Andhra Pradesh

News July 15, 2024

ఎన్టీఆర్: జిల్లాలో విజయవంతంగా జలశక్తి అభియాన్‌

image

ఎన్టీఆర్ జిల్లాలో చేపడుతున్న జలశక్తి అభియాన్‌ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని కలెక్టర్‌ సృజన తెలిపారు. కలెక్టరేట్‌ క్యాంప్‌ కార్యాలయంలో సోమవారం జలశక్తి అభియాన్‌ కార్యక్రమం ద్వారా జిల్లాలో చేపట్టి పూర్తయిన, చేపడుతున్న పనుల ప్రగతిని పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో జలశక్తి అభియాన్‌ కార్యక్రమాన్ని రెండు దశలలో చేపట్టడం జరిగిందన్నారు.

News July 15, 2024

గుంటూరు: ఆరుగురు నిందితులకు బెయిల్ నిరాకరణ

image

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఆరుగురు నిందితులకు గుంటూరులోని జిల్లా కోర్టు బెయిల్ నిరాకరించింది. నిందితుల బెయిల్ పిటిషన్‌పై న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టింది. అయితే అనారోగ్య కారణాలతో గిరి రాంబాబు అనే వ్యక్తికి మాత్రం బెయిల్ ఇచ్చింది. ఇదే కేసులో మరికొంతమంది వైసీపీ నేతలు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

News July 15, 2024

ప్రతి శుక్రవారం తనిఖీలు నిర్వహించాలి: కలెక్టర్

image

మండల స్థాయి అధికారులు వారివారి మండలాల పరిధిలో ప్రతి శుక్రవారం తనిఖీలు నిర్వహించాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. సోమవారం ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రతి శుక్రవారం సచివాలయాలు, పాఠశాలలు, వసతి గృహాలు, రైతు సేవా కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రులను తనిఖీ చేసి సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు.

News July 15, 2024

నెల్లిమర్ల ఎమ్మెల్యే మాధవిని సత్కరించిన పవన్ కళ్యాణ్

image

నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవికి ఘన సత్కారం లభించింది. తాడేపల్లి జనసేన కార్యాలయంలో జనసేన ప్రజా ప్రతినిధుల సత్కార సభ సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధకి జనసేన అధినేత, డిప్యూటీ సీఎం కొణెదల పవన్ కళ్యా‌ణ్ దుశ్శాలువ కప్పి పుష్పగుచ్చం అందించి సత్కరించారు. ఈ సందర్భంగా సార్వత్రిక ఎన్నికలలో ఘనవిజయం సాధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలను పవన్ సత్కరించారు.

News July 15, 2024

శ్రీకాకుళం: ఈనెల 17న జిల్లా సాఫ్ట్ బాల్ జట్టు ఎంపిక

image

శ్రీకాకుళం నగరంలోని స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఈనెల 17న ఉదయం 9 గంటలకు సీనియర్ సాఫ్ట్ బాల్ రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా జట్టు (పురుషులు, స్త్రీలు) ఎంపికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు నరసింహారాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు ఆగస్టు 10 నుంచి 12వ తేదీ వరకు గుంటూరులో జరిగే రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీల్లో పాల్గొంటారన్నారు.

News July 15, 2024

మదనపల్లె వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

image

ప్రైవేటు బస్సును బైకు ఢీకొని ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందిన విషాదకర ఘటన సోమవారం సాయంత్రం మదనపల్లి మండలంలో చోటు చేసుకుంది. సీఐ శేఖర్ కథనం ప్రకారం.. మదనపల్లె పట్టణం, బెంగుళూరు రోడ్డులోని చీకిలబైలు సరిహద్దు చెక్‌పొస్ట్ వద్ద ఓ ప్రయివేట్ బస్సును బైకు ఢీకొంది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు గుర్తు తెలియని యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

News July 15, 2024

విద్యార్థుల వైద్య సేవలపై మంత్రి సత్య కుమార్ ఆరా

image

నాయుడుపేట గురుకుల విద్యార్థుల అస్వస్థతపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ ఆరా తీశారు. ఆయన నేరుగా వైద్యులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి విద్యార్థులను పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా తక్షణ వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

News July 15, 2024

మొన్న డక్కిలి.. నేడు నాయుడుపేట

image

డక్కిలి గురుకులంలో ఓ విద్యార్థిని మృతి చెందిన సంఘటన మరువక ముందే నాయుడుపేట గురుకుల పాఠశాలలో కూడా 70 మందికి పైగా డయేరియాతో ఆసుపత్రుల పాలయ్యారు. అపరిశుభ్ర వాతావరణం, పర్యవేక్షణ లేకపోవడం కారణాలుగా పేర్కొంటున్నప్పటికీ విద్యార్థులు తిన్న ఆహారం కూడా కలుషితం అయిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం కలెక్టర్, ఎమ్మెల్యే విద్యార్థులను, గురుకుల సిబ్బందిని విచారించారు.

News July 15, 2024

జూలై 18న శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల

image

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన అక్టోబరు నెల కోటాను జూలై 18న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం జూలై 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు జూలై 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి.

News July 15, 2024

శ్రీకాకుళం: 18నుంచి కుష్ఠు వ్యాధిగ్రస్తులను గుర్తించే కార్యక్రమం

image

ఈనెల 18 నుంచి ఆగస్టు 2 వరకు కుష్ఠు వ్యాధిగ్రస్తులను గుర్తించే కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కుష్ఠు వ్యాధిగ్రస్తులను గుర్తించే కార్యక్రమం పోష్టర్‌ను ఆయన ఆవిష్కరణ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నవీన్, జిల్లా రెవెన్యూ అధికారి గణపతిరావు, తదితరులు పాల్గొన్నారు.