Andhra Pradesh

News July 11, 2024

విజయవాడకు కొత్త పోలీస్ కమిషనర్‌

image

విజయవాడ నూతన <<13611371>>పోలీస్ కమిషనర్‌గా<<>> SV రాజశేఖర్ బాబుని నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రాజశేఖర్ బాబు గుంటూరు రూరల్ ఎస్పీగా, లా అండ్ ఆర్డర్ ఎడిషనల్ డీజీగా కూడా పని చేశారు. రాజశేఖర్ 2006 ఐపీఎస్ బ్యాచ్‌కి చెందిన అధికారి. ఈ నియామక ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

News July 11, 2024

మట్టి గణపతి విగ్రహాలకు మాత్రమే అనుమతి: మేఘా స్వరూప్

image

అనంతపురం నగరంలో పర్యావరణహితం కోసం గురువారం అనంతపురం నగర మున్సిపల్ కమిషనర్ మేఘా స్వరూప్ మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది వినాయక చవితికి కేవలం మట్టి గణపతి విగ్రహాలకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు, థర్మాకోల్ వాడడానికి అనుమతి లేదన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి నగర ప్రజలందరూ ఈ నియమాలు పాటించి సహకరించవలసిందిగా కోరారు.

News July 11, 2024

నందికొట్కూరు పోలీస్‌స్టేషన్ ఎదుట వాసంతి బంధువుల నిరసన

image

చిన్నారి వాసంతి తల్లిదండ్రులు, బంధువులు నందికొట్కూరు పోలీసు స్టేషన్‌ను చుట్టుముట్టారు. ఇంతవరకు చిన్నారి ఆచూకీ దొరకలేదని బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. తమ పాపకు జరిగిన ఘటన వేరొకరికి జరగకూడదని కోరారు. వాసంతిని అత్యాచారం చేసి హతమార్చిన మైనర్ బాలురులకు ఎన్‌కౌంటర్ చేయాలని కోరారు.

News July 11, 2024

బాలుడి కిడ్నాప్ కలకలం.. పోలీసుల ఉరుకులు పరుగులు

image

కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెంలో గురువారం ఓ బాలుడు మిస్సింగ్ అయినట్లు సమాచారం రావడంతో పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగింది. సదరు బాలుడి తల్లిదండ్రులు, గ్రామస్థులతో కలిసి పోలీసులు అన్ని ప్రాంతాలను జల్లెడ పట్టారు. అయినా ఆచూకీ దొరకలేదు. ఎందుకైనా మంచిదని పోలీసులు వెళ్లి మరోసారి ఇంట్లో వెతకగా.. ఆ బాలుడు మంచం కింద నక్కి కనిపించాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

News July 11, 2024

కర్నూలు రేంజ్ డీఐజీగా కోయ ప్రవీణ్

image

కర్నూలు రేంజ్ డీఐజీగా కోయ ప్రవీణ్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత డీఐజీగా ఉన్న సీహెచ్ విజయరావును తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు విజయవాడలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో రిపోర్ట్ చేయవలసిందిగా ఉత్తర్వుల్లో ఆయన పేర్కొన్నారు.

News July 11, 2024

బాలుడి చికిత్సకు ప్రభుత్వమే ఖర్చులు భరిస్తుంది: కర్నూలు కలెక్టర్

image

విద్యుదాఘాతంతో గాయపడిన హుసేని వైద్యచికిత్సకు అయ్యే ఖర్చులను మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా విధుల్లో నిర్లక్ష్యం వహించిన అంగన్వాడీ హెల్పర్, విద్యుత్ లైన్‌మెన్, సీడీపీఓ, సూపర్వైజర్లకు షోకాజ్ మెమో జారీ చేశామని కలెక్టర్ పేర్కొన్నారు.

News July 11, 2024

కృష్ణా: పీసీబీ ఫైల్స్ దగ్ధం కేసులో విచారణ వేగవంతం

image

పెదపులిపాకలో రాష్ట్ర పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు(పీసీబీ)కి సంబంధించిన ఫైల్స్ దగ్ధం కేసులో OSD రామారావు ఇంట్లో గురువారం పోలీసులు సోదాలు జరిపారు. OSD రామారావు ఆదేశాలతోనే కార్యాలయం నుంచి ఫైల్స్ బయటికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. కాగా ఈ ఘటనకు సంబంధించి పెనమలూరు పోలీసులు భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత (బిఎన్‌ఎస్‌ఎస్‌)లోని సెక్షన్‌ 106 కింద కేసు నమోదు చేశారు.

News July 11, 2024

గిరి ప్రదక్షిణకు వెళ్తున్నారా.. ఐతే ఇది తప్పనిసరి

image

ఈ నెల 20న సింహాచలం గిరి ప్రదక్షిణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రదక్షిణ చేయటానికి లక్షల మంది భక్తులు దూర ప్రాంతాల నుంచి వస్తారు. కావున వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ కమిటీ తగిన ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా ప్రదక్షిణ చేసే భక్తులకు ఆస్తమా, జ్వరం మొదలైనవి ఉన్నట్లయితే తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రదక్షిణ సమయంలో అలసట, నీరసం వస్తే దగ్గరలో వైద్యశిబిరాలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.

News July 11, 2024

గిరి ప్రదక్షిణకు వెళ్తున్నారా.. ఐతే ఇది తప్పనిసరి

image

ఈ నెల 20న సింహాచలం గిరి ప్రదక్షిణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రదక్షిణ చేయటానికి లక్షల మంది భక్తులు దూర ప్రాంతాల నుంచి వస్తారు. కావున వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ కమిటీ తగిన ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా ప్రదక్షిణ చేసే భక్తులకు ఆస్తమా, జ్వరం మొదలైనవి ఉన్నట్లయితే తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రదక్షిణ సమయంలో అలసట, నీరసం వస్తే దగ్గరలో వైద్యశిబిరాలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.

News July 11, 2024

ప.గో: ఆన్‌లైన్ సేవల్లో అంతరాయం.. ఆగిన రిజిస్ట్రేషన్లు

image

ఉమ్మడి ప.గో జిల్లా వ్యాప్తంగా గురువారం రిజిస్ట్రేషన్ సేవలు నిలిచిపోయాయి. ఆన్‌లైన్ సేవల్లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ శాఖలో రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. దీంతో క్రయ, విక్రయదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. గురువారం మంచి రోజు రావడంతో పెద్ద ఎత్తున క్రయ విక్రయాలు జరుగుతుంటాయి. శుక్రవారం సెంటిమెంట్‌తో పాటు శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో ఇబ్బందులు తప్పేలాలేవు.