Andhra Pradesh

News July 12, 2024

పల్నాడు ప్రథమ కలెక్టర్ జిల్లాకు రాక

image

పల్నాడు జిల్లా ప్రథమ కలెక్టర్‌గా పని చేసిన లోతేటి శివశంకర్ ఈనెల 13న నరసరావుపేట రానున్నారు. పల్నాడు జిల్లా ఏర్పడ్డాక ఆయనను ప్రభుత్వం ప్రథమ కలెక్టర్‌గా నియమించింది. ఈ సందర్భంగా ఆయన జిల్లాకు చేసిన సేవలకు గుర్తింపుగా “లోతేటి శివశంకర్ ఐఏఎస్”అనే పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. ముఖ్య అతిథులుగా కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎంపీ లావు, ఎమ్మెల్యే చదలవాడ, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొననున్నట్లు తెలిపారు.

News July 12, 2024

వైజాగ్ వారియర్స్ ఫైనల్‌కు చేరేనా?

image

విశాఖలో ఏపీ ప్రీమియర్ లీగ్ క్వాలిఫయర్-2 మ్యాచ్ వైజాగ్ వారియర్స్, రాయలసీమ మధ్య జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన వైజాగ్ వారియర్స్ 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 190 భారీ స్కోర్ చేసింది. ఛేజింగ్‌కు దిగిన రాయలసీమ కింగ్స్‌ 13 ఓవర్లకు 98 పరుగులు చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది. రాయలసీమ గెలవాలి అంటే 60 బంతుల్లో 115 రన్స్ చేయాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఉత్తరాంధ్ర లయన్స్‌తో ఫైనల్ ఆడనుంది.

News July 12, 2024

అమలాపురం: 10th అమ్మాయికి వేధింపులు.. వ్యక్తి అరెస్ట్

image

అమలాపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన 10వ తరగతి బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించి, వేధింపులకు గురిచేసిన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై కిషోర్ శుక్రవారం తెలిపారు. ఫిర్యాదు అందిన 36 గంటల్లో నిందితుడిని పట్టుకుని అమలాపురం కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించిందని తెలిపారు. అతడిని కొత్తపేట జైలుకి పంపామన్నారు.

News July 12, 2024

గూగుడు బ్రహ్మోత్సవాలకు 350మంది బందోబస్తు

image

గూగూడు బ్రహ్మోత్సవాలకు 350మందితో కేటాయించినట్లు సీఐ శ్రీధర్ తెలిపారు. నార్పల మండలం గూగుడు గ్రామంలో జరుగుతున్న శ్రీ కుళ్లాయిస్వామి బ్రహ్మోత్సవాలకు ఈనెల 13 నుంచి పోలీసులు విధుల్లో చేరుతున్నట్లు సీఐ శ్రీధర్ తెలిపారు. ఇందులో భాగంగా ఆరుగురు సీఐలు, 15మంది ఎస్‌ఐలు, ఏఎస్ఐలు 70 మంది, 100 మంది హోంగార్డులు, 130 మంది తదితర సిబ్బంది ఉంటారన్నారు. పోలీసుల నిఘా నీడలో ఉత్సవాలు జరుగుతాయన్నారు.

News July 12, 2024

VZM: జడ్పీ సమావేశానికి ఆ ఎమ్మెల్యేలు గైర్హాజరు

image

NDA కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన తొలి జిల్లా పరిషత్ సమావేశానికి ప్రజా ప్రతినిధులు గైర్హాజరయ్యారు. చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు, ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన, రాజాం ఎమ్మెల్యే కొండ్రు మురళీ మోహన్ ఈ సమావేశాలకు హాజరు కాలేదు.

News July 12, 2024

పెద్దిరెడ్డి తీరుపైనే అందరి విమర్శలు..!

image

మాజీ మంత్రి పెద్దిరెడ్డికి పుంగనూరులో వరుస షాక్‌లు తగులుతున్నాయి. పుంగనూరు మున్సిపల్ ఛైర్మన్ ఆలీం బాషా, కౌన్సిలర్లు టీడీపీ గూటికి చేరారు. తాజాగా పులిచెర్ల ZPTC మురళీధర్‌తో పాటు ఎంపీటీసీలు, సర్పంచ్‌లు YCPకి గుడ్ బై చెప్పేశారు. పుంగనూరు అభివృద్ధికి పెద్దిరెడ్డి ఫ్యామిలీ సహకరించ లేదని ఆలీం బాషా అప్పుడు చెప్పగా.. ఇవాళ మురళీధర్ కూడా పెద్దిరెడ్డి తమకు అండగా ఉండకపోవడంతో రాజీనామా చేశామని చెప్పారు.

News July 12, 2024

ప్రయాణికులకు శుభవార్త చెప్పిన రైల్వే అధికారులు

image

శ్రీకాకుళం రోడ్, పలాస మీదుగా ప్రయాణించే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌కు అదనంగా 2 జనరల్ కోచ్‌లు జత చేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.12704/12703 సికింద్రాబాద్- హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లకు మొత్తంగా 4 జనరల్ కోచ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 12704 ట్రైన్‌ను నవంబర్ 10 నుంచి, 12703 ట్రైన్‌ను నవంబర్ 12 నుంచి 2 అదనపు జనరల్ కోచ్‌లతో నడుపుతామన్నారు.

News July 12, 2024

నరసాపురం: యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

image

నరసాపురం మండలం కొప్పర్రులో శుక్రవారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల వివరాలు.. నరసాపురం పట్టణానికి చెందిన వీర వెంకట సూర్యనారాయణ మూర్తి (62) భీమవరంలో బ్యాంక్‌ పనిమీద బైక్‌పై బయలుదేరాడు. కొప్పర్రు గ్రామానికి చేరుకోగానే వెనక నుంచి వచ్చిన లారీ ఢీ కొంది. దీంతో సూర్యనారాయణ అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడి భార్య సుబ్బలక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదుచేసినట్లు రూరల్ SI గుర్రయ్య తెలిపారు.

News July 12, 2024

విశాఖ: ఎమ్మెల్యేను కలిసిన MSK.ప్రసాద్

image

విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబును తన కార్యాలయంలో ఇండియన్ క్రికెట్ టీమ్ మాజీ చీఫ్ సెలెక్టర్ MSK.ప్రసాద్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజల అభిమానంతో వరుసగా గెలుస్తూ వస్తున్న వెలగపూడిని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తను పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.

News July 12, 2024

పోలవరం: 7,080 క్యూసెక్కుల నీటి విడుదల

image

పోలవరం మండలం పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి 7,080 క్యూసెక్కుల గోదావరి వరద జలాలను పోలవరం ప్రాజెక్ట్ కుడి కాలువకు విడుదల చేసినట్లు పట్టిసీమ ఎత్తిపోతల పథకం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పెద్దిరాజు శుక్రవారం తెలిపారు. పట్టిసీమలో గోదావరి నీటిమట్టం 15.387 మీటర్లకు చేరుకుందని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 20 పంపులు, 20 మోటార్లతో నీటిని విడుదల చేశామని వివరించారు.