Andhra Pradesh

News July 15, 2024

నేడు నంద్యాల కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ

image

నంద్యాల కలెక్టరేట్‌లోని సెంటినరీ హాలులో సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ ద్వారా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు కలెక్టర్‌ రాజకుమారి తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉదయం 9.30 గంటలకు అధికారులందరూ హాజరు కావాలని ఆమె తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

News July 15, 2024

ప్రకాశం: పిల్లల చదువులు కూడా ముఖ్యం: ఎస్పీ

image

ప్రకాశం జిల్లా పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తున్న కుటుంబాలలోని క్రీడా విభాగాలలో ఉత్తమ ప్రతిభ కనపర్చిన 127 మంది విద్యార్థులకు ఎస్పీ ప్రోత్సాహ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ గరుడ్ సుమిత్ మాట్లాడుతూ.. పోలీసు విధులు చాలా కష్టంతో కూడుకున్నవని, కుటుంబంతో గడపడానికి చాలా తక్కువ సమయం ఉంటుందని, కానీ.. వారి పిల్లల చదువుల కోసం మంచి గైడెన్స్ ఇస్తూ అన్ని వసతులు సమకూరుస్తున్నారని అన్నారు.

News July 15, 2024

నేడు ప్రజాసమస్యల పరిష్కార వేదిక జిల్లా కలెక్టర్

image

ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసం ప్రతి సోమవారం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఓ ఆనంద్ ఆదివారం కోరారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి అర్జీలు స్వీకరిస్తారన్నారు.

News July 15, 2024

స్టేట్ 29వ ర్యాంక్ సాధించిన కడప జిల్లా విద్యార్థిని

image

2023-2024 ఆంధ్రప్రదేశ్ రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (APRCET)లో కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం కొత్తూరుకు చెందిన మునగల కల్పన స్టేట్ 29వ ర్యాంక్ సాధించారు. కల్పన 112 మార్కులు సాధించి APRCETలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు ఆమెకు అభినందనలు తెలిపారు.

News July 15, 2024

భీమవరం: చెరువుల్లా మారిన ఆర్‌యూబీలు

image

భీమవరంలో నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జిల వద్ద వరద నీరు నిలిచి చెరువులను తలపిస్తున్నాయి. పట్టణంలోని డిమార్ట్ సమీపంలో, బస్టాండ్ ప్రాంతం, మెంటేవారితోట ప్రాంతాల్లో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్‌ల ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలు కురిసిన సమయంలో 2 అడుగుల మేర నీరు నిలిచిపోతుంటుందని, నడిచి వెళ్లే అవకాశం కూడా ఉండదని వాపోతున్నారు.

News July 15, 2024

సింహాచలం: గిరిప్రదక్షిణ ఏర్పాట్లను పరిశీలించిన ఈవో

image

సింహాచలం శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి గిరి ప్రదక్షణ నేపథ్యంలో ఏర్పాట్లను ఆలయ ఈవో శ్రీనివాసమూర్తి పరిశీలించారు. ఆదివారం ఆలయ అధికారులతో పాటు ఇతర శాఖల అధికారులతో ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ట్రాఫిక్ ఏసీపీ రాజీవ్ కుమార్ ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

News July 15, 2024

బల్లంకిలో పసలమ్మ పండుగ మహోత్సవం

image

వేపాడ మండలం బల్లంకి గ్రామంలో ఆదివారం సాయంత్రం పసలమ్మ పండగ ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ వరలక్ష్మీ కనకరాజు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దల సమక్షంలో అమ్మవారి పండుగ జరుపుకున్నారు. పూర్వీకుల సాంప్రదాయం మేరకు ప్రతి ఏటా ఖరీఫ్ సాగుకు వరి నారు వేసిన అనంతరం ఆదివారం పశువుల పండుగ చేయడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటామని గ్రామస్థులు చెప్పారు.

News July 15, 2024

బాపట్ల: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌లు సీజ్

image

అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను బాపట్ల రూరల్ పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కథనం మేరకు.. బాపట్ల మండలం నందిరాజు తోట గ్రామంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని సమాచారం మేరకు దాడి నిర్వహించి ఒక జెసీబీ, రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎవరైనా అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News July 15, 2024

కృష్ణా: ఆరు రోజులపాటు పినాకిని ఎక్స్‌ప్రెస్‌ రద్దు

image

విజయవాడ, చెన్నై సెంట్రల్ మధ్య ప్రయాణించే పినాకిని ఎక్స్‌ప్రెస్‌లను ట్రాక్ మరమ్మతుల కారణంగా ఆరు రోజుల పాటు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆగస్టు 5 నుంచి 10 వరకు నం.12712 చెన్నై సెంట్రల్-విజయవాడ, నం.12711 విజయవాడ-చెన్నై సెంట్రల్ పినాకిని ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రయాణికులు రైళ్ల రద్దును గమనించాలని కోరారు.

News July 15, 2024

తిరుపతి: IIDTలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

రేణిగుంట ఎయిర్‌పోర్ట్ సమీపంలో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీస్(IIDT)లో 2024-25 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. AI/ML సైబర్ సెక్యూరిటీ/ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అర్హత, ఇతర వివరాలకు iidt.ap.gov.in వెబ్‌సైట్ చూడాలి. దరఖాస్తులకు చివరి తేదీ జూలై 31.