Andhra Pradesh

News July 12, 2024

రొట్టెల పండగకు సర్వం సిద్ధం: ఎమ్మెల్యే కోటంరెడ్డి

image

నెల్లూరులో 17నుంచి ఐదు రోజులపాటు జరిగే బారాషాహీద్ రొట్టెల పండుగకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. పండుగకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలని అన్ని శాఖల అధికారులను ఆయన ఆదేశించారు. ముస్లిం మత పెద్దలు, కమిటీ సభ్యుల సూచనలతో కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

News July 12, 2024

గెలిస్తే ఫైనల్‌కు..

image

APL-2024 తుది అంకానికి చేరుకుంది. ఇవాళ జరగనున్న క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో వైజాగ్ వారియర్స్, రాయలసీమ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ సీజన్‌లో ఇరుజట్లు సమష్టిగా రాణిస్తుండటంతో పోరు ఉత్కంఠభరితంగా సాగే ఛాన్సుంది. గెలిచిన జట్టు ఫైనల్లో ఉత్తరాంధ్ర లయన్స్‌తో తలపడుతుంది. రేపు జరిగే ఫైనల్‌తో ఏపీఎల్ విజేత ఎవరో తేలిపోనుంది. రాయలసీమ కింగ్స్ జట్టులో అనంతపురం కుర్రాడు ప్రశాంత్ కీలక ప్లేయర్‌గా ఉన్నారు.

News July 12, 2024

జగన్, సునీల్ కుమార్‌లపై కేసు నమోదు.. సెక్షన్లు ఇవే

image

మాజీ సీఎం <<13613892>>జగన్<<>>, సీఐడీ మాజీ డీజీ సునీల్ కుమార్‌తో పాటు మరొక ముగ్గురిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. IPC సెక్షన్ 120B, 166, 167, 197, 307, 326, 465, 506(34) ప్రకారం టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు ఫిర్యాదుతో గుంటూరు నగరంపాలెం పీఎస్‍‌లో కేసు నమోదైంది. ఈ మేరకు అధికారులు విచారణ చేపట్టారు.

News July 12, 2024

చీరాల మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు

image

మూడో రైల్వేలైను నిర్మాణంలో భాగంగా విజయవాడ-గూడూరు సెక్షన్ లో నాన్ ఇంటర్ లాకింగ్ పనుల దృష్ట్యా చీరాల మీదుగా వెళ్లే పలు రైళ్లను ఈనెల 15వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రద్దు చేయడంతో పాటు దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. గూడూరు-విజయవాడ మధ్య మెమో రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. చార్మినార్, కృష్ణా తదితర ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆలస్యంగా నడుస్తాయని, పూర్తి వివరాలను రైల్వేస్టేషన్లో తెలుసుకోవాలన్నారు.

News July 12, 2024

కాకినాడ: రాయితీపై కందిపుప్పు, బియ్యం సరఫరా

image

కాకినాడ గాంధీనగర్ రైతు బజార్లో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రాయితీపై కంది పప్పు, బియ్యం విక్రయాలను ఎమ్మెల్యే కొండబాబు ప్రారంభించారు.వైసిపి పాలనలో అడ్డూ అదుపు లేకుండా పెరిగిన ధరలు తగ్గించి పేదలకు సాధ్యమైనంత ఊరట కల్పించాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమన్నారు. కార్యక్రమంలో ఎంఎస్ ఓ ప్రసాద్ పాల్గొన్నారు.

News July 12, 2024

అనంత్ అంబానీ పెళ్లికి మంత్రి నారా లోకేశ్

image

ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ- రాధిక వివాహ వేడుకకు మంత్రి నారా లోకేశ్ హాజరు కానున్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లనున్నట్లు మంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ పెళ్లి వేడుకకు పలు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానం అందిన విషయం తెలిసిందే.

News July 12, 2024

VZM: ఒకే పాఠశాలకు 11 ట్రిపుల్ ఐటీ సీట్లు

image

IIITలో కొత్తవలస మండలం అర్ధాన్నపాలెం ఏపీ మోడల్ స్కూల్‌కు చెందిన 11 విద్యార్థులు సీట్లు సాధించినట్లు ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ శ్రీనివాసరావు తెలిపారు. ఎం.హేమ వర్షిణి, డి.శ్రావ్య, టి.జగదీశ్, పి.మేఘన, కే.సాహిత, ఎస్.శిరీష, జె.గీతాశ్రీ, షేక్ సమీర నూజివీడులో..డి.అశ్విని, ఎం.లిఖిత, జి.హర్షవర్ధన్‌కు శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో సీట్లు వచ్చాయన్నారు. విద్యార్థులను పాఠశాల సిబ్బందితో పాటు గ్రామస్థులు అభినందించారు.

News July 12, 2024

రేపు తోటపల్లి పాత ఆయకట్టు నీటి విడుదల

image

శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోని 64 వేల ఎకరాల పాత ఆయకట్టును సస్యశ్యామలం చేస్తున్న తోటపల్లి ప్రాజెక్టు ద్వారా ఈనెల 13న సాగునీరు విడుదల చేయనున్నట్లు జలవనరులశాఖ ఏఈ రాజేశ్ శుక్రవారం తెలిపారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో వీరఘట్టం, పాలకొండ, బూర్జ, జియ్యమ్మవలస, గరుగుబిల్లి, వంగర మండలాలకు సాగునీటిని ప్రణాళికాబద్ధంగా అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

News July 12, 2024

నంద్యాల-ఆళ్లగడ్డ జాతీయ రహదారిపై భారీ కంటైనర్ బోల్తా

image

నంద్యాల-ఆళ్లగడ్డ జాతీయ రహదారిపై ఎర్రగుంట్ల సమీపంలో గురువారం తెల్లవారుజామున భారీ కంటైనర్ బోల్తా పడింది. కడప వైపు వెళ్తుండగా ఎర్రగుంట్ల వద్దకు రాగానే అదుపు తప్పి రహదారిపై పడింది. ఆ సమయంలో రహదారిపై ఎలాంటి వాహనాలు రాకపోవడంతో ప్రమాదం తప్పింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

News July 12, 2024

ప.గో జిల్లాలో 2.42 లక్షల మందికి లబ్ధి

image

తల్లికి వందనం పథకం కింద టీడీపీ ప్రభుత్వం ఏడాదికి రూ.15 వేలు చొప్పుల తల్లుల ఖాతాలో జమచేయనుంది. దారిద్ర్య రేఖ దిగువన ఉండి, 1 నుంచి 12 తరగతి చదువుతున్న వారికి ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం ద్వారా పశ్చిమ గోదావరి జిల్లాలో 2.42లక్షల మందికి ఈ సొమ్ము అందనున్నట్లు డిఈవో జి.నాగమణి తెలిపారు.