Andhra Pradesh

News July 12, 2024

పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్న చంద్రబాబు: గుడివాడ

image

పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గతంలో చెప్పినట్లు పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ‌ చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును చేపట్టినట్లు ‌ విమర్శించారు. విశాఖ ప్రెస్ క్లబ్‌లో శుక్రవారం ఆయన మాట్లాడారు. వైసీపీకి 40 శాతం ఓటు బ్యాంకు ఉందన్నారు. ప్రజల తరఫున తాము పోరాటం చేస్తామన్నారు.

News July 12, 2024

శ్రీకాకుళం: రైలు నుంచి జారిపడి యువకుడి మృతి

image

శ్రీకాకుళం జిల్లా పూండి రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం ఉదయం గుర్తుతెలియని రైలు నుంచి జారిపడి ఓ యువకుడు మృతిచెందాడు. మృతదేహాన్ని రైలు పట్టాలపై గుర్తించిన స్థానికులు పలాస జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై షరీఫ్ మృతదేహాన్ని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News July 12, 2024

పులివెందుల: మద్యం మత్తులో నిప్పు అంటించుకుని మృతి

image

పులివెందుల పరిధిలోని బొగ్గుడిపల్లెలో గురువారం రాత్రి కారులో నిప్పు అంటించుకుని ప్రభాకర్ రెడ్డి (80) అనే వృద్ధుడు మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. బోగుడిపల్లి గ్రామానికి చెందిన ప్రభాకర్ రెడ్డికి గత కొద్దిరోజులుగా మతి స్థిమితం సరిగ్గా లేదు. గురువారం రాత్రి మద్యం మత్తులో కారులోకి వెళ్లి తనపై పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకుని మృతి చెందాడని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 12, 2024

విజయవాడ-బెంగుళూరు మధ్య మరో విమాన సర్వీస్

image

విజయవాడ, బెంగుళూరు మధ్య సెప్టెంబర్ 1 నుంచి నూతనంగా విమాన సర్వీస్ నడపనున్నట్లు ఎయిర్ ఇండియా సంస్థ తెలిపింది. బెంగుళూరులో సాయంత్రం 4.05 గంటలకు బయలుదేరి 5.40 గంటలకు విజయవాడ చేరుకుంటుందని, విజయవాడలో సాయంత్రం 6.10 గంటలకు బయలుదేరి రాత్రి 7.50 గంటలకు బెంగుళూరు చేరుకుంటుందని ఓ ప్రకటనలో పేర్కొంది.

News July 12, 2024

ఆశపడి ₹24 లక్షలు మోసపోయిన అనంతపురం జిల్లా యువకుడు

image

అనంతపురం జిల్లా గోరంట్లకు చెందిన షబ్బీర్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆన్లైన్ ట్రేడింగ్‌లో రూ.24.40 లక్షలు మోసపోయారు. బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న అతడికి ఆన్లైన్ ట్రేడింగ్‌లో గుర్తు తెలియని వ్యక్తి పరిచయమయ్యారు. డబ్బు ఆశ చూపడంతో షబ్బీర్ భారీగా పెట్టుబడి పెట్టారు. తర్వాత మోసానికి గురయ్యానని తెలుసుకున్న అతడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్లు సీఐ సుబ్బారాయుడు తెలిపారు.

News July 12, 2024

విశాఖ: పవన్ కళ్యాణ్‌కు విశ్రాంత ఐఏఎస్ లేఖ

image

విశాఖ ముడసర్లోవ పార్కులో నిర్మాణాలు చేపట్టడం పర్యావరణానికి హానికరమని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు లేఖ రాశారు. రిజర్వాయర్ ‌కు ఆనుకుని ఉన్న పార్కు ప్రదేశంలో 105 రకాల పక్షులను శాస్త్రవేత్తలు గుర్తించారని పేర్కొన్నారు. అలాంటి ప్రాంతంలో జీవీఎంసీ భవనాల నిర్మాణానికి 228 చెట్లను తరలించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. కట్టడాలు నిర్మించడం చట్ట విరుద్ధం అన్నారు.

News July 12, 2024

చిత్తూరు: ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌‌కు దరఖాస్తులు

image

అగ్నివీర్ పథకంలో భాగంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలకు జిల్లాలో ఆసక్తిగల యువత ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారిణి పద్మజ తెలిపారు. పూర్తి వివరాలకు https://agnipathvayyu.cdac.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఆమె కోరారు. నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News July 12, 2024

తూ.గో జిల్లాలో పిడుగులు పడే ఛాన్స్

image

తూర్పుగోదావరి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం పిడుగులు పడే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రాజమండ్రి రూరల్, అనపర్తి ,కోనసీమ, సామర్లకోట,ఏజెన్సీ తదితర ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందన్నారు. పనుల కోసం అడవులలోకి వెళ్లకపోవడమే మంచిదని సూచించారు.

News July 12, 2024

కర్నూలు: ఉద్యోగ మేళాలో 37 మంది ఎంపిక

image

నిరుద్యోగ యువత ప్రైవేట్ రంగంలో అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కర్నూలు జిల్లా ఉపాధి కల్పనాధికారిణి దీప్తి పేర్కొన్నారు. గురువారం ఉపాధి కల్పనా కార్యాలయంలో ఉద్యోగ మేళా నిర్వహించారు. అనంత ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీరామ్ చిట్స్, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. మేళాకు 74 మంది హాజరు కాగా.. అందులో 37 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని తెలిపారు.

News July 12, 2024

స్నేహితులే హంతకులు: నెల్లూరు DSP

image

కోవూరు రాళ్లమిట్టలో ఈ నెల 9న యువకుడి హత్య జరిగిన విషయం తెలిసిందే. ఘటనపై వివరాలను గురువారం డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి వెల్లడించారు. బాధితుడు నాగరాజు అతడి స్నేహితులు ఓ పందిని దొంగిలించిన ఘటనలో యజమాని రామకృష్ణతో గొడవడ్డారు. ఈ గొడవలో అనూహ్యంగా మరో స్నేహితుడు నాగరాజును పొడవడంతో అతడు చనిపోయాడు. ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేయగా.. మరికొందరు పరారీలో ఉన్నారని త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు.