Andhra Pradesh

News July 14, 2024

చినగంజాం: అన్న హత్యకు తమ్ముడే సూత్రధారి

image

సొంత అన్ననే తమ్ముడు హత్య చేసిన దారుణ ఉదంతం వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల మేరకు.. చినగంజాంకు చెందిన హెడ్‌కానిస్టేబుల్‌ కంపిరి సురేశ్‌కు ఇద్దరు కూమారులు. పెద్దవాడు అనిల్ గంజాయికి బానిసై డబ్బు ఇవ్వాలని లేదంటే చంపేస్తానని బెదిరించేవాడు. అన్న తల్లిదండ్రులను చంపేస్తాడని భావించిన తమ్ముడు అఖిల్ స్నేహితులతో కలిసి ఈనెల 5న పెనుగంజిప్రోలు వద్ద అన్నకు మద్యం తాగించి దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశారు.

News July 14, 2024

ప.గో.: పేదలకు ఏడాది పాటు ఉచిత వైద్య సేవలు

image

ఏలూరు ఆశ్రం ఆసుపత్రి స్థాపించి నేటికి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పేదలకు ఏడాది పాటు ఉచిత వైద్య సేవలు అందించనున్నామని డైరెక్టర్‌ గోకరాజు రతీదేవి చెప్పారు. ఉమ్మడి ప.గో.జిల్లా వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అలాగే 100 ఉచిత శస్త్ర చికిత్సలు, మరో 100 ఉచిత డెలివరీలు నిర్వహిస్తామన్నారు.

News July 14, 2024

VZM: వీరుడా వందనం.. ఇక సెలవు

image

లద్దాక్‌లో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో అసువులుబాసిన సైనికుడు గొట్టాపు శంకరరావు భౌతిక కాయం శనివారం బొత్సవానివలస చేరుకుంది. సైనిక లాంఛనాలతో అశ్రునయనాల మధ్య అంతిమ వీడ్కోలు పలికారు. ‘నా పిల్లలు ఏం పాపం చేశారు దేవుడా.. ఇంత చిన్న వయసులో వారికి తండ్రిని దూరం చేశావని’ భార్య కోమలత రోదించిన తీరు, దు:ఖాన్ని దిగమింగి తండ్రి భౌతికాయానికి సెల్యూట్ చేసిన పిల్లలను చూసి అక్కడున్నవారు కన్నీరు పెట్టుకున్నారు.

News July 14, 2024

నెల్లూరు: సింహపురి ఎక్స్‌ప్రెస్ రైలు వేళల్లో మార్పులు

image

సికింద్రాబాద్ నుంచి గూడూరు వరకు తిరిగే సింహపురి ఎక్స్‌ప్రెస్ రైలు రాకపోకల వేళల్లో రైల్వే అధికారులు మార్పులు చేశారు. అక్టోబర్ 18వ తేదీ నుంచి ఈ మార్పు అమలు అవుతుందని వారు ప్రకటించారు. సింహపురి ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్‌లో రాత్రి 11.05 గంటలకు బయలు దేరి గూడూరుకు ఉదయం 9.40 గంటలకు చేరుకుంటుంది. కానీ సికింద్రాబాద్‌లో రాత్రి 10.05 బయలు దేరి గూడూరుకు 8.55 గంటలకు చేరుకునేలా మార్పు చేశారు.

News July 14, 2024

నేడు ఇసుక డిపోకు సెలవు

image

కర్నూలు జిల్లా కౌతాళం మండలం గుడికంబాలి ఇసుక డిపోకు ఆదివారం సెలవు ఉంటుందని డిపో నిర్వహణ అధికారి, గ్రామ రెవెన్యూ కార్యదర్శి నాగార్జున తెలిపారు. గుడికంబాలి ఇసుక డిపో నుంచి 6వ రోజైన శనివారం 91 వాహనాల్లో 1,334 టన్నుల ఇసుకను విక్రయించినట్లు ఆయన పేర్కొన్నారు. డిపో వద్ద అక్రమంగా ఎత్తుకెళ్లకుండా పోలీసులు కాపలా ఉన్నట్లు వివరించారు.

News July 14, 2024

బాపట్ల: అన్న హత్యకు తమ్ముడే సూత్రధారి

image

ఎన్టీఆర్‌ జిల్లా పెనుగంచిప్రోలులో ఈనెల 5వ తేదీన ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ కేసులో సోదరుడే ప్రధాన నిందితుడిగా గుర్తించారు. బాపట్ల జిల్లాకు చెందిన కంపిరి సురేశ్ హెడ్‌కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. అతనికి ఇద్దరు కూమారులు. వారిలో పెద్దవాడు గంజాయికి బానిసై డబ్బు ఇవ్వాలని లేందటే తల్లిదండ్రులను చంపేస్తానని బెదిరించేవాడు. అన్న తల్లిదండ్రులను చంపేస్తాడని భావించి తమ్ముడే హత్య చేశాడని SI తెలిపారు.

News July 14, 2024

VZM: ఆరు నెలల పసికందుపై అత్యాచారం?

image

రామభద్రపురం మండలంలోని ఓ గిరిజన గ్రామంలో దారుణం జరిగింది. ఆరు నెలల పసికందుపై 40 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడినట్లు తల్లిదండ్రులు శనివారం రాత్రి పోలీసులను ఆశ్రయించారు. బాధిత చిన్నారికి తీవ్రంగా రక్తస్రావం జరగడంతో బాడంగి ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. వైద్యుల సూచనల మేరకు అక్కడ నుంచి విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. పూర్తి వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు.

News July 14, 2024

కృష్ణా: డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని కళాశాలలలో BA, BCom, BSc, BBA, BCA, B.A.O.L విద్యార్థులు రాయాల్సిన 6వ సెమిస్టర్ సప్లిమెంటరీ థియరీ పరీక్షల టైంటేబుల్ విడుదలైంది. ఆగస్టు 1 నుంచి 14 వరకు నిర్ణీత తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఈ పరీక్షలు జరగనున్నాయి. సబ్జెక్టువారీగా షెడ్యూల్ వివరాలకై విద్యార్థులు https://www.nagarjunauniversity.ac.in/అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవచ్చు.

News July 14, 2024

మిద్దె కూలి అనంతపురం జిల్లాలో దంపతుల మృతి

image

అనంతపురం జిల్లాలో ఘోర విషాదం జరిగింది. విడపనకల్ మండలం హవళిగి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున ఓ మిద్దె కూలి మారెప్ప (49), లక్ష్మి (45) అనే దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. వీరి కూతురు మానస, మృతురాలి తమ్ముడు రాము తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు.

News July 14, 2024

ఉమ్మడి విజయనగరంలో 381 మందికి ట్రిపుల్ ఐటీల్లో సీట్లు

image

గత విద్యా సంవత్సరంలో పదో తరగతి ఉత్తీర్ణులైన ఉమ్మడి జిల్లా విద్యార్థులకు ట్రిపుల్ ఐటీ లో అధిక సంఖ్యలో సీట్లు దక్కాయి. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన 381 మందికి సీట్లు లభించాయి. విజయనగరం జిల్లాలో 286 మంది విద్యార్థులు సీట్లు సాధించి రాష్ట్రంలో రెండో స్థానంలో నిలవగా, పార్వతీపురం మన్యం జిల్లాలో 95 మంది విద్యార్థులు సీట్లు సాధించి 20వ స్థానంలో నిలిచారు.