Andhra Pradesh

News July 13, 2024

కృష్ణా: ఎస్పీ అద్నాన్ నయీం అస్మి బదిలీ

image

కృష్ణా జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి శనివారం బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఐపీఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా ఎస్పీ అద్నాన్ నయీంని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీగా బదిలీ చేస్తూ.. డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాకు నూతన ఎస్పీగా ఆర్ గంగాధరరావును నియమించారు. గంగాధరరావు ప్రస్తుతం సీఐడీ ఎస్పీగా ఉన్నారు. 

News July 13, 2024

ప్రకాశం జిల్లా ఎస్పీగా దామోదర్

image

ఏపీలో భారీగా ఎస్పీలు బదిలీ అయ్యారు. ప్రకాశం జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న గరుడ్ సుమిత్ సునీల్‌ను బదిలీ చేస్తూ శనివారం అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనను DGP ఆఫీసులో రిపోర్టింగ్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే సునీల్ స్థానంలో ప్రకాశం జిల్లా ఎస్పీగా దామోదర్ ‌ బాధ్యతలు చేపట్టనున్నారు.

News July 13, 2024

విశాఖ: కేజీహెచ్‌లో పలు వార్డులను తనిఖీ చేసిన కలెక్టర్

image

విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ కేజీహెచ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పలు వార్డులను తనిఖీ చేసి పరిస్థితులను పరిశీలించారు. ఎమ్.ఆర్.ఐ స్కానింగ్ సెంటర్‌ను పరిశీలించి అక్కడ అందుతున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం కేజీహెచ్‌లో సమస్యలపై విభాగాధిపతులతో సమావేశం నిర్వహించారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. రోగులకు మెరుగైన సేవలు అందించాలన్నారు.

News July 13, 2024

SKLM: వేంకన్న అవతారంలో జగన్నాథుడి దర్శనం

image

శ్రీకాకుళం నగరం మొండేటివీధిలో శ్రీఃలలిత సహిత శివకామేశ్వర ఆలయం వద్ద రథయాత్ర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా జగన్నాథ, సుభద్ర, బలభద్రుల విగ్రహాలకు శనివారం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేంకన్న అవతారంలో స్వామివారిని అలకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.

News July 13, 2024

కూటమి ప్రభుత్వంలో దేవాలయాలకు మహర్దశ: ఎంపీ లావు

image

మంగళగిరి మండలం కొలనుకొండలోని శ్రీ హరే కృష్ణ గోకుల క్షేత్రంలో వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణంలో భాగంగా సీఎం చంద్రబాబు చేపట్టిన పూజా కార్యక్రమంలో నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రితో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో దేవాలయాలకు మహర్దశ రానుందని చెప్పారు.

News July 13, 2024

సూళ్లూరుపేటలో మహిళ మృతి

image

సూళ్లూరుపేటలో శనివారం విషాదం నెలకొంది. కుమ్మరిపాలెం గ్రామానికి చెందిన ఎర్రబోతు ఇందిరమ్మ, భర్త చెంచురామయ్య శనివారం రైల్వే స్టేషన్ వీధిలోని ఓ ఇంటి వద్దకు బెల్దారి పనికి వెళ్లారు. అక్కడ ప్రమాదవశాత్తు ఇందిరమ్మ చీర, వెంట్రుకలు మిల్లర్‌లో చిక్కుకున్నాయి. ఈ ఘటనలో ఆమె మొండెం, తల వేర్వేరు అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

News July 13, 2024

దువ్వూరు: బ్రహ్మ సాగర్‌లో అడుగంటిన జలం

image

దువ్వూరు మండలం చల్లబసాయ పల్లె గ్రామం వద్ద ఉన్న బ్రహ్మ సాగర్ ఎస్సార్ 1లో నీరు అడుగంటింది. జలాశయంలో ప్రస్తుతం అట్టడుగునా నీరు ఉంది. జులై నెల రెండు వారాలు పూర్తయినప్పటికీ వర్షాల జాడ కనిపించడం లేదని రైతులు చెప్తున్నారు. దీంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రిజర్వాయర్‌లో నీరు అందుబాటులో ఉంటే పంటలు సాగు చేసుకోవచ్చని ఏడాది ఆరుతడి పంటలకే పరిమితం కావలసి వస్తుందని రైతులు వాపోతున్నారు.

News July 13, 2024

రెండేళ్లలో రాయదుర్గం-తుంకూర్ రైలు మార్గం: కేంద్ర రైల్వేశాఖ సహయమంత్రి

image

రాబోయే రెండేళ్లలో రాయదుర్గం-తుంకూర్ రైలు మార్గం పనులు 2026నాటికి పూర్తిచేస్తామని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న హామీ ఇచ్చారు. మడకశిరలోని రాయదుర్గం-తుంకూర్ రైల్వే లైన్ అర్ధాంతరంగా ఆగిన పనులను ఆయన శుక్రవారం పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన పనులు పూర్తి చేయడానికి చర్యలు చేపట్టిందన్నారు. ఆయనను ఎంపీ
బీకే పార్థసారథి, ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు మంత్రిని కలిశారు.

News July 13, 2024

రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే: మేకపాటి

image

సీఎం చంద్రబాబును విజయవాడలో శనివారం మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబును వారు శాలువా కప్పి పుష్పగుచ్ఛంతో సన్మానించారు. ఏపీ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని మేకపాటి అన్నారు.

News July 13, 2024

శ్రీకాకుళం: B.Ed పరీక్ష ఫీజు చెల్లించేందుకు నేడే ఆఖరు

image

శ్రీకాకుళం జిల్లాలో DR.BRAU ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పెషల్ B.Ed.M.R కోర్సులకు సంబంధించి నాలుగో సెమిస్టర్ (2022-24) పరీక్షలకు సంబంధించి పరీక్షల ఫీజు చెల్లించేందుకు గడువు నేటితో ముగియనుంది. ఈ మేరకు నాలుగో సెమిస్టర్ విద్యార్థులు నేడు సాయంత్రంలోగా రూ.1,150‌ లను చెల్లించవచ్చు. పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లను ఈనెల 25వ తేదీన విడుదల చేయనున్నారు. సెమిస్టర్ పరీక్షలు 30వ తేదీన నిర్వహించనున్నారు.