Andhra Pradesh

News July 14, 2024

తిరుపతి కొత్త SPగా సుబ్బరాయుడు

image

తిరుపతి జిల్లా ఎస్పీగా సుబ్బరాయుడిని నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ క్యాడర్‌కు చెందిన ఆయనను ప్రత్యేకంగా ఏపీకి తీసుకొచ్చారు. గతంలో చంద్రబాబు ఓఎస్డీగా పనిచేసిన అనుభవం ఉండటంతో తిరుపతి ఎస్పీగా నియమించారు. అలాగే టీటీడీ సీవీఎస్వో నరసింహ కిషోర్‌ను తూర్పు గోదావరి జిల్లా ఎస్పీగా బదిలీ చేశారు. ఇప్పటి వరకు తిరుపతి ఎస్పీగా పనిచేసిన హర్షవర్ధన్‌ను కడప ఎస్పీగా నియమించారు.

News July 14, 2024

బొమ్మనహాల్: టీబీ డ్యాంలో 30 టీఎంసీలకు చేరిన నీరు

image

బొమ్మనహాల్ మండలంలోని టీబీ డ్యాంలోకి శనివారం నాటికి 30టీఎంసీలు నీరు చేరినట్లు టీబీ డ్యాం అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతమైన కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు టీబీ డ్యాంలోకి వరద నీరు పరవళ్లు తొక్కుతుంది. రెండు, మూడు రోజుల్లో 40 టీఎంసీలకు చేరే అవకాశం ఉందని టీబీ డ్యాం అధికారులు వెల్లడించారు. డ్యాం వద్దకు ఎవ్వరూ వెళ్లవద్దని అధికారులు ప్రకటించారు.

News July 14, 2024

BREAKING: కర్నూలు జిల్లా ఎస్పీగా బిందు మాధవ్

image

రాష్ట్రంలో ఐపీఎస్‌ల బదిలీల్లో భాగంగా బిందు మాధవ్‌ను కర్నూలు జిల్లా ఎస్పీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ నీరభ్ కుమార్ ప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం కర్నూలు జిల్లా ఎస్పీగా ఉన్న కృష్ణకాంత్‌ను నెల్లూరు జిల్లా ఎస్పీగా బదిలీ చేశారు.

News July 14, 2024

శ్రీకాకుళం జిల్లాలో నేడు మోస్తరు వర్షాలు

image

ఆవర్తనం ప్రభావంతో నేడు, రేపు శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని APSDMA ఎండి రోణంకి కూర్మనాథ్ శనివారం సాయంత్రం వెల్లడించారు. వర్షాల నేపథ్యంలో జిల్లాల యంత్రాంగాన్ని తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించామని ఆయన పేర్కొన్నారు. వర్షాల కారణంగా చెట్లు కింద ఉండరాదని, విద్యుత్ స్తంభాలు వద్ద వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు.

News July 14, 2024

కడప: నాగు పాముకు వైద్యం అందించిన పశు వైద్యులు

image

నాగు పాముకు ప్రాంతీయ పశువైద్యశాల డీడీ రంగస్వామి వైద్యం చేశారు. శనివారం స్థానిక ఆసుపత్రికి నాగు పాముకు దెబ్బ తగిలిందని స్నేక్‌ క్యాచర్‌ ఆసుపత్రికి తీసుకు వచ్చారు. అది గమనించిన జూనియర్‌ వెటర్నరీ ఆఫీసర్‌ రాజశేఖర్‌ సంబంధిత ఏడీ డాక్టర్‌ నేతాజీ, డీడీ డాక్టర్‌ రంగస్వామి పాముకు పదునైన ఇనుప వస్తువు తగులుకుని పేగులు బయటికి వచ్చినట్లు నిర్ధారణ చేశారు. పేగులు లోపలికి తోసి కుట్లు వేసి చికిత్స అందించారు.

News July 14, 2024

పరిశ్రమల జోన్ వస్తోంది.. కరెంట్ కోతలుండొద్దు: ఎంపీ

image

ఏలూరు టీడీపీ కార్యాలయంలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ విద్యుత్ అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. ఏలూరు కేంద్రంగా పరిశ్రమల జోన్ వస్తుందని, దానికి కావాల్సిన విద్యుత్ ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశించారు. జిల్లాలో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలన్నారు.

News July 14, 2024

VZM: సమర్థవంతంగా మూడేళ్లు పనిచేసిన ఎస్పీ దీపిక

image

జిల్లా ఎస్పీగా దీపిక పాటిల్ మూడేళ్లు సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు. 2021 జులై 12న విధుల్లో చేరిన ఆమె తక్కువ కాలంలోనే అన్ని పోలీస్ స్టేషన్‌లలో సుడిగాలి పర్యటనలు చేసి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. రామభద్రపురం, పీ.కోనవలస, బొడ్డవర చెక్ పోస్ట్‌లను బలోపేతం చేసి గంజాయి అక్రమ రవాణాను సాధ్యమైనంతగా నిరోధించారు. మత్తు పదార్థాలకు యువత బానిస కాకుండా అవగాహన సదస్సులు నిర్వహించారు.

News July 14, 2024

చింతపల్లి ADSP కిషోర్‌కు ఏలూరు SPగా పదోన్నతి

image

చింతపల్లి అదనపు ఎస్పీ కెపిఎస్.కిషోర్‌కు పదోన్నతి కల్పిస్తూ ఏలూరు ఎస్పీగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. చింతపల్లిలో మొదట ఏఎస్పీగా, తర్వాత అదనపు ఎస్పీగా రెండున్నర ఏళ్లపాటు చేశారు. కిషోర్ హయాంలో చింతపల్లి పరిసర నిరుద్యోగ యువతకు అనేక ఉపాధి అవకాశాల కోసం ప్రేరణ పేరుతో జాబ్ మేళాలు నిర్వహించారు. మావోయిస్టు కార్యకలాపాలు అణిచివేతలో కీలకంగా పాల్గొన్నారు.

News July 14, 2024

కృష్ణా: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్

image

మచిలీపట్నం, యశ్వంత్‌పూర్ మధ్య ప్రయాణించే కొండవీడు ఎక్స్‌ప్రెస్‌లకు అదనంగా 2 జనరల్ కోచ్‌‌లు జత చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.17211/17212
కొండవీడు ఎక్స్‌ప్రెస్‌ ప్రస్తుతం 2 జనరల్ కోచ్‌లతో నడుస్తుండగా 2 బోగీలు జతచేసి మొత్తంగా 4 జనరల్ కోచ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 17211 ట్రైన్‌ను నవంబర్ 11 నుంచి, 17212 ట్రైన్‌ను నవంబర్ 12 నుంచి 2 అదనపు జనరల్ కోచ్‌లతో నడుపుతామన్నారు.

News July 13, 2024

కృష్ణా: నూతన ఎస్పీగా గంగాధర్ రావు

image

కృష్ణా జిల్లా నూతన ఎస్పీగా గంగాధర్ రావు నియమిస్తూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కృష్ణా జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న అద్నాన్ నయీం అస్మిని, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీగా బదిలీ చేసిన విషయం తెలిసిందే.