Andhra Pradesh

News July 15, 2024

ఎచ్చెర్ల: ఎన్నికల్లో విధుల్లో పోలీసు సిబ్బంది సహకారం అభినందనీయం

image

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆర్మ్డ్ పోలీస్ విభాగం అధికారులు, సిబ్బంది సంపూర్ణ సహకారం అందించారని ఎస్పీ జీ.ఆర్ రాధిక కొనియాడారు. సోమవారం ఎచ్చెర్ల ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ మైదానంలో ఆర్మ్డ్ రిజర్వ్ యాత్రంగం ఆధ్వర్యంలో సెరేమోని పరేడ్ నిర్వహించారు. పరేడ్‌లో భాగంగా ఆమె గౌరవ వందనం సమర్పించారు. సాధారణ బదిలీల్లో భాగంగా ఆమె DGP కార్యాలయంలో రిపోర్ట్ చేయనున్న విషయం విదితమే.

News July 15, 2024

కంచికచర్ల క్వారీలో ప్రమాదం.. ఒకరి మృతదేహం గుర్తింపు

image

కంచికచర్ల మండలం పరిటాల క్వారీలో కొండ రాళ్లు విడిగిపడి ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా పోలీసులు ఇప్పటికే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్వారీ పైనుంచి లూజు బోల్డర్స్, రాళ్లు కార్మికులపై పడటంతో ముగ్గురు మృతి చెందగా.. <<13632186>>వారిలో ఒకరి ఆచూకీ గుర్తించారు.<<>> మిగిలిన ఇద్దరికోసం సహాయక చర్యలు ముమ్మరం చేశారు. మృతులది జి. కొండూరు మండలం చెరువు మాధవరం గ్రామంగా తెలుస్తుంది.

News July 15, 2024

వీరఘట్టం: పొలం పని చేస్తూ గుండెపోటుతో రైతు మృతి

image

పొలం పని చేస్తూ వీరఘట్టం మండలం చిట్టపులివలసకు చెందిన జక్కు కృష్ణ (65)అనే రైతు సోమవారం మృతి చెందాడు. ఉదయం ఇంటి వద్ద అల్పాహారం తీసుకుని కూలీ పని కోసం గ్రామానికి చెందిన మరో రైతు పొలంలో పార పని చేస్తుండగా ఒక్కసారిగా కృష్ణ కుప్పకూలిపోయాడని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటివరకు చిన్న జ్వరం కూడా రాని కృష్ణ ఒక్కసారి గుండెపోటుతో మృతి చెందడం స్థానికుల్ని కలిచివేసింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News July 15, 2024

కంచికచర్ల వద్ద ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి

image

కంచికచర్ల మండలం పరిటాల క్వారీలో విషాదం చోటు చేసుకుంది. క్వారీ పైనుంచి లూజు బోల్డర్స్, రాళ్లు పెద్ద మొత్తంలో జారి కింద డ్రిల్లింగ్ వేస్తున్న కార్మికులపై పడ్డాయి. దీంతో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు జి.కొండూరు మండలం చెరువు మాధవరం గ్రామానికి చెందిన వారుగా తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు విచారిస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సిఉంది.

News July 15, 2024

గుమ్మలక్ష్మీపురంలో యూట్యూబర్ హర్షసాయి పేరిట ఛీటింగ్

image

యూట్యూబర్ హర్షసాయి పేరిట గుమ్మలక్ష్మీపురం మండలం టిక్కబాయికి చెందిన బిడ్డిక సోమేశ్ సైబర్ మోసానికి గురయ్యాడు. హర్షసాయి హెల్పింగ్ టీమ్ నుంచి రూ.3 లక్షలు సాయం చేస్తామని యువకుడి ఫోన్ కు మెసేజ్ వచ్చింది. ఖాతా నిర్ధారణకు రూ.1150 వేయాలని కోరగా సోమేశ్ నగదు చెల్లించాడు. తొలి విడత లక్ష వేసినట్లు నకిలీ స్క్రీన్ షాట్ పంపించారు. జీఎస్టీ లేని కారణంగా నగదు జమకాలేదని.. మరికొంత వేయాలనగా నగదు చెల్లించి మోసపోయాడు.

News July 15, 2024

నాయుడుపేట గురుకులాన్ని పరిశీలించిన కలెక్టర్

image

నాయుడుపేట పట్టణంలోని అంబేడ్కర్ బాలుర గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, సుళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ సోమవారం ఉదయం పరిశీలించారు. అస్వస్థతకు గురైన విద్యార్థులతో మాట్లాడారు. అక్కడ వంటశాలను పరిశీలించారు. గురుకులంలో పిల్లలకు అందిస్తున్న భోజన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పిల్లల ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News July 15, 2024

అనంత సాంఘిక సంక్షేమ ఇన్‌ఛార్జ్‌గా డీడీగా ఖుష్బు కొఠారి

image

అనంతపురం సాంఘిక సంక్షేమ శాఖ ఇన్‌ఛార్జ్‌గా డీడీగా బీసీ సంక్షేమ డీడీ ఖుష్భు కొఠారిని ప్రభుత్వం నియమించింది. సాంఘిక సంక్షేమ సంయుక్త సంచాలకులుగా పనిచేస్తున్న మధుసూదన్‌రావ్‌ను ఇటీవల రాష్ట్ర కార్యాలయానికి డిప్యూటేషన్ మీద పంపారు. ఆయన ఆదివారం విధుల నుంచి రిలీవ్ అయ్యారు. ఈ సందర్భంగా సాంఘిక సంక్షేమ శాఖ ఇన్‌ఛార్జ్‌గా డీడీగా బీసీ సంక్షేమ డీడీ ఖుష్భు కొఠారిని ప్రభుత్వం నియమించింది.

News July 15, 2024

సిమెంట్ ఫ్యాక్టరీ ఘటనలో 4కి చేరిన మృతుల సంఖ్య

image

జగ్గయ్యపేట మండలం బూదవాడ సిమెంట్ కర్మాగారంలో బాయిలర్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య<<13582186>> ఇప్పటివరకు 4కి చేరింది. <<>>విజయవాడ మణిపాల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సిమెంట్ కర్మాగార ఉద్యోగి శ్రీమన్నారాయణ నేడు మృతి చెందినట్లు ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరించారు. మృతుని స్వస్థలం పల్నాడు జిల్లా మాచర్లగా అధికారులు వెల్లడించారు.

News July 15, 2024

సిమెంట్ ఫ్యాక్టరీ ఘటనలో 4కి చేరిన మృతుల సంఖ్య

image

జగ్గయ్యపేట మండలం బూదవాడ సిమెంట్ కర్మాగారంలో బాయిలర్ పేలుడు <<13582186>>ఘటనలో మృతుల సంఖ్య ఇప్పటివరకు నలుగురికి<<>> చేరింది. విజయవాడ మణిపాల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సిమెంట్ కర్మాగార ఉద్యోగి శ్రీమన్నారాయణ నేడు మృతి చెందినట్లు ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరించారు. మృతుని స్వస్థలం పల్నాడు జిల్లా మాచర్లగా అధికారులు వెల్లడించారు.

News July 15, 2024

నెల్లూరు: ముందుగానే మొదలైన రొట్టెల పండగ

image

మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే నెల్లూరు బారాషహీద్‌ దర్గా రొట్టెల పండగ ఈనెల 17న ప్రారంభం కానుంది. స్వర్ణాల చెరువులో పుణ్యస్నానాలు ఆచరించి కోర్కెల రొట్టెలను పట్టుకుని తింటున్నారు. బారాషహీదులకు గలేఫ్‌లు, పూల చద్దర్లను సమర్పిస్తున్నారు. 17 నుంచి రద్దీ ఉంటుందనే ఉద్దేశంతో ముందుగానే తెలంగాణ, KA, TN, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన భక్తులు చెరువు వద్దకు చేరుకోవడంతో ఘాట్, దర్గా ఆవరణం భక్తులతో సందడి నెలకొంది.