Andhra Pradesh

News July 15, 2024

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి: డీ.కే బాలాజీ

image

వివిధ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ డీ.కే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లో నిర్వహించిన ఉద్యోగుల గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఉద్యోగుల సమస్యలను జిల్లా కలెక్టర్ విని సంబంధిత అధికారులను పిలిపించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

News July 15, 2024

FLASH: కర్నూలు ఎస్పీగా బిందు మాధవ్ బాధ్యతలు

image

కర్నూలు నూతన ఎస్పీగా జీ.బిందు మాధవ్ సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని తన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఎస్పీ కార్యాలయం వద్ద ఆయన ఏఆర్ పోలీస్ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఎస్పీ మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పటిష్ఠ చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రజలకు సేవలందించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని స్పష్టం చేశారు.

News July 15, 2024

శ్రీకాకుళం: B.Ed మొదటి సెమిస్టర్ పరీక్షలు టైం టేబుల్ విడుదల

image

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ స్పెషల్ B.Ed.(M.R) కోర్సులకు సంబంధించి మొదటి సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్‌ను యూనివర్సిటీ అధికారులు సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా పరీక్షలు ఈనెల 23వ తేదీ నుంచి 29వ తేదీ వరకు జరగనున్నట్లు పేర్కొన్నారు. కావున B.Ed అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నట్లు చెప్పారు.

News July 15, 2024

ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు: కలెక్టర్ సృజన

image

ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించబోమని బాధ్యతతో విధులు నిర్వర్తించి ఉన్నతాధికారులు ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించినప్పుడే లక్ష్యాలు సాధించగలమని కలెక్టర్ సృజన అన్నారు. సోమవారం జిల్లా పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఆమె ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ.. విధులు నిర్వర్తించడంలో బాధ్యతగా వ్యవహరించాలన్నారు.

News July 15, 2024

సెంట్రల్ యూనివర్సిటీ అధికారులతో ఎంపీ భేటీ

image

అనంతపురంలోని సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎస్ఏ కోరితో సోమవారం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ భేటీ అయ్యారు. యూనివర్సిటీలో మొదటి దశలో జరుగుతున్న నిర్మాణం పనుల పురోగతిపై చర్చించారు. మొదటి దశ పనులు అక్టోబర్ లోపు పూర్తి చెయ్యాలని ఆదేశించారు. వచ్చే అకాడమిక్ సంవత్సరంలో నూతన కోర్సులు ప్రవేశ పెట్టే విధంగా చూడాలని కోరారు.

News July 15, 2024

తూ.గో: గల్లంతై 2 రోజులకు దొరికిన DEAD BODY

image

గంగవరం మండలం నెల్లిపూడి వాగులో శనివారం <<13622137>>కొట్టుకుపోయిన <<>>లోత మోహన్‌రావు మృతదేహం సోమవారం ఉదయం లభ్యమైంది. వాగు పొంగుతున్న సమయంలో మోహన్ తన స్కూటీపై వంతెన దాటుతుండగా అదుపు తప్పి కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. నెల్లిపూడి శివారులో కాలువ మధ్య పొదల్లో మృతదేహం దొరికింది. పోస్టుమార్టం నిర్వహించి డెడ్‌బాడీని కుటుంబీకులకు అప్పగించినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు.

News July 15, 2024

GOOD NEWS నెల్లూరు: పోస్టాఫీసులో 116 ఉద్యోగాలు

image

పదవ తరగతి అర్హతతో బీపీఎం/ఏబీపీఎం ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. నెల్లూరు డివిజన్‌లో 63, గూడూరు డివిజన్‌లో 53 పోస్టులను పోస్టల్ డిపార్ట్‌‌మెంట్ భర్తీ చేయనుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఎంపికైన వారికి బీపీఎం అయితే రూ.12 వేలు+అలవెన్సులు, ఏబీపీఎం అయితే రూ.10 వేలు+అలవెన్సులు జీతంగా ఇవ్వనున్నారు. పూర్తి వివరాలకు www.appost.gdsonline వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.

News July 15, 2024

నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దుతా: ఎస్పీ మహేశ్వర్ రెడ్డి

image

శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో నూతన ఎస్పీ మహేశ్వర్ రెడ్డి జిల్లా అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, పలువురు అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ముందుగా అధికారులను పరిచయం చేసుకొని, జిల్లా పరిస్థితులపై సమీక్షించారు. మహిళల రక్షణకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఎస్పీ తెలిపారు. నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు పోలీస్ అధికారులంతా కలిసికట్టుగా పనిచేసి, సహకరించాలని కోరారు.

News July 15, 2024

మాజీ మంత్రి గుడివాడపై విశాఖ సీపీకి ఫిర్యాదు

image

మాజీ మంత్రి గుడివాడపై చర్యలు తీసుకోవాలని తెలుగు శక్తి రాష్ట్ర అధ్యక్షుడు బీవీ రామ్ విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత భాగ్చీకి ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపించారు. ఉత్తరాంధ్ర ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా మాజీ మంత్రి వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు. తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ కూడా వచ్చాయని సీపీ దృష్టికి తీసుకెళ్లారు.

News July 15, 2024

చిత్తూరు: పోస్టాఫీసులో 146 ఉద్యోగాలు

image

పదవ తరగతి అర్హతతో బీపీఎం/ఏబీపీఎం ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. చిత్తూరు డివిజన్‌లో 67, తిరుపతి డివిజన్‌లో 79 పోస్టులను పోస్టల్ డిపార్ట్‌‌మెంట్ భర్తీ చేయనుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఎంపికైన వారికి బీపీఎం అయితే రూ.12 వేలు+అలవెన్సులు, ఏబీపీఎం అయితే రూ.10 వేలు+అలవెన్సులు జీతంగా ఇవ్వనున్నారు. పూర్తి వివరాలకు www.appost.gdsonline వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.