Andhra Pradesh

News July 13, 2024

గోరంట్లలో అనుమానాస్పద మృతి

image

గోరంట్లలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందాడు. అనంతపురం పట్టణానికి చెందిన షేక్ రఫీ గోరంట్లలో పనిచేస్తూ జీవించేవాడు. శుక్రవారం రాత్రి అతడితో పాటు పనిచేసేవారితో ఇంటి పైకి మద్యం తాగడానికి వెళ్లి తిరిగి రాలేదు. శనివారం ఉదయం ఎంతసేపటికి రాకపోవడంతో పైకి వెళ్లి చూడగా మృతిచెందినట్లు గుర్తించారు. భార్య తస్లీమా ఫిర్యాదు మేరకు సీఐ సుబ్బరాయుడు కేసు నమోదు చేశారు.

News July 13, 2024

కృష్ణా: వర్షాలతో హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు 

image

ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెట్ట పంటలకు తోడు మాగాణి పంటల సాగుకు, వరి నారుమళ్లు పోయటానికి రైతులు సిద్దమవుతున్న తరుణంలో వర్షాల రాక ఊరట కలిగించిందని రైతులు చెబుతున్నారు. సీజన్ ఆరంభంలో కురిసే ఈ వానలతో విత్తనాలు మొలకెత్తి పంటలు ఏపుగా పెరిగి దిగుబడి ఆశాజనకంగా ఉండే అవకాశం ఉంటుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

News July 13, 2024

శ్రీకాకుళం: భగవద్గీతపై ఎంఏ కోర్సు ఆఫర్ చేస్తున్న ఇగ్నో

image

ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో) రెండేళ్ల కాలవ్యవధితో హిందీ మాధ్యమంలో ఓపెన్/డిస్టెన్స్ విధానంలో భగవద్గీతపై ఎంఏ కోర్సు అందిస్తోంది. డిగ్రీ పూర్తి చేసినవారు ఈ కోర్స్ చేసేందుకు అర్హులు కాగా రెండేళ్లకు ఫీజు రూ.12,600 చెల్లించాల్సి ఉంటుంది. కోర్స్ అడ్మిషన్, వివరాలకు శ్రీకాకుళంలోని ఇగ్నో స్టడీ సెంటర్‌లో సంప్రదించాలని లేదా https://ignouadmission.samarth.edu.in/ వెబ్‌సైట్ చూడాలని ఇగ్నో కోరింది.

News July 13, 2024

ప.గో: బైక్‌పై వస్తుండగా చెట్టు విరిగిపడి వ్యక్తి దుర్మరణం

image

పెరవలి మండలం ఖండవల్లిలోని పౌల్ట్రీ వద్ద చెట్టు విరిగి పడటంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల వివరాల ప్రకారం.. చాగల్లుకు చెందిన కువలేశ్ ఇరగవరం మండలం పేకేరులోని బంధువుల ఇంటికెళ్లాడు. తిరిగి బైక్‌పై ఇంటికి వస్తుండగా ఖండవల్లి వద్ద చెట్టు విరిగి అతడిపై పడింది. తలకు తీవ్ర గాయాలైన కువలేశ్‌ను తణుకు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News July 13, 2024

NLR: 2 నుంచి బీచ్‌ కబడ్డీ పోటీలు

image

నెల్లూరు జిల్లాలో ఆగస్టు 2, 3, 4వ తేదీల్లో 11వ ఆంధ్ర రాష్ట్ర బీచ్ కబడ్డీ పోటీలు జరగనున్నాయి. ఇందుకూరుపేటలోని ఎంకేఆర్‌ హైస్కూల్‌ గ్రౌండ్‌ వేదికగా ఈ పోటీలు నిర్వహిస్తారు.  సంబంధిత పోస్టర్‌ను కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నెల్లూరులోని తన నివాసంలో ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ పోటీలను విజయవంతం చేయాలని కోరారు.

News July 13, 2024

అనంతపురం: భూమి కేటాయిస్తే ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు

image

అనంతపురంలో 1200 ఎకరాల భూమి చూపిస్తే ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు అధ్యయనం చేస్తామని కేంద్ర విమానాయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు శనివారం అమరావతిలో వెల్లడించారు. ఇటీవల రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీలు అంబికా లక్ష్మీనారాయణ, బీకే పార్థసారథి అనంతపురంలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని రామ్మోహన్ నాయుడును కోరారు. స్పందించిన ఆయన భూమి కేటాయిస్తే పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.

News July 13, 2024

విశాఖ డీసీపీగా అజిత

image

విశాఖకు కొత్తగా ఇద్దరు డీప్యూటీ కమిషనర్ ఆఫీ పోలీసు(డీసీపీ)లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన డీసీపీగా అజిత వెజెండ్ల నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీగా పనిచేస్తూ బదిలీపై విశాఖ రానున్నారు. అలాగే DCP-2గా తూహిన్ సిన్హా సిన్హాకు బాధ్యతలు అప్పగించారు. సిన్హా ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీగా ఉన్నారు. కాగా అజిత గతంలో విశాఖ SEB అధికారిణిగా పనిచేశారు.

News July 13, 2024

గుంటూరు జిల్లా నూతన ఎస్పీగా సతీశ్ కుమార్

image

గుంటూరు జిల్లా నూతన ఎస్పీగా సతీశ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 37 మంది ఐపీఎస్‌లను ప్రభుత్వం తాజాగా బదిలీ చేసింది. ఇప్పటి వరకు గుంటూరు జిల్లా ఎస్పీగా పని చేసిన తుషార్ డూడిని బాపట్ల ఎస్పీగా నియమించారు. కాగా త్వరలోనే గుంటూరు జిల్లా ఎస్పీగా సతీశ్ కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు.  

News July 13, 2024

విజయవాడ డీసీపీ అధిరాజ్ సింగ్ రాణా బదిలీ

image

విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డిప్యూటీ కమిషనర్‌గా పని చేస్తున్న అధిరాజ్ సింగ్ రాణాను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఐపీఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా అధిరాజ్ సింగ్ రాణాని నంద్యాల జిల్లా ఎస్పీగా నియమిస్తూ.. సీఎస్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

News July 13, 2024

విజయనగరం జిల్లా ఎస్పీగా వకుల్ జిందాల్

image

విజయనగరం జిల్లా ఎస్పీగా వకుల్ జిందాల్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆయన ప్రస్తుతం బాపట్ల ఎస్పీగా పనిచేస్తున్నారు. ఇక్కడ ప్రస్తుతం ఉన్న ఎస్పీ ఎం.దీపిక అనకాపల్లికి బదిలీ అయ్యారు. అదేవిధంగా APSP 5వ బెటాలియన్ కమాండెంట్‌గా మలికా గర్గ్‌ను నియమించారు. ఈమె ప్రస్తుతం పల్నాడు జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నారు. కాగా SP వకుల్, మలికా గర్గ్ భార్యాభర్తలు కావడం విశేషం.