Andhra Pradesh

News July 12, 2024

కడప, కర్నూల్ డీఐజీగా కోయ ప్రవీణ్ నియామకం

image

కడప, కర్నూలు జిల్లా రేంజ్ డీఐజీగా కోయ ప్రవీణ్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పూర్వపు డీఐజీ సీహెచ్ విజయ్ రావును రాష్ట్ర పోలీస్ కార్యాలయంలో రిపోర్ట్ చేసుకోవాలని ఆదేశించారు. గత ఏడాది కర్నూలు రేంజ్ డీఐజీగా విజయరావు బాధ్యతలను స్వీకరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కర్నూలు రేంజి డీఐజీగా కోయ ప్రవీణ్‌ను నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

News July 12, 2024

ఉపాధి పనులు కల్పించడంలో కర్నూలు జిల్లా వెనుకబడి ఉంది:కలెక్టర్

image

ఉపాధి పనులు కల్పించడంలో కర్నూలు జిల్లా వెనుకబడి ఉందని కర్నూలు కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు. అర్హులైన పేదలందరికీ పనులు కల్పించాలని డ్వామా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్మెంట్, ఉపాధి హామీ పథకం అమలుపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

News July 12, 2024

నాణ్యమైన విద్య..మన అందరి నినాదం కావాలి: అనంత కలెక్టర్

image

నాణ్యమైన విద్య..మన అందరి నినాదం కావాలని అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఎంఈఓలకు సూచించారు. అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో గురువారం విద్యాశాఖ పరిధిలోని ‘నేను బడికి పోతా’, అకడమిక్ మానిటరింగ్ వింగ్, సివిల్, ఇంజనీరింగ్ పనులు, మధ్యాహ్న భోజనం, నాడు- నేడు, అదనపు తరగతి గదులు, తదితర అంశాలపై సమావేశం నిర్వహించారు.

News July 12, 2024

సాగుకు అవసరమైన ఇన్‌పుట్స్‌ను సిద్ధంగా ఉంచుకోవాలి: కలెక్టర్

image

సాగుకు అవసరమైన ఇన్‌పుట్స్‌ను ముందుగానే సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. గురువారం వ్యవసాయ అనుబంధ శాఖల ఉన్నతాధికారులతో ప్రకాశం భవనంలో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని సాగు వివరాలు, అందుబాటులో ఉన్న నీటి వనరులు, సాగు పద్ధతులు, ప్రభుత్వం నుంచి అందిస్తున్న ఇన్‌పుట్స్‌ను సరఫరా, దిగుబడి లక్ష్యాలు, ప్రభుత్వ పథకాలు రైతులకు అందుతున్న తీరుపై కలెక్టర్ ఆరా తీశారు.

News July 12, 2024

శ్రీకాకుళం ఐఐఐటీ ప్రాంగణానికి 1,110 మంది ఎంపిక

image

శ్రీకాకుళం ఐఐఐటీ ప్రాంగణానికి సంబంధించి 1,110 మంది ఎంపికైనట్లు డైరెక్టర్ ప్రొ. బాలాజీ, పరిపాలనా అదికారి. ముని రామకృష్ణ తెలిపారు. వీరిలో 685 మంది అమ్మాయిలు, 325 మంది అబ్బాయిలు, ప్రత్యేక కేటగిరీ కింద 100 మంది విద్యార్థులు ఎంపికైనట్లు వారు తెలిపారు. విద్యార్థులు కౌన్సలింగ్‌కు హాజరు కావాలన్నారు.

News July 12, 2024

విశాఖ: ‘నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి’

image

విశాఖ నగర పరిధిలో చేపట్టిన వివిధ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విశాఖ పర్యటనలో భాగంగా ఆయన గురువారం సాయంత్రం ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నిర్మాణ దశలో ఉన్న పనుల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, విశాఖ ఎంపీ శ్రీభరత్ తదితరులు పాల్గొన్నారు.

News July 12, 2024

నూజివీడు: త్రిపుల్ ఐటీ సీట్ల సాధనలో బాలికలదే పై చేయి

image

రాష్ట్రంలోని 4 ట్రిపుల్ ఐటీలకు సంబంధించి విడుదల చేసిన అభ్యర్థుల ఎంపిక జాబితాలో బాలికలు పైచేయి సాధించారు. మొత్తం 4,040 సీట్లకు అభ్యర్థుల జాబితా విడుదల చేయగా అందులో 2,713 మంది బాలికలు, 1,327 మంది బాలురు ఉన్నారు. సీట్లు సాధించిన బాలికల శాతం 67.15 కాగా, బాలురు శాతం 32.85 మాత్రమే. అలాగే ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 3,757 మందికి సీట్లు రాగా, ప్రైవేటు పాఠశాలలకు చెందిన 283 మందికి సీట్లు వచ్చాయి.

News July 12, 2024

భీమవరంలో రిటైర్డ్ జవాన్‌కు ఘన స్వాగతం

image

దేశానికి విశేష సేవలు అందించి రిటైర్డ్ అయ్యి భీమవరం తిరిగి వచ్చిన జావాన్ దాసరి దుర్గా రమేశ్‌కు స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జవాన్ రమేశ్ MRO కార్యాలయంలోని క్విట్ ఇండియా స్తూపం వద్ద నివాళులర్పించారు. 2001 నుంచి 2024 వరకు జమ్మూ-కశ్మీర్, రాజస్థాన్, హిమాచల్ బార్డర్‌లో ఎన్‌సీవో హెడ్‌గా దేశ రక్షణలో సేవలందించిన ఆయన.. తిరిగి భీమవరం చేరుకున్నారు.

News July 12, 2024

శ్రీవారి ఆరాధనకు మూలం అదే: రాఘవ దీక్షితులు

image

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆరాధనకు శ్రీవైఖానస మహర్షి రచించిన వైఖానస భగవత్ శాస్త్రమే మూలమని వైఖానస ట్రస్ట్ అధ్యక్షుడు రాఘవ దీక్షితులు తెలిపారు. తిరుమల ఆస్థాన మండపంలో శ్రీవైఖానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ, శ్రీమరీచి మహర్షి తిరు నక్షత్రోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాఘవ దీక్షితులు మాట్లాడుతూ.. వేల సంవత్సరాలుగా శ్రీవారికి పూజలు శ్రీవైఖానస ఆగమం ప్రకారం జరుగుతున్నాయని తెలిపారు.

News July 11, 2024

గుంటూరు: TODAY HEADLINES

image

*గుంటూరులో సందడి చేసిన సినీనటి
*అమరావతి శివాలయ పూజారికి నోటీసులు
*జగన్నాథ రథయాత్రలో చీపురు పట్టిన నారా లోకేశ్
*ANU: 4 సెమిస్టర్ ఫలితాలు విడుదల
*కొల్లూరు: గ్యాస్ స్టవ్ పేలి వృద్ధురాలికి గాయాలు
*మంగళగిరి TDP ఆఫీసుపై దాడి కేసు.. YCP నేతలకు బిగ్ రిలీఫ్
*డయేరియాపై పిడుగురాళ్లలో మంత్రి క్షేత్రస్థాయి పర్యటన