Andhra Pradesh

News July 14, 2024

రెండేళ్లలో కేఈ శ్యామ్ బాబుకు మంత్రి పదవి: మాజీ ఉప ముఖ్యమంత్రి

image

పత్తికొండ ఎమ్మెల్యే శ్యామ్ బాబుకు రెండేళ్లలో మంత్రి పదవి వస్తుందని మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఆశాభావం వ్యక్తం చేశారు. పత్తికొండలోని టీడీపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేఈ శ్యామ్ బాబుకు మంత్రివర్గంలో సీఎం చంద్రబాబు చోటు కల్పిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పత్తికొండ నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.

News July 14, 2024

వేతనాలకు ఏయూ సిబ్బంది ఎదురుచూపు..!

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉద్యోగులకు నేటివరకు వేతనాలు అందలేదు. వర్సిటీ వీసీ రాజీనామా చేయడంతో ప్రస్తుతం ఖాళీ ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఇన్చార్జి విసీ ని నియమించలేదు. దీంతో ఉద్యోగుల వేతనాలు మంజూరు ఆలస్యం అవుతోంది. ఉద్యోగులకు దాదాపు రూ.32 కోట్ల వరకు వేతనాలు, పెన్షన్ల రూపంలో ఇవ్వాల్సి ఉంది. ఇన్చార్జి వీసీ నియామకం జరిగితేనే ఈ ఫైల్ ‌కు మోక్ష లభించి ఉద్యోగులకు వేతనాలు లభిస్తాయి.

News July 14, 2024

సీఎం చంద్రబాబు చెప్పేదొకటి.. చేసేదొకటి: సాయి దత్త

image

ఓడలో ఉన్నంత సేపు ఓడ మల్లన్న, ఓడ దిగాక బోడిమల్లన్న, అన్న చందంగా చంద్రబాబు పనితీరు ఉందని కడప జిల్లా YCP విద్యార్థి విభాగం అధ్యక్షుడు సాయిదత్త విమర్శించారు. ఎన్నికలలో ఓటర్లను ఆకర్షించేందుకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని తుంగలో తొక్కడం చంద్రబాబుకు పరిపాటే అని అన్నారు. 2014లో కూడా రైతురుణ మాఫీ వాగ్దానాన్ని అమలు చేయని చరిత్ర ఆయనకుందని ఇప్పుడు అదే కోవలో తల్లికి వందనం నిలిచిందన్నారు.

News July 14, 2024

విశాఖలో మెట్రో.. చంద్రబాబు సూచనలు

image

విశాఖ నగరంలో ప్రజా రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు మెట్రో రైల్ ప్రాజెక్టుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. సీఎం చంద్రబాబు సూచన మేరకు ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారులు కొన్ని మార్పులు చేయనున్నారు. నగరంలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నిర్మించే పైవంతెనలకు అనుసంధానంగా మెట్రో డిజైన్ ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. ఈ మేరకు ఎన్.హెచ్.ఏ.ఐ సమన్వయంతో ప్రణాళిక రచిస్తున్నారు.

News July 14, 2024

ఆధారాలు లేకుండా జగన్‌పై అక్రమ కేసు పెట్టడం సరికాదు: రెడ్యం

image

మాజీ సీఎం వైఎస్ జగన్‌పై ఎటువంటి ఆధారాలు, సాక్ష్యాలు లేకుండా అక్రమ కేసు పెట్టడం సరికాదని వైసీపీ నాయకుడు, ఏపీఎస్ ఆర్టీసీ మాజీ జోనల్ ఛైర్మన్ రెడ్యం వెంకట సుబ్బారెడ్డి అన్నారు. ఖాజీపేట మండలం దుంపలగట్టులోని తన కార్యాలయంలో ఆయన శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీడీపీ ఎమ్మెల్యే రఘురామక్రిష్ణమరాజుపై పోలీసుల దాడి వాస్తవం కాదని వైద్యపరీక్షల నివేదిక నిగ్గు తేల్చినా అక్రమ కేసు పెట్టడం సరికాదన్నారు.

News July 14, 2024

మార్టూరు: బాలుడి కిడ్నాప్ అవాస్తవం: సీఐ

image

మార్టూరులో బాలుడి కిడ్నాప్‌కి యత్నం అంటూ వచ్చిన వార్తలను ఆదివారం సీఐ రాజశేఖర్‌రెడ్డి ఖండించారు. అసలు అలాంటి సంఘటనే జరగలేదన్నారు. ఆ బాలుడు బయటకు వెళ్ళి కొద్ది సేపు ఇంటికి తిరిగి రాలేదని తెలిపారు. అతడు ఇంటికి వచ్చాక తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్లావని ప్రశ్నించి, మందలిస్తారనే భయంతో ఆ బాలుడు కిడ్నాప్ కథ చెప్పాడన్నారు. అయితే కొన్ని పత్రికలు అవాస్తవ కథనాలు ప్రచురించాయని సీఐ మండిపడ్డారు.

News July 14, 2024

చేజర్లలో జగనన్న లే అవుట్‌పై విచారణకు మంత్రి ఆనం ఆదేశం

image

చేజర్ల మండలం ఆదూరుపల్లిలో జగనన్న లే అవుట్ అక్రమణపై విచారణ చేయాలని మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి మండల తహశీల్దార్‌ను ఆదేశించారు. ఆదూరుపల్లిలో జగనన్న లే అవుట్‌కు కేటాయించిన స్థలాన్ని వైసీపీ నాయకుడు హద్దులు తొలగించి ఆక్రమించి సాగు చేసుకుంటున్నట్లు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు మంత్రికి ఫిర్యాదు చేశారు. దీంతో మంత్రి స్పందించి చర్యలకు అధికారులను ఆదేశించారు.

News July 14, 2024

VZM: అత్యాచార ఘటనపై హోం మంత్రి సీరియస్

image

రామభద్రపురం మండలంలోని ఓ గిరిజన గ్రామంలో పసికందుపై జరిగిన <<13625276>>అత్యాచార<<>> ఘటనపై రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత సీరియస్ అయ్యారు. ఈ మేరకు ఆమె స్థానిక పోలీస్ అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరికాసేపట్లో విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతి రాజు ఘోషాసుపత్రిలో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.

News July 14, 2024

అత్యాచార ఘటనపై హోమ్ మంత్రి సీరియస్

image

విజయనగరం జిల్లా రామభద్రపురం మండలంలోని ఓ గిరిజన గ్రామంలో ఆరు నెలల చిన్నారిపై <<13625276>>అత్యాచారం<<>> చేసిన ఘటనపై హోమ్ మంత్రి వంగలపూడి అనిత ఆరా తీశారు. విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతి రాజుతో ఆమె ఫోన్‌లో మాట్లాడారు. జిల్లా ఎస్పీ, పోలీస్ అధికారులతో కూడా మాట్లాడిన ఆమె.. ఘటనపై పూర్తి వివరాలు అందజేయాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలపై యాక్షన్ చాలా సీరియస్‌గా ఉంటుందని హెచ్చరించారు.

News July 14, 2024

అనిల్ అంబానీ, సంజయ్ దత్‌తో పవన్ కళ్యాణ్

image

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ తనయుడి పెళ్లికి డిప్యూటీ సీఎం, పిఠాపురం MLA పవన్ కళ్యాణ్ హాజరైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, ముకేశ్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీతో పవన్ చర్చించారు. సంబంధిత ఫొటోలను జనసేన ‘X’లో పోస్ట్ చేసింది.