Andhra Pradesh

News July 14, 2024

చిత్తూరు:వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీం పొడిగింపు

image

రాష్ట్ర ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీం పథకాన్ని 2024-25 ఆర్థిక సంవత్సరానికి పొడిగిస్తూ 12న జీవో యం.యస్ నెం. 82 ను జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జర్నలిస్టు హెల్త్ స్కీమ్ ద్వారా జర్నలిస్టులు, వారిపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులకు ఏదైనా అనుకోని అనారోగ్యం సంభవించిన ప్రతిసారి రూ. 2 లక్షల వరకు విలువ చేసే వైద్యసేవలు అందుతాయని చెప్పారు.

News July 14, 2024

కృష్ణా: గెస్ట్ టీచర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

చిలకలపూడి (మచిలీపట్నం)లోని మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలలో గెస్ట్ టీచర్ పోస్టులకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల హెచ్ఎం వెంకటేశ్వరరావు చెప్పారు. గణితం, భౌతికశాస్త్రం, సాంఘిక శాస్త్రం బోధించే ఉపాధ్యాయులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. అభ్యర్థులు ఈ నెల 15లోపు దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు చిలకలపూడిలోని మైనార్టీ బాలుర గురుకుల పాఠశాల కార్యాలయంలో సంప్రదించాలన్నారు. 

News July 14, 2024

అత్యాచార ఘటనపై జడ్పీ చైర్మన్ ధ్రిగ్భ్రాంతి

image

అభం శుభం తెలియని ఆరునెలల చిన్నారిపై అత్యాచార యత్నం చేసిన సంఘటనపై, జిల్లా పరిషత్ చైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ సంఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. బాధిత బాలిక ఆరోగ్య పరిస్థితి పై ఘోషాసుపత్రి వైద్యులు, స్త్రీ శిశు సంక్షేమ అధికారులను ఆయన వాకబు చేశారు. బాలికకు మరింత మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. నిందితుడిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

News July 14, 2024

ఏలూరు: భార్య వదిలివెళ్లిందని భర్త సూసైడ్

image

ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం ఏలూరు జిల్లాలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఏలూరు మండలం కొత్తూరు ఇందిరమ్మ కాలనీకు చెందిన రాజు విహారి (32) భార్య ఏడాది క్రితం అతణ్ని వదిలేసి వెళ్లిపోయింది. మనస్తాపంతో రాజు ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. మంటలతోనే కొంతదూరం నడిచి బంధువుల ఇంటి వద్ద పడిపోయాడు. విజయవాడ ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందాడు.

News July 14, 2024

విశాఖ: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం

image

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. దీంతో ఏపీ తీరానికి చేరువగా అల్పపీడనం రానుంది. దీని ప్రభావంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో నాలుగు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించారు.

News July 14, 2024

ఈనెల 18, 19న రాష్ట్రస్థాయి చెస్ పోటీలు

image

నంద్యాలలో ఈ నెల 18, 19న అండర్-19 రాష్ట్రస్థాయి చెస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు జిల్లా చెస్ సంఘం అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి ఆదివారం తెలిపారు. 2 రోజుల పాటు జరిగే ఈ పోటీలకు రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి 300 మంది క్రీడాకారులు పాల్గొంటారని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయిలో విజయం సాధించిన క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎంపిక అవుతారని తెలిపారు.

News July 14, 2024

శ్రీకాకుళం: రోడ్డు ప్రమాదం.. UPDATE

image

టెక్కలి మండలంలోని జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. టెక్కలి-శ్రీకాకుళం మార్గంలో బొప్పాయిపురం గ్రామం వద్ద లారీ ఢీకొని వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మొదట నేషనల్ హైవే అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడు హైదరాబాద్‌కు చెందిన శివ(52)గా పోలీసులు గుర్తించారు.

News July 14, 2024

మంగళగిరి వద్ద ప్రమాదం.. బాలుడి మృతి

image

మంగళగిరిలోని తెనాలి ఫ్లై ఓవర్ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్తున్న కారు ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి ప్రమాదాన్ని గమనించి క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు చర్యలు చేపట్టారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆదేశాలు జారీ చేశారు.

News July 14, 2024

టీడీపీ నేత మృతికి మంత్రి లోకేశ్ సంతాపం

image

టీడీపీ నేత, ఓటర్ రామకృష్ణగా అందరికి సుపరిచితులైన అన్నే రామకృష్ణ హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని మంత్రి నారా లోకేశ్ అన్నారు.‌ టీడీపీ కోసం అహర్నిశలు శ్రమించిన రామకృష్ణకు మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు. TDP ఓటర్ వెరిఫికేషన్ విభాగానికి ఎనలేని సేవ చేశారని రామకృష్ణ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాని తన ట్విటర్ (X)లో ట్వీట్ చేశారు.

News July 14, 2024

REWIND: గరిమెళ్ల గళం.. దేశానికి బలం (నేడు జయంతి)

image

సరుబుజ్జిలి మండలం గోనెపాడు అగ్రహారంలో 1893 జులై 14న జన్మించిన గరిమెళ్ల సత్యనారాయణ స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రజాకవి, పాత్రికేయుడు. తన గళాన్ని, కాలాన్ని ఆయుధంగా మలిచి తెల్లదొరలపై అస్త్రం సంధించిన ప్రజాకవి. గృహాలక్ష్మి, వాహిని, ఆంధ్రప్రభ, ఆనందవాణి పత్రికల్లో సంపాదకుడిగా పనిచేశారు. శ్రీకాకుళం ప్రెస్ క్లబ్‌కు గరిమెళ్ల భవన్‌గా 2001లో నామకరణం చేశారు. జిల్లా గ్రంథాలయ భవనానికి ఆయన పేరు పెట్టారు.