Andhra Pradesh

News July 12, 2024

కృష్ణా: డిగ్రీ 7వ సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని కళాశాలలలో బీఎస్సీ కెమిస్ట్రీ కోర్స్ చదువుతున్న విద్యార్థులు, రాయాల్సిన 7వ సెమిస్టర్ (Y20 బ్యాచ్) థియరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఆగస్టు 1, 2, 3, 5, 6 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. సబ్జెక్టువారీగా షెడ్యూల్ వివరాలకై విద్యార్థులు https://www.nagarjunauniversity.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవచ్చు.

News July 12, 2024

చంద్రబాబు పర్యటనకు పటిష్ఠ ఏర్పాట్లు

image

ఈనెల 13వ తేదీన తాడేపల్లి మండలం కొలనుకొండలోని హరే కృష్ణ గోకుల క్షేత్రంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాల్గొననున్నారు. దీంతో అక్కడ పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. శుక్రవారం ఎస్పీ తుషార్, సబ్ కలెక్టర్ ప్రకార్ జైన్‌లతో కలిసి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. గట్టి భద్రత ఏర్పాట్లతోపాటు వాహనాల పార్కింగ్, బారికేట్లు ఏర్పాటు చేయాలన్నారు.

News July 12, 2024

చీరాల: IIITలో టాప్ లేపిన ఈపూరుపాలెం గర్ల్స్ హైస్కూల్

image

చీరాల మండలం ఈపూరుపాలెం జిల్లా పరిషత్ గర్ల్స్ హైస్కూల్‌లో 10 మంది IIITలో సీట్లు సాధించారు. చీరాల డివిజన్‌లో అత్యధికంగా IIIT సీట్లు సాధించిన హైస్కూల్ ఇదే కావటం విశేషం. విద్యార్థులను శుక్రవారం స్కూల్లో జరిగిన సభలో హెచ్ఎం అనోరా, ఉపాధ్యాయ బృందం, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు అభినందించారు. ఇలాగే కష్టపడి స్కూల్‌కు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు హెచ్‌ఎం సూచించారు.

News July 12, 2024

మంగళగిరిలోని కొలనుకొండకు వెళ్లనున్న చంద్రబాబు

image

మంగళగిరిలోని కొలనుకొండకు సీఎం చంద్రబాబు శనివారం రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని చెప్పారు. అనంతరం పార్టీ నేతలు, కార్యకర్తలతో సీఎం సమీక్ష నిర్వహిస్తారని వివరించారు. శనివారం ఉదయం 9.30 గంటలకు మంగళగిరి చేరుకోనున్నారు. దీంతో పోలీసులు భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు.

News July 12, 2024

వరి రైతులతో ఏలూరు ఎంపీ సమావేశం

image

రాజమండ్రిలో అతిపెద్ద వరి ఫ్యాక్టరీ నిర్మిస్తున్నాం, నిత్యం 3,000 టన్నుల నుంచి 3,500 టన్నుల ధాన్యం అవసరమవుతుందని ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ అన్నారు. ఏలూరులో వరి రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వరి ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులకు వడ్డీలేని రుణాలు ఇస్తారని, తడిసిన ధాన్యాన్ని కూడా వారే కొంటారని తెలిపారు. వరి రైతులకు ఎటువంటి సమస్యలు వచ్చినా పరిష్కారించటానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు.

News July 12, 2024

జాతీయ యువజన సదస్సుకు 26 దేశాల ప్రతినిధులు

image

ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ప్రారంభమైన జాతీయా యువజన సదస్సుకు 26 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రశాంతి నిలయంలో 3 రోజుల పాటు జరిగే సదస్సుకు దాదాపు 2500మంది ప్రతినిధులు హాజరయ్యారు. వచ్చే ఏడాది సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు జరుగనున్న నేపథ్యంలో శుక్రవారం ప్రారంభమైన సదస్సు ద్వారా భక్తులకు పలు సూచనలు ఇవ్వనున్నారు.

News July 12, 2024

తెలంగాణ సీఈవోగా కర్నూలు మాజీ కలెక్టర్‌

image

ఉమ్మడి కర్నూలు జిల్లా మాజీ కలెక్టర్‌ సీ.సుదర్శన్ రెడ్డికి తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈఓ)గా ఆయన ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. కాగా 2012 నుంచి 2014 వరకు సుదర్శన్ రెడ్డి కర్నూలు జిల్లా కలెక్టర్‌గా సేవలందించారు. ఇప్పటివరకు TG సీఈఓగా ఉన్న వికాస్ రాజ్ కూడా గతంలో కర్నూలు జిల్లా కలెక్టర్‌గా పని చేశారు.

News July 12, 2024

ఏలూరు: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

image

ఏలూరు రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలోని తెలప్రోలు రైల్వేస్టేషన్ దాటిన తరువాత అస్సాం రాష్ట్రానికి చెందిన రెబ్బా అనే వ్యక్తి కదులుతున్న రైలులోంచి జారిపడి శుక్రవారం మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే SI నరసింహారావు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో డెడ్ బాడీని భద్రపరిచామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News July 12, 2024

ప్రకాశం: 361 మొబైల్ ఫోన్లను కనుగొన్నారు

image

జిల్లా ప్రజలు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల వివరాలను అందజేస్తే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వాటిని కనిపెడుతున్నామని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా దొంగిలించిన, పోగొట్టుకున్న 361 మొబైల్ ఫోన్లను సాంకేతిక పరిజ్ఞానంతో కనుగొన్నట్లు ఎస్పీ తెలిపారు.

News July 12, 2024

చిత్తూరు: ఫైరింగ్ ప్రాక్టీస్ తనిఖీ

image

గన్‌మెన్లకు జీడీ నెల్లూరు సమీపంలోని చిత్తూరు పోలీస్ డిపార్ట్మెంట్ ఫైరింగ్ రేంజ్‌లో ప్రాక్టీస్ ఇస్తున్నారు. సంబంధిత ఫైరింగ్ ప్రాక్టీసును ఎస్పీ మణికంఠ శుక్రవారం తనిఖీ చేశారు. వీఐపీల వద్ద విధులు నిర్వహిస్తున్నప్పుడు.. అత్యవసర సమయాల్లో ప్రాణ రక్షణకు సంసిద్ధులై ఉండాలని సూచించారు. అధికారుల సూచనల మేరకు ప్రాక్టీస్ పకడ్బందీగా చేయాలని ఆదేశించారు.