Andhra Pradesh

News July 14, 2024

ధర్మల్ ఉద్యమ అమరుల 14వ సంస్మరణ సభ

image

పర్యావరణ పరిరక్షణకు ప్రజలే నాయకులై ముందుండి నడిపించిన సోంపేట ధర్మల్ పోరాటం దేశంలోనే ప్రజా ఉద్యమాల్లో ఒకటిగా పేరుపొందింది. కార్పొరేట్ల ధనదాహానికి పచ్చని బీల ప్రాంతం కనుమరుగు కావడమే కాకుండా పరిసర ప్రాంత ప్రజల జీవనం అస్తవ్యస్తమవుతుందన్న భయాందోళన నేపథ్యంలో ప్రజలే ముందుండి విజయవంతం చేసిన ఉద్యమంగా సోంపేట ధర్మల్ ఉద్యమం ఖ్యాతికెక్కింది. ధర్మల్ పోరాటంలో మృతుల జ్ఞాపకార్థం జులై 14న ఏటా సభను నిర్వహిస్తారు.

News July 14, 2024

స్టీల్ ప్లాంట్‌లో ముడి సరుకు కొరతపై ఆందోళన

image

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ముడి సరుకు కొరత ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం ఐరన్ లంప్స్ 3 రోజులకు, డొలమైట్ 3 రోజులకు, లైవ్ స్టోన్ 5 రోజులకు, ఎస్ఎంఎస్ లైవ్ స్టోన్ 5 రోజులకు ఇలా సగటున నాలుగు నుంచి ఐదు రోజులు మాత్రమే అందుబాటులో ఉండటంతో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ఎండీసీ నుంచి అవసరమైన ముడి సరుకు విశాఖకు సరఫరా కావలసిన అవసరం ఉంది.

News July 14, 2024

విశాఖ: ఫ్రెండ్ బర్త్‌డేకి గంజాయి.. విద్యార్థి అరెస్టు

image

స్నేహితుడు బర్త్ డేకి గంజాయి తీసుకొస్తున్న విద్యార్థిని పోలీసులు అగనంపూడి వద్ద అరెస్టు చేశారు. చోడవరంకు చెందిన ఓ విద్యార్థి గాజువాకలో నివాసం ఉంటూ డిగ్రీ చదువుతున్నాడు. చోడవరం నుంచి సిటీ బస్సులో కొద్దిపాటి గంజాయిని రవాణా చేస్తుండగా పోలీసులు అగనంపూడి వద్ద బస్సులో తనిఖీ చేశారు. విద్యార్థి బ్యాగును పరిశీలించగా గంజాయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ విద్యార్థిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

News July 14, 2024

ఒంటిమిట్ట: అరుగుపై కూర్చున్నందుకు దళితుడిపై దాడి

image

ఒంటిమిట్ట మండలంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. పెన్న పేరూరులో కదిరి ప్రభాకర్ (52) అదే గ్రామానికి చెందిన వెంకట సుబ్బారెడ్డి నిర్వహిస్తున్న దుకాణం వద్ద శనివారం అరుగుపై కూర్చున్నాడు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని వెంకటసుబ్బారెడ్డి చెప్పాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి పెనంలోని వేడి నూనె ప్రభాకర్ పై పోసి, కులం పేరుతో దూషించాడు. దీనిపై కేసు నమోదైందని పోలీసులు తెలిపారు.

News July 14, 2024

ఐరాల: డివైడర్‌ను ఢీకొని కారు బోల్తా.. ఒకరు మృతి

image

ఐరాల మండలం చిగరపల్లె వంతెన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. తెలంగాణ సూర్యాపేటకు చెందిన ఏడుగురు తిరుమల దర్శనానికి వచ్చారు. అనంతరం కాణిపాకం దర్శనానికి వస్తుండగా చీగరపల్లె వంతెన వద్ద ముందు వెళ్తున్న లారీని తప్పించబోయి కారు డివైడర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News July 14, 2024

జంగారెడ్డిగూడెం: చెట్టుకొమ్మ విరిగి పడి మహిళ మృతి

image

చెట్టుకొమ్మ విరిగిపడి మహిళ మృతిచెందిన ఘటన జంగారెడ్డిగూడెంలో జరిగింది. SI జ్యోతిబసు తెలిపిన వివరాలు.. స్థానిక రాజీవ్ నగర్‌కు చెందిన గుత్తుల వీరమణి (54) శుక్రవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వస్తున్న క్రమంలో రోడ్డుపక్కన ఉన్న జామాయిల్ చెట్టుకొమ్మ విరిగి ఆమెపై పడింది. తొలుత స్థానిక ప్రాంతీయాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. కేసు నమోదైంది.

News July 14, 2024

నేడు సోమశిలకు మంత్రులు రాక

image

నేడు జిల్లాలో మంత్రులు నిమ్మల రామానాయుడు, ఆనం రామనారాయణరెడ్డి పొంగూరు నారాయణ పర్యటించనున్నారు. ఇందులో భాగంగా సోమశిల జలాశయానికి సంబంధించి చేపట్టాల్సిన అభివృద్ధి పనులను వారు పరిశీలించనున్నారు. ప్రధానంగా సోమశిల ఆఫ్రాన్, రక్షణ గోడ, నిర్మాణ పనులు, మరమ్మతులను వారు పరిశీలించనున్నారు. అనంతరం వారు గతేదాడి వరదలకు దెబ్బతిన్న సోమేశ్వర ఆలయాన్ని సందర్శించనున్నారు.

News July 14, 2024

‘ఆలూరులో టీడీపీని బతికించండి’

image

ఆలూరు నియోజకవర్గంలో చతికిలపడ్డ టీడీపీని బతికించాలని శనివారం నియోజకవర్గానికి చెందిన నేతలు అధిష్ఠానానికి విన్నవించారు. అధినేత చంద్రబాబు, లోకేశ్, రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసును కలిసి పలు విషయాలను వారి దృష్టికి తీసుకెళ్లారు. వీరభద్ర గౌడ్ స్థానిక నాయకులను సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లకపోవడం వల్లే 2024 ఎన్నికల్లో ఓటమి చెందారని, ఈయన స్థానంలో కొత్త ఇన్‌ఛార్జిని నియమించాలని కోరినట్లు వారు తెలిపారు.

News July 14, 2024

విజయవాడలో కిలో టమాటా ధర రూ.64

image

విజయవాడ రాజీవ్ గాంధీ హోల్‌సేల్ మార్కెట్‌ యార్డులో శనివారం టమాటా ధర స్వల్పంగా పెరిగింది. ఈ నెల 12న కిలో రూ.50 పలుకగా 13న గరిష్ఠంగా రూ.54 పలికింది. వర్షాల కారణంగా తోటల్లో టమాటాలు దెబ్బతినడంతో ధర పెరిగినట్లు తెలుస్తోంది. విజయవాడ కాలేశ్వరరావు మార్కెట్‌లో మొదటి రకం టమాటాను గరిష్ఠంగా రూ.64కు అమ్ముతున్నారు. 

News July 14, 2024

తూ.గో.: చెట్టుపడి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి

image

తూ.గో. జిల్లా పెరవలి మండలం ఖండవల్లి హైవేపై శనివారం చెట్టు పడి చాగల్లుకు చెందిన యువ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మల్లుల కువలేశ్ (25) మృత్యువాత పడ్డాడు. బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న కువలేశ్ తల్లితండ్రులు సత్యనారాయణ, ధనలక్ష్మిని చూసేందుకు వారం రోజుల క్రితం సొంతూరు వచ్చాడు. ఇరగవరం మండలం పేకేరులోని అమ్మమ్మ తులసమ్మను చూసేందుకు వెళ్లి బైక్ పై తిరిగి వస్తుండగా హైవే పక్కన ఉన్న చెట్టు అతనిపై పడి మృతిచెందాడు.