Andhra Pradesh

News July 12, 2024

పామాయిల్ బోర్డు ఏర్పాటుపై ఏలూరు MP హామీ

image

పొగాకు, కొబ్బరికి బోర్డులు ఉన్నట్లుగా, పామాయిల్ బోర్డు ఏర్పాటుకు కృషిచేస్తానని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ అన్నారు. శుక్రవారం ఏలూరులో వరి, పామాయిల్ రైతులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. పామాయిల్‌కు బేసిక్ ధరగా రూ.17,000 నిర్ణయించమని కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుదామన్నారు. ఆ ధర నుంచి ఏటా మరింత పెంచేలా ప్రయత్నిస్తానన్నారు.

News July 12, 2024

VZM: వరుణుడి కోసం అన్నదాతల ఎదురు చూపులు

image

విజయనగరం జిల్లా వ్యాప్తంగా వరుణుడి కరుణ కోసం అన్నదాతలు ఎదురు చూపులు చూస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రోజులు గడుస్తున్నప్పటికీ నియోజకవర్గంలో ఇప్పటి వరకు అశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. దీంతో సాగుకు సిద్దమైన అన్నదాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షం కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. తోటపల్లి కాలువల్లో నీరు లేకపోవడంతో అలంకారప్రాయంగా దర్శనమిస్తున్నాయి.

News July 12, 2024

శ్రీకాకుళంలో జాబ్ మేళా.. 31 మంది ఎంపిక

image

శ్రీకాకుళం నగరంలోని స్థానిక ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో జిల్లా ఉపాధి అధికారి సుధా ఆధ్వర్యంలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో ఓ ప్రైవేట్ కంపెనీ యాజమాన్యం ఇంటర్వ్యూ నిర్వహించగా.. నిరుద్యోగ యువత 170 మంది హాజరయ్యారు. ఇందులో 31 మందిని ఎంపిక చేసి ఉపాధి కల్పించినట్లు సుధా తెలిపారు.

News July 12, 2024

మంగళగిరిలోని కొలనుకొండకు వెళ్లనున్న చంద్రబాబు

image

మంగళగిరిలోని కొలనుకొండకు సీఎం చంద్రబాబు శనివారం రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని చెప్పారు. అనంతరం పార్టీ నేతలు, కార్యకర్తలతో సీఎం సమీక్ష నిర్వహిస్తారని వివరించారు. శనివారం ఉదయం 9.30 గంటలకు మంగళగిరి చేరుకోనున్నారు. దీంతో పోలీసులు భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు.

News July 12, 2024

రాయితీపై విక్రయాలు ప్రారంభించిన విశాఖ జేసీ

image

ఎంవీపి కాలనీలోని రైతుబజారులో తక్కువ ధరలకే కందిపప్పు, బియ్యం పంపిణీ కేంద్రాన్ని తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు, జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ ప్రారంభించారు. బియ్యం కిలో రూ.48, కిలో కందిపప్పు రూ.160 రాయితీపై రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. ధరల పెరుగుదల నియంత్రించడంతోపాటు, ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ చర్యలు చేపట్టింది.

News July 12, 2024

జాతీయ యువజన సదస్సుకు 26 దేశాల ప్రతినిధులు

image

ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ప్రారంభమైన జాతీయా యువజన సదస్సుకు 26 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రశాంతి నిలయంలో 3 రోజుల పాటు జరిగే సదస్సుకు దాదాపు 2500మంది ప్రతినిధులు హాజరయ్యారు. వచ్చే ఏడాది సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు జరుగనున్న నేపథ్యంలో శుక్రవారం ప్రారంభమైన సదస్సు ద్వారా భక్తులకు పలు సూచనలు ఇవ్వనున్నారు.

News July 12, 2024

తిరుపతిలో 15న ఇంటర్వ్యూలు

image

ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన సంస్థలో (RARS) కాంట్రాక్ట్ ప్రాతిపదికగా అగ్రోమెట్ అబ్జర్వర్ (Agromet Observer)-1 పోస్ట్‌కు 15న ఉదయం 10 గంటలకు వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. సైన్స్ విభాగంలో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులన్నారు. పూర్తి వివరాలకు https://angrau.ac.in/ వెబ్‌సైట్‌ను చూడగలరు.

News July 12, 2024

పులివెందుల ఎన్నికలపై బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు

image

పులివెందులలో జరిగిన సార్వత్రిక ఎన్నికలపై బీటెక్ రవి ఓ ఛానల్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘జగన్ TDP ఏజెంట్లతో MLA ఓట్లు TDPకి వేసి, MP ఓట్లు తాము వేసుకుంటామని అన్నారు. అలా 30-40 బూత్‌ల నుంచి తనకు ఫోన్లు చేయించారన్నారు. అందుకు TDP ఏజెంట్లు తనను సరే అనమన్నారని .. తాను కుదరని ఎంపీగా భూపేశ్ రెడ్డిని అభ్యర్థిగా నిలబెట్టామని, పార్టీకి చెడ్డ పేరు వస్తుంది అలా చేయకండి’ అని తాను అప్పుడే చెప్పానని అన్నారు.

News July 12, 2024

జనసేన పార్టీ నాయకులు వర్గ విభేదాలు వీడండి: లక్ష్మన్న

image

జనసేన నాయకులు వర్గ విభేదాలు వీడాలని జనసేన పార్టీ మంత్రాలయం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ లక్ష్మన్న కోరారు. మంత్రాలయంలోని పార్టీ కార్యాలయంలో నాలుగు మండలాల కార్యకర్తల సమావేశం శుక్రవారం నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు వర్గ విభేదాలు వీడి కలిసికట్టుగా పార్టీ అభ్యున్నతి కోసం పోరాడుదామని పిలుపునిచ్చారు. అధిష్ఠానం మేరకే 4 మండలాల అధ్యక్షులను నియమించామని పేర్కొన్నారు.

News July 12, 2024

VZM: అక్కడలా..? ఇక్కడిలా..? ఎందుకలా?

image

జొన్నాడ టోల్‌గేట్ ఎత్తివేయాలని గత కొద్ది రోజులుగా జిల్లాలో నిరసనలు చేస్తున్న సంగతి తెలిసందే. ఈ తరుణంలో అగనంపూడి టోల్‌గేట్ ఎత్తేసిన విషయాన్ని ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అక్కడ టోల్‌గేట్ ఎత్తేశారు. జొన్నాడ టోల్‌గేట్ వలన ఇటీవల ఆర్టీసీ కూడా టికెట్ రేట్లు పెంచడంతో ప్రజలు పెదవి విరుస్తున్నారు. జిల్లా ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.