Andhra Pradesh

News July 13, 2024

ప.గో.: రూ.7లక్షలకు బ్యాంక్‌లో ఉద్యోగమంటూ మోసం

image

ఏలూరుకు చెందిన ఓ వ్యక్తి కొందరితో ముఠాగా ఏర్పడి ఉమ్మడి ప.గో.లోని నిరుద్యోగులను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడేనికి చెందిన డిగ్రీ చదివిన రాశికి బ్యాంక్‌లో ఉద్యోగం ఇప్పిస్తామని రూ.7లక్షలు డిమాండ్ చేశారు. నమ్మి డబ్బు కట్టగా నకిలీ అపాయింట్ మెంట్ ఇచ్చి, శిక్షణ సైతం ఇచ్చారు. తీరా ఉద్యోగం లేదని తెలియడంతో పోలీసులకు ఫిర్యాదుచేసింది. దీంతో దందా వెలుగులోకి వచ్చింది.

News July 13, 2024

NLR: చిన్నారిపై లైంగికదాడి.. నిందితుడికి పదేళ్ల శిక్ష

image

ఐదేళ్ల చిన్నారిపై లైంగికదాడి కేసులో బుచ్చిరెడ్డిపాళెం మండలం రాఘవరెడ్డి కాలనీకి చెందిన గంగపట్నం కుమార్ అనే వ్యక్తికి పదేళ్ల జైలు శిక్ష పడింది. రూ.25 వేల జరిమానా కూడా విధిస్తూ నెల్లూరు 8వ అదనపు జిల్లా కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. స్థానికంగా నివాసముంటున్న ఓ మహిళ పనికి వెళ్లే సమయంలో తన కుమార్తెను పక్కింట్లో వదిలి వెళ్లేది. ఈ నేపథ్యంలో 2017 జనవరి 22న కుమార్ చిన్నారిపై లైంగికదాడికి పాల్పడ్డాడు.

News July 13, 2024

కొండేపి: పొగాకు గరిష్ఠ ధర కేజీ రూ.356

image

కొండేపి పొగాకు వేలం కేంద్రానికి నాణ్యమైన బేళ్లు తీసుకొచ్చి అధిక ధరలు పొందాలని వేలం నిర్వహణాధికారి సునీల్ కుమార్ సూచించారు. స్థానికుల పొగాకు వేలం కేంద్రంలో శుక్రవారం జరిగిన వేలంలో పొగాకు గరిష్ఠ ధర కేజీ రూ.356 పలికిందని తెలిపారు. రైతులు 1174 బేళ్లు వేలానికి తీసుకురాగా వాటిలో 1112 కొనుగోలయ్యాయి. కనిష్ఠ ధర కేజీ రూ.205, సరాసరి ధర రూ.282. 72 పలికిందన్నారు.

News July 13, 2024

ప్రొద్దుటూరు: అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

image

మైలవరం మం, దొడియంకు చెందిన రేష్మ(25)కు 10 ఏళ్ల క్రితం అమృత నగర్‌కు చెందిన అన్వర్ బాషాతో ప్రేమ వివాహం జరిగింది. ఆమెకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని భర్త అనుమానం పెంచుకున్నాడు. 10 రోజుల క్రితం భర్తతో గొడవ పడి ఆమె తన పెద్దమ్మ ఇంటికి వెళ్లింది. శుక్రవారం భర్త ఆమె వద్దకు వెళ్లి సరదాగా పార్కు వెళ్దామంటూ పిలిచాడు. ఎకో పార్కుకు తీసుకెళ్లి గొంతు నులిమి చంపి పూడ్చి పెట్టి, స్టేషన్‌లో లొంగిపోయాడు.

News July 13, 2024

తిరుపతి: ఆరేళ్ల చిన్నారిపై వృద్ధుడు లైంగిక దాడి

image

ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. CI శ్రీరామ శ్రీనివాసులు కథనం ప్రకారం.. ఏర్పేడు మండలానికి చెందిన బలరామయ్య గౌడ్(61) ఆరేళ్ల చిన్నారిపై గత ఆదివారం లైంగిక దాడి చేశాడు. బాలిక నొప్పిగా ఉందని చెప్పడంతో తల్లిదండ్రులు స్థానికంగా చికిత్స అందించగా నొప్పి తగ్గకపోవడంతో రేణిగుంటలోని వైద్యశాలకు తీసుకుపోగా విషయం తెలిసింది. బాలిక తల్లిదండ్రులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News July 13, 2024

విజయవాడ దుర్గమ్మ ఆలయంలో భద్రత కట్టుదిట్టం

image

విజయవాడ కనక దుర్గమ్మ ఆలయంలో భద్రత మరింత కట్టుదిట్టం చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. 2020లో ఆలయ భద్రతపై ఇచ్చిన నివేదికలో పేర్కొన్న అంశాలు అమలు కాకపోవడంతో తాజాగా అధికారులు సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించారు. ఈ మేరకు ఆడిట్ నిర్వాహకులు ప్రభుత్వానికి తమ నివేదిక సమర్పించారు. మెటల్ డిటెక్టర్లు, భద్రతా సిబ్బంది పెంపు, వారికి శిక్షణ తదితర అంశాలను వారు తమ నివేదికలో పొందుపర్చినట్లు తెలుస్తోంది.

News July 13, 2024

పిఠాపురంపై స్పెషల్ ఫోకస్.. ఛత్తీస్‌ఘడ్‌ ప్రాజెక్ట్ ఇక్కడికి

image

ఛత్తీస్‌ఘడ్‌లో విజయవంతంగా అమలవుతున్న ఘన, ధ్రవ వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్ట్‌ను రాష్ట్రంలో తొలుత పిఠాపురం నుంచే ప్రారంభించనున్నారు. ఈ నియోజకవర్గంలో గొల్లప్రోలు, పిఠాపురం, ఉప్పాడ, కొత్తపల్లి మండలాలు ఉండగా, 52 గ్రామాలున్నాయి. ఈ గ్రామాల్లో ఉత్పత్తి అయిన చెత్తను సేకరించి అందులో ప్లాస్టిక్ వస్తువులను వేరుచేసి ‘రీసైక్లింగ్’కి విక్రయిస్తారు. ఇక తడిచెత్తతో తయారైన ఎరువును అటవీ నర్సరీలకు సరఫరా చేస్తారు.

News July 13, 2024

విజయవాడలో బాడీ మసాజ్ కేంద్రంపై దాడి

image

విజయవాడలో బాడీ మసాజ్ కేంద్రంపై శుక్రవారం రాత్రి పోలీసులు దాడి చేశారు. మాచవరం సీఐ గుణరామ్ వివరాల మేరకు.. గుణదల పంచాయతీ ఆఫీస్ రోడ్డులో బాడీ స్పా నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు దాడి చేశామన్నారు. అక్కడ స్పా నిర్వహిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకొని ఇద్దరు యువతులను రక్షించామని తెలిపారు. నిందితులు కల్లం మెరీన్ వెంకటేశ్వర్లు, నాయక్‌పై కేసు నమోదు చేశామని సీఐ చెప్పారు.

News July 13, 2024

రేపు హిందూపురానికి నందమూరి బాలకృష్ణ రాక

image

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రేపు నియోజకర్గంలో పర్యటిస్తారని ఆయన వ్యక్తిగత కార్యదర్శి సురేంద్ర తెలిపారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన చిలమత్తూరు మండలం సోమగట్టకు చేరుకొని ఉ.9కి వాటర్ ప్లాంట్ ప్రారంభిస్తారని పేర్కొన్నారు. అక్కడి నుంచి కొటిపి సమీపంలో ఏర్పాటు చేసే విద్యుత్తు ఉపకేంద్రానికి భూమిపూజ చేసి టిడ్కో ఇళ్లు పరిశీలిస్తారు. అనంతరం పరిగిలో సీసీ రోడ్డు భూమి పూజ చేస్తారని వివరించారు.

News July 13, 2024

కృష్ణా: ‘రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు’

image

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వాహనాల్లో ప్రయాణించేటప్పుడు సీట్ బెల్ట్, హెల్మెట్ వినియోగం తదితర అంశాలపై అవగాహన కల్పించారు.