Andhra Pradesh

News July 13, 2024

ప.గో.: ఉరివేసుకొని యువకుడు ఆత్మహత్య

image

ప.గో. జిల్లా వీరవాసరం మండలం పేర్కిపాలెం గ్రామానికి చెందిన ఆనంద్ కుమార్(19) శుక్రవారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని తల్లిదండ్రులు ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశంలో ఉంటున్నారు. నాయనమ్మ వద్ద ఉంటున్న ఆనంద్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News July 13, 2024

నరసాపురం: వశిష్ట వారధి టెండర్లు మళ్లీ వాయిదా

image

వశిష్ట వారధి టెండర్లు ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసినట్లు జాతీయ రహదారుల శాఖ ఈఈ శ్రీనివాసులు చెప్పారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల మధ్య రామేశ్వరం- నరసాపురం మండలం రాజులంక వద్ద వారధి నిర్మాణానికి గత ఏడాది ఆగస్టులో టెండర్లు పిలిచారు. భూసేకరణపై కొందరు రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో టెండర్లు తెరవకుండా NH అధికారులు వాయిదా వేస్తూ వస్తున్నారు. ఇదే కారణంతో వాయిదా వేయడం ఇది 11వ సారి.

News July 13, 2024

ప్రకాశం: వెబ్‌సైట్‌లో మెరిట్ జాబితా

image

స్కాలర్షిప్ కోసం 2023 డిసెంబర్ 3న జరిగిన పరీక్షలో ప్రతిభ కనబరిచిన వారి జాబితా ప్రకాశం వెబ్సైట్ లో ఉంచినట్లు డీఈవో సుభద్ర తెలిపారు. ఎంపికైన విద్యార్థులు వెబ్సైట్ నుంచి వారి మెరిట్ కార్డును డౌన్లోడ్ చేసుకుని వారి పేరు, పుట్టిన తేదీ, తండ్రి లేదా తల్లి పేరును సరిచూసుకోవాలన్నారు. వివరాలు సరిగ్గా ఉన్నట్లయితే NMMS అధికారిక పోర్టల్‌లో ఆగస్టు 31 లోగా అప్లోడ్ చేయాలన్నారు.

News July 13, 2024

శ్రీకాకుళం: ‘రెండో శనివారం సెలవు లేదా? అయితే ఫిర్యాదు చేయండి’

image

ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లాలో అన్ని పాఠశాలలు, జూనియర్ కళాశాలలు రెండో శనివారం సెలవు దినం పాటించాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు గొండు సీతారాం తెలిపారు. సెలవు ప్రకటించని పక్షంలో ఆయా పాఠశాల, కళాశాలలపై apscpcr2018@gmail.com మెయిల్ ఐడీ ద్వారా ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.

News July 13, 2024

బొబ్బిలి: పరీక్షలో పాస్ చేస్తామని రూ.12 లక్షలు టోకరా

image

పరీక్షల్లో తప్పినా పాస్ చేయించాక ఉద్యోగం ఇప్పిస్తామని ఓ ముఠా రూ. 12 లక్షలు కొల్లగొట్టిన ఘటన బొబ్బిలిలో జరిగింది. విద్యార్థి రాజాంలోని ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదివాడు. కొన్ని సబ్జెక్టులు ఫెయిలయ్యాడు. మే రెండో వారంలో ముఠా అతని తండ్రికి ఫోన్ చేసి పాస్ చేసి, ఉద్యోగం ఇప్పిస్తామని వసూలు చేశారు. ఫలితాలు వెలువడడం ,మళ్లీ ఫెయిలవడంతో మోసపోయానని గ్రహించారు. దీనిపై శుక్రవారం పోలీసులను ఆశ్రయించారు.

News July 13, 2024

గుంటూరు: ప్రభుత్వ బంగ్లాలో YCP ప్రచార సామగ్రి.. TDP నేతల ఆగ్రహం

image

గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని ట్రావెలర్స్ బంగ్లా మాజీ సీఎం జగన్ ప్రచార పుస్తకాలకు నిలయంగా మారిందని గుంటూరు టీడీపీ నేతలు ఆరోపించారు. ఎన్నికలకు ముందు వైసీపీ నాయకులు ప్రచారం కోసం ‘ఆంధ్రప్రదేశ్ ‌కు జగనే ఎందుకు కావాలి? ‘అనే పుస్తకాలను పెద్దఎత్తున ముద్రించి, నిల్వ చేశారన్నారు. వైసీపీ ఓడిపోయినా ఆ బంగ్లాలోని 2 గదుల్లో పుస్తకాలు భద్రంగా ఉంచారని, వాటిని తీసేయాలని డిమాండ్ చేస్తున్నారు.

News July 13, 2024

నేటితో పాలిసెట్ రెండో విడత కౌన్సెలింగ్ ముగింపు

image

పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు జరుగుతున్న రెండో విడత కౌన్సెలింగ్‌‌లో భాగంగా శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన కొనసాగుతోంది. కాగా శుక్రవారం 40 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం రెండు రోజుల్లో 70 మంది హాజరయ్యారు. ఈ కౌన్సెలింగ్ గురువారం ప్రారంభం కాగా శనివారంతో ముగియనుంది. మొదటి విడత సీట్లు లభించిన విద్యార్థులు బ్రాంచ్‌లు మార్చుకునే వెసులుబాటు ఉంది.

News July 13, 2024

కావలి: హైవేపై రోడ్డు ప్రమాదం.. ఒకరు స్పాట్ డెడ్

image

కావలి పరిధిలోని నేషనల్ హైవే రోడ్డుపై శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఒంగోలు వైపు వెళ్లే రోడ్డులో గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కావలి రూరల్ సీఐ శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతి చెందిన వ్యక్తి భిక్షాటన చేసుకునే వ్యక్తిగా, రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

News July 13, 2024

విశాఖ: కేజీహెచ్‌కు ఎస్బీఐ రూ. 47 లక్షల ఆర్థిక సహాయం

image

కేజీహెచ్‌ను డిజిటలైజేషన్ చేయడంలో SBI రూ. 47 లక్షల సాయాన్ని అందించింది. సంస్థ సీఎస్సార్ నిధుల్లో వీటిని సమకూర్చింది. ఈ నిధులతో కేస్ సీట్లు, ల్యాబ్ పరీక్షలు నివేదికలను కంప్యూటరీకరణ చేస్తున్నారు. రానున్న ఆరు నెలల వ్యవధిలో రోగులకు సెల్ ఫోన్లకే ల్యాబ్ పరీక్షలు నివేదికలను పంపే విధానాన్ని రూపొందిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్ వి. శివానంద తెలిపారు.

News July 13, 2024

ఓబులవారిపల్లె కానిస్టేబుల్ సస్పెన్షన్

image

నగదు గోల్‌మాల్ చేశారనే ఆరోపణలతో ఓ కానిస్టేబుల్‌పై వేటు పడింది. వివరాల్లోకి వెళితే.. ఓబులవారిపల్లె పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న మల్లికార్జునను ఎస్పీ కృష్ణారావు గురువారం సస్పెండ్ చేశారు. విధుల్లో భాగంగా రాజంపేట కోర్టుకు నిత్యం హాజరవుతూ న్యాయస్థానానికి సంబంధించి రూ.8 లక్షల నగదును గోల్‌మాల్ చేశారనే అభియోగంతో ఆయనను సస్పెండ్ చేశారని సమాచారం.