Andhra Pradesh

News July 12, 2024

మూడో స్థానంలో నెల్లూరు..

image

ఆరోగ్య శ్రీ సేవల్లో నెల్లూరు మూడో స్థానంలో ఉన్నట్లు జిల్లా సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్. బి నాయక్ తెలిపారు. గతంలో పదో స్థానంలో ఉన్న జిల్లా ఏడు స్థానాలు మెురుగుపర్చుకున్నట్లు ఆయన తెలిపారు. పీజీ సీట్ల రాకతో ఈ ఘనత సాధ్యమైపట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం రోజుకు 1238 ఓపీలు వస్తున్నాయని, 626 మంది ఇన్ పేషంట్లుగా ఉన్నట్లు ఆయన తెలిపారు.

News July 12, 2024

చీరాల: ప్రేమ పేరుతో వేధింపులు.. నిందితుడికి రిమాండ్

image

చీరాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను ఈశ్వర్ అనే యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడంటూ బంధువులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, గురువారం అరెస్టు చేసినట్లు ఈపూరుపాలెం పోలీసులు తెలిపారు. నిందితుడిని న్యాయస్థానంలో హాజరు పర్చగా.. రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు.

News July 12, 2024

వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తారా?

image

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచడం, ఇప్పటికే పలువురు అరెస్ట్ కావడంతో చర్చ జరుగుతోంది. ఈ కేసులో వంశీని 71వ నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు ఎన్నికల తర్వాత వంశీ నియోజకవర్గానికి రాలేదు. అప్పటి నుంచి ఎక్కడున్నారనే సమాచారం లేదు.

News July 12, 2024

కడప: కానిస్టేబుల్‌ను రక్షించిన అగ్నిమాపక దళం

image

కడప నగరంలోని ప్రకాశ్ నగర్‌కు చెందిన కాసుల మనీశ్ అనే కానిస్టేబుల్ గురువారం రాత్రి నగరంలోని ఆర్ట్స్ కళాశాల పక్కనున్న బీసీ హాస్టల్ వెనుక బావి వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. గమనించిన స్థానికులు అగ్నిమాపక శాఖ వారికి సమాచారం ఇచ్చారు. దీంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని తాళ్ల సహాయంతో బావిలోకి దిగి గాయపడిన మనీశ్ ‌ను సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

News July 12, 2024

VZM: ఆక్సిజన్ సిలిండర్ పేలి ఆర్మీ జవాన్ మృతి

image

బాడంగి మండలంలోని బొత్సవానివలసలో విషాదఛాయలు అలముకున్నాయి. జమ్మూ కాశ్మీర్‌లోని లద్దాఖ్ వద్ద ఆక్సిజన్ సిలిండర్ పేలిన సంఘటనలో ఇద్దరు ఆర్మీ జవాన్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. మృతి చెందిన వారిలో బాడంగి మండలం బొత్సవానివలసకి చెందిన గొట్టాపు శంకరరావు ఉన్నారు. శంకరరావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన మృతితో విషాదం నెలకొంది.

News July 12, 2024

ఉచిత ఇసుక విధానాన్ని పారదర్శకంగా అమలు చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో ఉచిత ఇసుక విధానాన్ని పారదర్శకంగా అమలు చేయాలని కలెక్టర్ శ్రీధర్ చామకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. రాయచోటి కలెక్టరేట్లోని తన చాంబర్లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సభ్యులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎన్ని ఇసుక స్టాక్ పాయింట్లు ఉన్నాయి, ఎంత ఇసుక లభ్యత ఉంది, నూతన ఇసుక విధానం ఏమిటి, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఎటువంటి చర్యలు తీసుకున్నారని అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

News July 12, 2024

పెద్దాపురం మరిడమ్మ తల్లి బ్రేక్ దర్శనాలు రద్దు

image

పెద్దాపురం మరిడమ్మ తల్లి ఆలయంలో శుక్రవారం అమ్మవారి దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ఈవో రామ్మోహన్ రావు, ధర్మకర్త బ్రహ్మాజీ తెలిపారు. గురువారం రాత్రి అమ్మవారికి మహా కుంభం నిర్వహించినందున శుక్రవారం ఆలయాన్ని మూసివేస్తున్నట్లు తెలిపారు. శనివారం మహా సంప్రోక్షణ అనంతరం మరిడమ్మ తల్లి దర్శనాలు యధావిధిగా కొనసాగుతాయని రామ్మోహన్‌రావు తెలిపారు.

News July 12, 2024

కృష్ణా: భగవద్గీతపై MA కోర్సు ఆఫర్ చేస్తున్న ఇగ్నో

image

ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) రెండేళ్ల కాలవ్యవధితో హిందీ మాధ్యమంలో ఓపెన్/డిస్టెన్స్ విధానంలో భగవద్గీతపై MA కోర్సు అందిస్తోంది. డిగ్రీ పూర్తి చేసినవారు ఈ కోర్స్ చేసేందుకు అర్హులు కాగా.. రెండేళ్లకు ఫీజు రూ.12,600. కోర్స్ అడ్మిషన్, పూర్తి వివరాలకు విజయవాడలోని ఇగ్నో స్టడీ సెంటర్‌లో సంప్రదించవచ్చు లేదా https://ignouadmission.samarth.edu.in/ అధికారిక వెబ్‌సైట్ చూడవచ్చు.

News July 12, 2024

మదనపల్లె యువతికి 37వ ర్యాంకు

image

సీఏ ఫైనల్స్ ఫలితాల్లో మదనపల్లెకు చెందిన వై.హర్షిత రెడ్డి సత్తా చాటింది. ఆల్ ఇండియా స్థాయిలో 37వ ర్యాంకు సాధించింది. పట్టణంలోని ఎస్బీఐ కాలనీకి చెందిన ఆర్టీసీ కండక్టర్ సోమశేఖర్, నందిని దంపతుల కుమార్తె హర్షిత రెడ్డి. సీఏ ఫైనల్స్‌లో రెండు గ్రూపులకు కలిపి 428/700 మార్కులు సాధించింది.

News July 12, 2024

కృష్ణా: ‘100 పాఠశాలల్లో కిచెన్ గార్డెన్‌లు’

image

కృష్ణా జిల్లాలో ఎంపిక చేసిన 100 పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా పోషకాహార పెరటి తోటలను (కిచెన్ గార్డెన్స్) పెంచాలని కలెక్టర్ డీకే బాలాజీ విద్యాధికారులను ఆదేశించారు. కిచెన్ గార్డెన్స్ ఏర్పాటుపై మచిలీపట్నంలోని సన్‌స్టార్ హైస్కూల్‌లో, కలెక్టర్ అధ్యక్షతన గురువారం ప్రధానోపాధ్యాయుల సమావేశం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయం ద్వారా పోషకాహార పెరటి తోటల పెంపక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.