Andhra Pradesh

News July 13, 2024

నంద్యాల: రైలు నుంచి కింద పడిన భార్య.. కాపాడే క్రమంలో భర్త మృతి

image

రైలు నుంచి కిందపడిన భార్యను కాపాడబోయి భర్త మృతిచెందిన ఘటన డోన్‌ సమీపంలోని ఎర్రగుంట్ల వద్ద జరిగింది. దంపతులు సయ్యద్‌ ఆసిఫ్‌, అసియాబాను ఫుట్‌బోర్డుపై కూర్చొని ప్రయాణిస్తుండగా నిద్రమత్తులో భార్య కిందపడింది. గమనించిన భర్త ఆమెను కాపాడేందుకు రైలు నుంచి దూకి మృతిచెందాడు. మహిళను డోన్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కర్ణాటకకు చెందిన వీరు.. 4 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

News July 13, 2024

REWIND: సిక్కోలు మణిరత్నం చౌదరి సత్యనారాయణ (నేడు జయంతి)

image

ఎచ్చెర్ల మండలం ఎస్ఎం పురంలో 1908 జులై 13న జన్మించిన చౌదరి సత్యనారాయణ స్వాతంత్ర్య సమరయోధుడు. 13 ఏళ్ల వయసులోనే ఉప్పు సత్యాగ్రహం, కల్లు వేలం పాటలకు వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొని బ్రిటిష్ పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో దూసి పోలీస్ స్టేషన్‌కు వచ్చిన మహాత్మా గాంధీని పొందూరు ఖాదీతో సత్కరించారు. 1955, 1967లో కృషికార్ లోక్ పార్టీ, స్వతంత్ర పార్టీ తరఫున ఎమ్మెల్యే అయ్యారు.

News July 13, 2024

ఒంగోలు: విద్యార్థులు మొక్కలు నాటాలి: డీఈవో

image

జిల్లాలోని అన్ని పాఠశాలల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని డీఈవో డి.సుభద్ర శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5న ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా చేపట్టిన ఏక్ పేడ్ మాకౌనామ కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో విద్యార్థులతో మొక్కలు నాటించే కార్యక్రమం చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి జియోటాగ్ ఫొటోలను గ్రూపులో పెట్టాలన్నారు.

News July 13, 2024

విజయనగరం:అగ్నిపథ్‌లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

అగ్నిపథ్‌లో భాగంగా అగ్నివీర్-వాయు సేనలో ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా అవివాహిత పురుష,మహిళ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు యువజన సర్వీసుల శాఖ సీఈవో రాంగోపాల్ తెలిపారు.ఇంజినీరింగ్‌లో మూడు సంవత్సరాలు చదివిన వారు,రెండు సంవత్సరాల ఒకేషనల్ కోర్సు పూర్తి చేసిన వారు కూడా అర్హులని చెప్పారు.ఈనెల 28 వరకు అవకాశం ఉందని అన్నారు. https://agni- pathavaya.cdac.in వెబ్ సైట్ లో నమోదు చేసుకోవాలన్నారు.

News July 13, 2024

చంద్రగిరిలో కారు డ్రైవింగ్ పై ఉచిత శిక్షణ

image

యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ చంద్రగిరిలో 30 రోజుల పాటు పూర్తి ఉచితంగా పురుషులు, మహిళలకు లైట్ మోటార్ వెహికల్ కారు డ్రైవింగ్‌పై ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు సంస్థ డైరెక్టర్ పి.సురేష్ బాబు తెలిపారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన తిరుపతి, చిత్తూరు జిల్లాల గ్రామీణ ప్రాంతాలకు చెందిన 19 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు ఉన్న నిరుద్యోగులు అర్హులని తెలిపారు.

News July 13, 2024

నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు షెడ్యూల్ ఇదే..

image

సీఎం చంద్రబాబు శనివారం ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఉంటారు. ఈ సాయంత్రం 4:30 గంటలకు ముంబై వెళ్లనున్నారు. ముకేశ్ అంబానీ కుమారుడి వివాహ వేడుకలో పాల్గొనేందుకు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో అక్కడికి బయలుదేరుతారు. రాత్రికి ముంబైలోనే బస చేయనున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఉండవల్లి నివాసానికి తిరిగి చంద్రబాబు చేరుకోనున్నారు.

News July 13, 2024

15 సూత్రాల పథకం పక్కాగా అమలుచేయాలి: కలెక్టర్

image

మైనార్టీ సంక్షేమంలో భాగంగా ప్రధాని 15 సూత్రాల పథకం సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని మైనార్టీ సంక్షేమాధికారిని కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు. ఆదోని ప్రాంతంలో ఐటీఐ కళాశాల భవనం పూర్తైనా టెక్నికల్ ఎడ్యుకేషన్ శాఖ స్వాధీనం చేసుకోలేదని, నిర్లక్ష్యం ఎందుకని ప్రశ్నించారు. వెంటనే దీనిపై డీవో లెటర్ సిద్ధం చేయాలని ఆదేశించారు.

News July 13, 2024

గుంటూరు మిర్చి యార్డుకు 21,027 టిక్కీలు

image

గుంటూరు మిర్చి యార్డుకు శుక్రవారం 21,027 టిక్కీల మిర్చి రాగా పాత నిల్వలతో కలిపి 25,626 టిక్కీలు విక్రయించారు. ఇంకా 12,347 టిక్కీలు నిల్వ ఉన్నాయి. నాన్ ఎసి కామన్ వెరైటీలు సగటున కనిష్ట ధర రూ.8వేలు పలకగా గరిష్టంగా రూ.16 వేలు పలికింది. నాన్ ఏసీ స్పెషల్ వెరైటీలు కనిష్టంగా రూ.8 వేలు, గరిష్టంగా రూ.18,600 లభించాయి. ఏసీ కామన్ వెరైటీలు సగటు కనిష్ట ధర రూ.8500, గరిష్ట ధర రూ.16,500 పలికింది.

News July 13, 2024

కుప్పం: వైసీపీ నేతల అరెస్ట్

image

కుప్పం(M)ఎన్ కొత్తపల్లికి చెందిన YCP నేత ఈశ్వర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కొత్తపల్లి చెందిన YCP నేత ఈశ్వర్, అతని కొడుకులు పవన్, సతీశ్ తమ్ముడు బాలు, బంధువు నరసింహులు తనపై దాడి చేశారని జూన్ 1న TDP నేత సుబ్రహ్మణ్యం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ఐదుగురిపై అప్పట్లోనే కుప్పం పోలీసులు కేసు నమోదు చేయగా.. శుక్రవారం రాత్రి అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరచగా 14 రోజుల రిమాండ్‌ విధించారు.

News July 13, 2024

కర్నూలు: డీఎస్సీ ఉచిత శిక్షణ

image

డీఎస్సీ ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ సాధికారిత అధికారిణి వెంకటలక్ష్మి తెలిపారు. DED, TTC, TETలో అర్హత సాధించిన BC, SC, ST, మైనార్టీ అభ్యర్థులు ఈనెల 18లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. కర్నూలులోని BC స్టడీ సర్కిల్ కార్యాలయంలో దరఖాస్తులు అందించాలన్నారు. 60 రోజుల పాటు ఇచ్చే శిక్షణ కాలంలో ఉచిత మెటీరియల్, ఉపకార వేతనం సైతం ఇవ్వనున్నట్లు చెప్పారు.