Andhra Pradesh

News July 13, 2024

విజయానికి చేరువలో వైజాగ్ వారియర్స్: గేదెల శ్రీనుబాబు

image

విశాఖలో జరుగుతున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఫైనల్స్‌లోకి ప్రవేశించిన వైజాగ్ వారియర్స్ విజయానికి చేరువలో ఉందని టీమ్ ఓనర్ పల్సస్ సీఈవో గేదెల శ్రీనుబాబు అన్నారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ.. ఈ సీజన్‌లో వైజాగ్ టీమ్ అసాధారణమైన నైపుణ్యం, అంకితభావం ప్రదర్శించినట్లు పేర్కొన్నారు. వైజాగ్ విశ్వసనీయత, హోదాను కాపాడుకోవడానికి వ్యక్తిగతంగా ఎంపిక ప్రక్రియలో తను పాల్గొన్నట్లు తెలిపారు.

News July 13, 2024

త్వరలో అశోక్ లేల్యాండ్ యూనిట్ పనులు ప్రారంభం: MLA వెంకట్రావు

image

బాపులపాడు మండలం మల్లవల్లిలో అశోక్ లేల్యాండ్ బస్సుల తయారీ యూనిట్‌లో త్వరలో పనులు ప్రారంభం కానున్నాయని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన చర్చలు సఫలమవడంతో ఆ కంపెనీ పనులు ప్రారంభించేందుకు అంగీకరించిందని తన అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో ఆయన పోస్ట్ చేశారు. ఈ యూనిట్‌ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 5,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా.

News July 13, 2024

అనంతపురం జిల్లా మహిళకు సీఎం చంద్రబాబు అభినందన

image

అంతర్జాతీయ గుల్బెంకియన్ అవార్డు అందుకున్న అనంతపుం జిల్లా మహిళా రైతుకు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. బత్తలపల్లి మహిళా రైతు నాగేంద్రమ్మ ప్రకృతి వ్యవసాయం అభివృద్ధికి చేసిన కృషికి గానూ ఈ అవార్డు లభించింది. పోర్చుగల్‌లోని లిన్‌బిన్‌లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఏపీ రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ విజయ్ కుమార్‌తో కలిసి ఆమె అవార్డు అందుకున్న విషయం తెలిసిందే.

News July 13, 2024

ఈ నెల 23 నుంచి ‘పొలం పిలుస్తోంది’: మంత్రి అచ్చెన్నాయుడు

image

రాష్ట్రంలో ఈ నెల 23వ తేదీ నుంచి ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. శనివారం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ.. గత తమ ప్రభుత్వ హయాంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, తిరిగి మళ్లీ ప్రారంభిస్తున్నామని అన్నారు. ప్రతి మంగళ, బుధవారంలో చేపడతామన్నారు. రైతు వద్దకే వ్యవసాయ శాఖ అధికారులు వెళ్లి సూచనలు ఇవ్వాలన్నారు.

News July 13, 2024

సీతంపేటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్)ను సోమవారం సీతంపేటలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సీతంపేట ఐటీడీఏ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించడం జరుగుతుందని ప్రజలు తమ సమస్యలు సమర్పించవచ్చని ఆయన చెప్పారు. స్థానిక ప్రజలు గిరిజనులు అంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News July 13, 2024

తిరుపతి: SVU సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

image

తిరుపతి: SVU పరిధిలో ఈ ఏడాది మే నెలలో డిగ్రీ (UG) 6వ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి. ఈ ఫలితాలు శనివారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను www.manabadi.co.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు. ఆరో సెమిస్టర్ ఫలితాలు వీలైనంత త్వరగా ఇవ్వనున్నట్లు తెలిపారు. కళాశాలల నుంచి వైవా (Viva) మార్కులు రావాల్సి ఉందని అన్నారు.

News July 13, 2024

నంద్యాల: బాలిక హత్యాచార ఘటనలో ట్విస్టుల మీద ట్విస్టులు

image

నంద్యాల జిల్లాలో సంచలనం సృష్టించిన బాలిక హత్యాచార ఘటనలో ట్విస్టులు మీద ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. మొదట ముగ్గురు బాలురు రేప్, అనంతరం హత్యచేసి మృతదేహాన్ని నీటిలో పడేశామని చెప్పగా.. పోలీసులు 5రోజులుగా గాలించారు. ఆచూకీ లభించకపోవడంతో మరోసారి విచారించగా శ్మశానంలో పూడ్చి పెట్టామని చెప్పారు. అక్కడ వెతికినా ఫలితం లేకపోవడంతో, శనివారం జూపాడుబంగ్లా PSలో నిందితుల తల్లిందండ్రులను పోలీసులు విచారిస్తున్నారు.

News July 13, 2024

విజయనగరంజిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు

image

విజయనగరంలోని డీఎస్ఏ ఇండోర్ స్టేడియంలో ఈ నెల 18 నుంచి 21 వరకు జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్, ఎంపిక పోటీలు జరుగుతాయని అసోసియేషన్ ఛైర్మన్ ఇందుకూరి రఘు రాజు తెలిపారు.అసోసియేషన్ సీఈవో పి. శ్రీరాములుతో కలిసి మాట్లాడారు.ఈ నెల 18న అండర్-11,13,19న అండర్-15, 17 బాలబాలికలు,20న అండర్-19, స్త్రీ, పురుషులకు,21న వెటరన్ స్త్రీ, పురుషులకు పోటీలు నిర్వహిస్తామన్నారు. ఈనెల 15 లోపు వివరాలు అందించాలన్నారు.

News July 13, 2024

తిరుపతిలో మహిళ దారుణ హత్య

image

తిరుపతి రూరల్ మండలం వేదాంతపురంలోని విద్యుత్ నగర్‌లో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. చాకుతో మహిళ గొంతు కోసి దారుణ హత్య చేసినట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై పోలీసులకు సమాచారం అందజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఆమెను హత్య చేసింది ఎవరూ, హత్యకు కుటుంబ కలహాలా, లేక వేరే ఇతర కారణమా అనేది దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

News July 13, 2024

కడప: కళాశాలలకు ఇంటర్ పాస్ సర్టిఫికెట్లు

image

కడప జిల్లాలోని అన్ని జూనియర్ కళాశాలలకు 2024 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు పాస్ సర్టిఫికెట్లను సంబంధిత కళాశాలలకు పంపించామని ఇంటర్ ఆర్ఐఓ బండి వెంకటసుబ్బయ్య తెలిపారు. విద్యార్థులు నేరుగా కళాశాల ప్రిన్సిపాల్‌ను సంప్రదించి సర్టిఫికెట్లను పొందాలని తెలిపారు.