Andhra Pradesh

News July 13, 2024

ప.గో.: అంతర్జాతీయ స్థాయిలో కవి ప్రసాద్‌కు సత్కారం

image

అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక సంస్థ శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో ‘పర్యావరణాని కోసం మొక్క నాటుదాం’ అనే అంశంపై కవితల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో తణుకు పట్టణానికి చెందిన ప్రముఖ కవి వీఎస్‌వీ ప్రసాద్‌కు ప్రథమ బహుమతి లభించింది. 350 మంది కవులు పాల్గొన్నారు. ‘తనుత్రాణం’ పేరుతో రచించిన కవితకు ప్రశంసలు లభించాయి.

News July 13, 2024

అనకాపల్లి: ‘పరిశ్రమలలో భద్రతా ప్రమాణాలను పాటించాలి’

image

అనకాపల్లి జిల్లాలో ఉన్న పరిశ్రమలలో పూర్తిస్థాయి భద్రతా ప్రమాణాలను అమలు చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌లో పారిశ్రామిక, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ.. వివిధ రకాల చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు జిల్లా యంత్రాంగం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని అన్నారు.

News July 13, 2024

యువతకు శిక్షణా, ఉపాధి కల్పించాలి: బాపట్ల కలెక్టర్

image

జిల్లాలోని స్కిల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులందరూ డీఆర్డీఏ, మెప్మా అధికారులను సమన్వయం చేసుకొని ముందుకు సాగాలని కలెక్టర్ నాగలక్ష్మీ పేర్కొన్నారు. 2024-25 సంవత్సరానికి నిరుద్యోగ యువతకు శిక్షణా, ఉపాధి కల్పించడంపై దృష్టి పెట్టాలని చెప్పారు. ఇందుకు అవసరమైన ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. శుక్రవారం కలక్టరేట్‌లో స్కిల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

News July 13, 2024

కృష్ణా: రైల్వే ప్రయాణికులకు శుభవార్త

image

విజయవాడ మీదుగా ప్రయాణించే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌కు అదనంగా 2 జనరల్ కోచ్‌లు జత చేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.12704/12703 సికింద్రాబాద్- హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లకు మొత్తంగా 4 జనరల్ కోచ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 12704 ట్రైన్‌ను నవంబర్ 10 నుంచి, 12703 ట్రైన్‌ను నవంబర్ 12 నుంచి 2 అదనపు జనరల్ కోచ్‌లతో నడుపుతామన్నారు.

News July 13, 2024

జాతీయస్థాయిలో మండపేట విద్యార్థి ప్రతిభ

image

డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం ఆర్తమూరుకు చెందిన మాజీ ఆర్మీ ఉద్యోగి గుమ్మిడి అనిల్ కుమార్ తనయుడు గుమ్మడి ధీరజ్ జాతీయస్థాయి పరీక్షలో ఆల్‌ఇండియా ర్యాంక్ సాధించాడు. పదో తరగతి తర్వాత NTA శ్రేష్ట- 2024 పరీక్షలో ఆల్ ఇండియాలో 1330 ర్యాంక్ సాధించి, పఠాన్ కోట్‌లో సీటు పొందాడు. ఈ మేరకు విద్యార్థిని తల్లిదండ్రులు, గ్రామస్థులు అభినందించారు.

News July 13, 2024

తిరుపతి: 14న UPSC పరీక్ష

image

తిరుపతి జిల్లాలో ఈనెల 14న జరగనున్న యూపీఎస్సీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం.ఎస్ మురళి ఆదేశించారు. తిరుపతి కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. తిరుపతి జిల్లాలో 3 పరీక్ష కేంద్రాల్లో 1199 అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారని వివరించారు.

News July 12, 2024

విజయవాడ: TODAY HEADLINES

image

*YS జగన్‌పై కేసు నమోదు.!
*వల్లభనేని వంశీకి అరెస్ట్ గండం?
*గన్నవరం విమానాశ్రయాన్ని నం.1 చేస్తాం: ఎంపీ చిన్నీ
*ఉండవల్లిలో కాన్వాయ్ ఆపి వినతులు స్వీకరించిన చంద్రబాబు
*జాతీయ రహదారి నిర్మాణానికి కృషి చేస్తా: MP బాలశౌరి
* నందిగామ వద్ద రోడ్డు ప్రమాదం.. VRO మృతి
*చంద్రబాబు తన మార్క్ చూపించారు: దేవినేని ఉమా

News July 12, 2024

గుంటూరు: TODAY HEADLINES

image

* గుంటూరు: జగన్‌, సునీల్ కుమార్‌లపై కేసు.!
*చేబ్రోలులో ‘డార్లింగ్‌’ సినిమా యూనిట్‌ సందడి
*పిడుగురాళ్లలో కలవరపెడుతున్న డయేరియా.!
*గుంటూరులో తప్పిపోయిన బాలుడు సేఫ్
*బాపట్లలో కండక్టర్‌పై మహిళ దాడి
*నరసరావుపేట ఎంపీ లావుకు కీలక బాధ్యతలు
*సత్తెనపల్లి: సినీ ఫక్కీలో సెల్ ఫోన్ దొంగతనం
*తాడేపల్లి: ‘మాట నిలబెట్టుకున్న చంద్రబాబు’
*మరోసారి పిడుగురాళ్లకు మంత్రి నారాయణ

News July 12, 2024

శ్రీకాకుళం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✦ మూలపేట పోర్టు నిర్వాసితుల ఆందోళన ✦ ఆమదాలవలసలో ఇద్దరు బైక్ దొంగల అరెస్టు ✦ కారు ఆపి ఆమదాలవలస కార్యకర్తను పలకరించిన సీఎం ✦ జలుమూరులో బైక్‌ను ఢీకొన్న వ్యాన్ ✦ కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం పనులు అడ్డగింత ✦ మంత్రి అచ్చెన్నతో ఎచ్చెర్ల ఎమ్మెల్యే భేటీ ✦ వసుంధర లేఅవుట్లను సందర్శించిన సబ్ కలెక్టర్ నూరుల్ కమర్ ✦ పూండి రైల్వే స్టేషన్ వద్ద రైలు నుంచి జారిపడి యువకుడి మృతి

News July 12, 2024

ఇది ప్ర‌జా స్వామ్య‌మా.. రౌడీ రాజ్య‌మా?: పుష్ప శ్రీవాణి

image

కూట‌మి ప్ర‌భుత్వం వైసీపీ నాయ‌కుల దాడుల‌పై పెట్టినంత దృష్టి రాష్ట్ర ప్ర‌జ‌ల మాన‌, ప్రాణాల‌పై పెట్ట‌క‌పోవ‌డం సిగ్గుచేటు అని మాజీ మంత్రి పాముల పుష్పశ్రీవాణి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. నంద్యాల‌లో బాలిక‌పై ముగ్గురు మైన‌ర్ అబ్బాయిలు అత్యాచారం చేసి హ‌త్య చేస్తే కూటమి సర్కార్ స్పందించకపోవడం దారుణమని పేర్కొన్నారు. ఇది ప్ర‌జా స్వామ్య‌మా? రౌడీ రాజ్య‌మా? అంటూ వ్యాఖ్యానించారు.