Andhra Pradesh

News July 12, 2024

కొత్తపేట: బాలికపై ఆగంతకుడు అత్యాచారయత్నం

image

బాలికపై గుర్తుతెలియని వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన కొత్తపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. విద్యార్థిని బుధవారం స్నేహితురాలితో మరుగుదొడ్డికి వెళ్ళింది. బాత్‌రూమ్‌లో నక్కిన ఆగంతకుడు కత్తితో బెదిరించి అఘాయిత్యానికి ప్రయత్నించాడు. బాలిక కేకలు వేయడంతో స్థానికులు రక్షించారు.దీనిపై గురువారం కొత్తపేట ఎస్సై అశోక్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

News July 12, 2024

విజయవాడలో వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళ అరెస్ట్

image

గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళను పెనమలూరు పోలీసులు అరెస్ట్ చేశారు. యనమలకుదురుకు చెందిన మస్తాన్ బీ (44) పున్నమ్మ తోటలో ఒక నివాసాన్ని అద్దెకు తీసుకుని ఇతర ప్రాంతాల నుంచి మహిళలను రప్పించి వ్యభిచార కార్యకలాపాలను నిర్వహిస్తోంది. పోలీసులకు వచ్చిన సమాచారంతో బుధవారం రాత్రి దాడి చేసి మస్తాన్ బీని మరో యువకుడిని అరెస్టు చేశారు. మరో యువతిని హోంకు తరలించారు.

News July 12, 2024

1912 నెంబర్‌కు ఫిర్యాదు చేస్తే సకాలంలో పరిష్కారం: సీఎండీ

image

విద్యుత్ సరఫరాలో వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ తెలిపారు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల ఇంజనీర్లతో విశాఖ నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అంతరాయాల నివారణకు పలు సూచనలు చేశారు. విద్యుత్ సమస్యలను 1912 నెంబర్‌కు ఫిర్యాదు చేస్తే సకాలంలో పరిష్కరిస్తామన్నారు.

News July 12, 2024

అనంత: భార్య హత్య కేసులో భర్త అరెస్టు

image

అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ఇల్లూరులో భార్య <<13605497>>హత్య<<>> కేసులో భర్త ఎర్రిస్వామిని గురువారం అరెస్టు చేసినట్లు ఎస్సై గౌస్ బాషా తెలిపారు. మృతురాలు సువర్ణ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన విషయం విదితమే. ఇల్లూరు గ్రామం వద్ద సీఐ శ్రీధర్ ఆధ్వర్యంలో ఎర్రిస్వామిని అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు తెలిపారు.

News July 12, 2024

నందికొట్కూరు నియోజకవర్గంలో నేడు విద్యాసంస్థల బంద్

image

పగిడ్యాల మండలంలో బాలిక హత్యాచార ఘటనకు నిరసనగా ఈరోజు నందికొట్కూరు నియోజకవర్గంలో విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ బంద్‌కు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు సహకరించాలని కోరారు. బాలిక కుటుంబానికి న్యాయం జరగడానికి ప్రతి ఒక్కరూ బంద్‌కు కలిసి రావాలని అన్నారు.

News July 12, 2024

విజయనగరం-రాయగడ సెక్షన్‌లో DRM తనిఖీలు

image

డివిజనల్‌ రైల్వే మేనేజర్ సౌరభ్ ప్రసాద్ వాల్తేర్ డివిజన్‌లోని విజయనగరం-రాయగడ రైల్వే సెక్షన్‌లో గురువారం తనిఖీలు నిర్వహించారు. ఆ సెక్షన్‌లో ప్రస్తుతం జరుగుతున్న మూడో లైన్‌ పనుల పురోగతి, స్టేషన్ల పునరాభివృద్ధి కార్యక్రమాలు, ప్రయాణికుల సౌకర్యాల మెరుగుదలలపై సమీక్ష జరిపారు. అనంతరం విజయనగరం నుంచి రాయగడ వరకు విండో-ట్రైలింగ్‌ తనిఖీని నిర్వహించారు.

News July 12, 2024

కందిపప్పు రాయితీ విక్రయ కేంద్రాన్ని పరిశీలించిన డీఎస్ఓ

image

ప్రభుత్వం నిరుపేదలకు నిత్యవసర సరుకులను తక్కువ ధరలకు అందించే విధంగా చర్యలు చేపట్టిందని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శాంతి శ్రీ తెలిపారు. గురువారం నరసన్నపేట మండల కేంద్రంలోని బజారు వీధిలో ప్రారంభించిన కందిపప్పు రాయితీ విక్రయ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. కందిపప్పు బయట దుకాణాలలో రూ.190 వరకు అమ్మకాలు జరుపుతున్నారని, అయితే ఈ విక్రయ కేంద్రాలలో రూ.160కే అందిస్తున్నామన్నారు.

News July 12, 2024

VZM: మరో ఆరునెలల్లో రిటైర్మెంట్.. అంతలోనే..

image

లద్దాక్‌లో ఆక్సిజన్‌ సిలిండర్‌ పేలిన ఘటనలో మృతి చెందిన బొత్సవానివలసకు చెందిన జవాన్‌ <<13611983>>గొట్టాపు శంకర్రావు<<>>(41) మరో ఆరు నెలల్లో రిటైర్ కాబోతున్నారు. 2003లో ఆర్మీలో చేరిన ఆయన మెకానిక్‌గా పనిచేస్తున్నారు. శంకర్రావుకు భార్య, తొమ్మిదేళ్ల పాప, ఏడేళ్ల బాబు ఉన్నారు. ఫిబ్రవరిలో ఇంటికి వచ్చి సరదాగా గడిపారని అతని తల్లిదండ్రులు, బంధువులు రోదిస్తున్నారు. మృతదేహాన్ని హెలికాప్టర్‌లో స్వగ్రామానికి తీసుకురానున్నారు.

News July 12, 2024

విశాఖ రేంజ్ డీఐజీగా గోపీనాథ్ జట్టి

image

విశాఖ రేంజ్ డీఐజీగా గోపీనాథ్ జట్టి నియమితులయ్యారు. విశాఖ రేంజ్ పరిధిలో చింతపల్లి సబ్ డివిజన్ ఏఎస్పీగా పనిచేశారు. 2015లో తిరుపతి అర్బన్ ఎస్పీగా, అనంతరం కర్నూల్ ఎస్పీగా 2018 వరకు పనిచేశారు. అనంతరం తిరుపతి చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారిగా ఐదేళ్ల పాటు పనిచేశారు. 2022 వరకు చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారిగా పనిచేసిన ఆయన ప్రస్తుతం డీఐజీగా పదోన్నతి పొందారు.

News July 12, 2024

గుంటూరు మిర్చి యార్డులో 27,246 బస్తాల మిర్చి విక్రయం

image

గుంటూరు మార్కెట్ యార్డుకు గురువారం 26,349 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ-నామ్ విధానం ద్వారా 27,246 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334. సూపర్ 5, 273, 341, 4884, ఆర్-10 రకాల మిర్చి సగటు ధర రూ.8,000 నుంచి రూ.17,500 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల మిర్చి సగటు ధర రూ.7,500 నుంచి రూ.18,500 వరకు లభించింది.