ఆగస్టు 18 వరకు అవకాశం ఉందని తెలిపారు. SHARE IT..

News July 16, 2024

దర్గా లో అన్ని ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్

image

బారాషహీద్ దర్గా రొట్టెల పండుగకు విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను పక్కాగా చేపడుతున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. సోమవారం సాయంత్రం బారాషహీద్ దర్గా ప్రాంగణంలో రొట్టెల పండుగ ఏర్పాట్లను కలెక్టర్ ఆనంద్, జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పరిశీలించారు. దర్గా ప్రాంగణంలోని పోలీస్ కంట్రోల్ రూమ్, అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు.

News July 16, 2024

విచారణ జరిపి సమస్య పరిష్కరిస్తాం: అడిషనల్ ఎస్పీ

image

ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ టి.పి.విఠలేశ్వర్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల యొక్క వ్రాతపూర్వక అర్జీలను అడిషనల్ ఎస్పీ స్వయంగా స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులపై వెంటనే చట్ట పరిధిలో విచారణ జరిపి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

News July 16, 2024

శ్రీకాకుళం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: APSDMA

image

వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని దక్షిణ ఒడిశా తీరం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ(APSDMA) తెలిపింది. ఈ అల్పపీడనం కారణంగా మంగళవారం శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA స్పష్టం చేసింది. ఈ మేరకు జిల్లా వాసులు అప్రమత్తంగా ఉండాలని తాజాగా హెచ్చరించింది. 

News July 16, 2024

శ్రీకాకుళం: పోస్టాఫీసులో ఉద్యోగాలు

image

పదవ తరగతి అర్హతతో బీపీఎం/ఏబీపీఎం ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. శ్రీకాకుళం డివిజన్‌లో 79 పోస్టులను పోస్టల్ డిపార్ట్‌‌మెంట్ భర్తీ చేయనుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఎంపికైన వారికి బీపీఎం అయితే రూ.12 వేలు+అలవెన్సులు, ఏబీపీఎం అయితే రూ.10 వేలు+అలవెన్సులు జీతంగా ఇవ్వనున్నారు. పూర్తి వివరాలకు www.appost.gdsonline వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.

News July 15, 2024

కృష్ణా జిల్లాలో TODAY టాప్ న్యూస్ ఇవే

image

* కృష్ణా: యువతకు శుభవార్త చెప్పిన APSSDC
* కృష్ణా: రోడ్డు ప్రమాదంలో 16 నెలల బాలుడి మృతి
* జగ్గయ్యపేట ఫ్యాక్టరీ ఘటన.. మరో వ్యక్తి మృతి
* కంచికచర్ల వద్ద ఘోర విషాదం.. ముగ్గురి మృతి
* విజయవాడలో అర్ధరాత్రి కారు బీభత్సం
* కృష్ణా జిల్లాలో తగ్గని ఉల్లి, టమాటా ధరలు
* విజయవాడలో కారు డ్రైవర్ ఆత్మహత్య
* కృష్ణా: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక
* ఎన్టీఆర్ జిల్లాలో 65 పోస్టల్ ఉద్యోగాలు

News July 15, 2024

జేసీ, కేతిరెడ్డి కుటుంబ సభ్యులకు బెయిల్ మంజూరు

image

తాడిపత్రిలో ఎన్నికల సందర్భంగా జరిగిన అల్లర్ల కేసులో నిందితులకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులకు, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కుటుంబ సభ్యులకు బెయిల్ మంజూరు చేసింది. కాగా, ఇప్పటికే అల్లర్లపై నమోదైన కేసులలో అందరికీ బెయిల్ మంజూరైంది.