Andhra Pradesh

News July 13, 2024

ఒడిశా సీఈఓగా నంద్యాల జిల్లావాసి

image

నంద్యాల జిల్లా అవుకు మండల పరిధిలోని మన్నేనాయక్ తండాకు చెందిన 2009 బ్యాచ్‌ IAS అధికారి డా.ఎన్.తిరుమల నాయక్‌కు కేంద్ర ప్రభుత్వం కీలక భాద్యతలు అప్పగించింది. ఒడిశా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా ఆయనను ఈసీ నియమించింది. ఒడిశాలోని పలు జిల్లాల కలెక్టర్, డైరెక్టర్, కమిషనర్ వంటి హోదాల్లో ఆయన పని చేశారు. కాగా గతంలో సంజామల ప్రభుత్వ పశు వైద్యశాల పశువైద్యాధికారిగా తిరుమల నాయక్ సేవలందించారు.

News July 13, 2024

రేపు శ్రీకాకుళం జిల్లా హాకీ సంఘం ఎన్నికలు

image

జిల్లా హాకీ సంఘం ఎన్నికలు ఆదివారం నిర్వహించనున్నట్లు ఆ సంఘం ప్రధాన కార్యదర్శి షైనీ మధు తెలిపారు. శ్రీకాకుళంలోని తిలక్ నగర్ వద్ద యూటీఎఫ్ భవనంలో ఉదయం 10 గంటలకు జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించి, నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర సంఘ ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు.

News July 13, 2024

నడిరోడ్డుపై ప్రయాణికులకు అగచాట్లు

image

విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు శుక్రవారం అర్ధరాత్రి బాపులపాడు మం. వీరవల్లి వద్ద మొరాయించింది. బస్సుకు మరమ్మతు చేయకుండా డ్రైవర్, క్లీనర్ పరారవ్వడంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. టికెట్ డబ్బులు వెనక్కి ఇవ్వాలంటూ నిరసనకు దిగారు. దీంతో వీరవల్లి పోలీసులు రంగ ప్రవేశం చేసి సమస్యను పరిష్కరించారు. బస్ యాజమాన్యం టికెట్ డబ్బులు వెనక్కి ఇవ్వడంతో ఇతర బస్సుల్లో వెళ్లిపోయారు.

News July 13, 2024

విశాఖ: ఏపీఎల్ టైటిల్ పోరుకు వైజాగ్ వారియర్స్

image

విశాఖ వైఎస్సార్ క్రికెట్ స్టేడియంలో ఏపీఎల్ సీజన్-3లో భాగంగా శుక్రవారం క్వాలిఫైయర్-2 లో వైజాగ్ వారియర్స్ రాయలసీమ కింగ్స్ పై విజయం సాధించి టైటిల్ పోరుకు సిద్ధమైంది. వైజాగ్ వారియర్స్ ఆరు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రాయలసీమ కింగ్స్ 7 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. శనివారం ఉత్తరాంధ్ర లయన్స్ తో ఫైనల్ కు వైజాగ్ వారియర్స్ తలపడనుంది.

News July 13, 2024

అనంత: గర్భం దాల్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు

image

అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలోని ఓ బాలిక తల్లిదండ్రులు మృతి చెందారు. దీంతో పిన్నమ్మతో కలిసి ఉంటోంది. అదే గ్రామానికి చెందిన భాస్కర్ బాలికకు పరిచయమయ్యాడు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. గర్భం దాల్చిన విషయం తెలిసి ముఖం చాటేశాడు. ఎస్సై నరేశ్ ఇద్దరినీ గుంతకల్లు డీఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ విచారణ చేపట్టి యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వివరించారు.

News July 13, 2024

తూ.గో.: ఈ నెల 18న పాలిటెక్నిక్‌లో ప్రవేశాలు

image

ఉమ్మడి తూ.గో. జిల్లాలోని వివిధ పాలిటెక్నిక్ కళాశాలల్లో రెండో సంవత్సరం డిప్లమా కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీ చేపట్టనున్నట్లు కాకినాడ ఆంధ్ర పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ జనార్దనరావు తెలిపారు. ఐవీసీ ఇంటర్ ఉత్తీర్ణత సాధించినవారు 16వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని పేర్కొన్నారు. 18న ప్రవేశాలు ఉంటాయన్నారు.

News July 13, 2024

నేడు, రేపు జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పోటీలు

image

జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పోటీలో శని, ఆదివారం శ్రీకాకుళంలోని శాంతినగర్ కాలనీలో ఉన్న డీఎస్ఏ ఇండోర్ స్టేడియం వేదికగా జరగనున్నాయి. జిల్లా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్-2024 పేరిట నిర్వహిస్తున్న ప్రతిష్ఠాత్మక టోర్నీలో మొత్తం ఆరు విభాగాల్లో పోటీలు నిర్వహించానున్నారు. అండర్-11, అండర్-13, అండర్-15, అండర్-17, అండర్-19 బాలికలకు, పురుషులు పోటీలు జరుగుతాయి.

News July 13, 2024

కొండపి: కాలువలోకి దూసుకెళ్లిన అంబులెన్స్‌

image

అదుపుతప్పి అంబులెన్స్‌ కాలువలోకి దూసుకెళ్లి నీటిలో మునిగిన ఘటన సింగరాయకొండ మండల పరిధిలోని పెరల్‌ డిస్టిలరీ సమీపంలో శుక్రవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి చెందిన అంబులెన్స్‌ పేషెంట్‌ను తీసుకొచ్చి తిరిగి వెళ్తోంది. పెరల్‌ డిస్టిలరీ సమీపంలోకి రాగానే అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రమాదం తప్పిందన్నారు.

News July 13, 2024

VZM: జడ్పీ సమావేశంలో ఆసక్తికరమైన చర్చ

image

జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఓ జడ్పీటీసీ సభ్యురాలు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. ‘మీ పాలన మీ తాతగారిని గుర్తుచేస్తోంది’ అని మంత్రిని ఉద్దేశించి ఆమె అన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ప్రజా ప్రతినిధిని ఆయన గౌరవించే వారని గుర్తు చేశారు. మంత్రి స్పందిస్తూ ‘తాతగారి బాటలో మీ అందరి సహకారంతో పనిచేస్తాం’ అని మాట ఇస్తున్నానన్నారు.

News July 13, 2024

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీం పొడిగింపు

image

రాష్ట్ర ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీం పథకాన్ని 2024-25 ఆర్థిక సంవత్సరానికి పొడిగిస్తూ GOMS నెం. 82 ను జారీ చేసినట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీం (WJHS) పొడిగింపునకు సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రతిపాదనలు పంపించగా ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వివరించారు.