Andhra Pradesh

News September 29, 2024

నెల్లూరు: వదినను చంపిన వ్యక్తి అరెస్ట్

image

గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెన్నూరులో వదినను హత్య చేసిన కేసులో ముద్దాయి పాలెపు రమేశ్‌ను శనివారం అరెస్టు చేసినట్లు రూరల్ ఎస్సై పి మనోజ్ కుమార్ తెలిపారు. తిప్పవరప్పాడు జంక్షన్ వద్ద గూడూరు రూరల్ CI , SI, సిబ్బందితో కలిసి అరెస్టు చేశామని అన్నారు.

News September 29, 2024

‘కర్నూలు విమానాశ్రయంలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలి’

image

కర్నూలు విమానాశ్రయంలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఏరోడ్రోమ్ కమిటీ, ఎయిర్ ఫీల్డ్ ఎన్విరాన్మెంట్ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. విమానాశ్రయంలో మహిళా పోలీసులను కూడా నియమించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.

News September 29, 2024

పింఛన్ పంపిణీ పకడ్బందీగా చేపట్టాలి: కలెక్టర్ వినోద్ కుమార్

image

అనంతపురం జిల్లాలో అక్టోబర్ 1న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీని పకడ్బందీగా పంపిణీ చేపట్టాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి మండల స్థాయి అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ఇంటింటికీ వెళ్లి నగదు అందజేయాలని సూచించారు. అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News September 29, 2024

పోలీస్ సిబ్బంది ఆరోగ్య సంరక్షణే ధ్యేయం: ప్రకాశం ఎస్పీ

image

పోలీస్ సిబ్బంది ఆరోగ్య సంరక్షణే తమ ధ్యేయమని ఎస్పీ దామోదర్ పేర్కొన్నారు. ఒంగోలు కిమ్స్ హాస్పిటల్స్ సహకారంతో శనివారం జిల్లా పోలీస్ కళ్యాణ మండపంలో పోలీసు అధికారులకు ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపులో వివిధ విభాగాలకు చెందిన నిపుణులైన డాక్టర్లచే 474 మందికి పలు వైద్య పరీక్షలు నిర్వహించి, చికిత్స చేసి ఉచితంగా మందులు అందించారు.

News September 29, 2024

వేంపల్లి: యూట్యూబర్‌పై కేసు నమోదు

image

వేంపల్లెలో ఓ యూట్యూబ్ ఛానెల్ అధినేతపై కేసు నమోదు చేశారు. తన ఛానెల్లో పని చేస్తున్న యువతిని వేధించిన కేసులో సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు CI సురేష్ రెడ్డి తెలిపారు. ‘అతడి ఛానెల్లో యాంకర్‌గా పనిచేసే సమయంలో అసభ్యంగా ప్రవర్తించాడు. అక్కడ మానేసినా వేధింపులు అపలేదు. తాను అతడి మాటలు వినలేదని తన ఆఫీసు నుంచి నా సర్టిఫికేట్లు తీసుకెళ్లానని అబద్దపు కేసు పెట్టారు’ అని ఫిర్యాదులో తెలిపింది.

News September 29, 2024

విదేశాలలో తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట

image

అమెరికాలో గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘం గోల్డెన్ జూబ్లీ వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు దంపతులు సంఘ సభ్యులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను విదేశాల్లో తెలుగు ప్రజలు ఇంత ఘనంగా నిర్వహించడం గర్వకారణం అని పేర్కొన్నారు. ఇంత చక్కని కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.

News September 29, 2024

అట్రాసిటీ చట్టం పగడ్బందీగా అమలు చేయాలి: కలెక్టర్ దినకరన్

image

SC, ST అట్రాసిటీ చట్టం పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకరన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం పౌర హక్కుల పరిరక్షణ, అత్యాచార నిరోధక చట్టం పై నిర్వహించిన సమావేశంలో ఎస్పీ మహేశ్వర రెడ్డితో కలిసి మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న అట్రాసిటీ కేసులను పరిష్కరించాలని చెప్పారు. కమిటీలోని 8 మంది నూతన సభ్యుల నియామకానికి వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని సూచించారు.

News September 29, 2024

సౌర విద్యుత్‌పై అవగాహన కల్పించాలి: VZM జేసీ

image

ప్ర‌తీ ఇంట్లో సౌర విద్యుత్ వినియోగించుకొనే విధంగా వినియోగ‌దారుల‌ను చైత‌న్య‌ప‌ర‌చాల‌ని జేసీ ఎస్‌.సేతుమాధ‌వ‌న్ కోరారు. దీనికోసం కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న పీఎం సూర్య‌ఘ‌ర్ యోజ‌న ప‌థ‌కాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. ఈ ప‌థ‌కం అమ‌లుపై శ‌నివారం సంబంధిత శాఖ‌ల‌తో స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు. మండ‌లాల వారీగా ప‌థ‌కం అమ‌లును స‌మీక్షించారు.

News September 29, 2024

సెప్టెంబర్ 30న ఉమ్మడి ప.గో. విద్యార్థులకు పోటీలు

image

ఉమ్మడి ప.గో. జిల్లాలోని విద్యార్థులకు సెప్టెంబర్ 30న ‘సేవ్ ది గర్ల్’ అంశంపై వ్యాసరచన, డెబిట్, చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తామని ఆయా జిల్లాల శాఖ అధికారులు శనివారం తెలిపారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ఈ పోటీలు చేపడుతున్నామన్నారు. మొదటి విజేతకు రూ.5 వేలు, 2వ విజేతకు రూ.3 వేలు, 3వ విజేతకు 2 వేలను బహుకరిస్తామని స్పష్టం చేశారు. అక్టోబర్ 1న భీమవరం పీఎస్ఎం బాలికల ఉన్నత పాఠశాలలో పోటీలు ఉంటాయన్నారు.

News September 29, 2024

ఈవీఎంల గోడౌన్ల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు: కలెక్టర్

image

ఈవీఎంల గోడౌన్ల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేసి నిరంతరం నిఘా ఉంచాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. త్రైమాసిక తనిఖీల్లో భాగంగా శనివారం సాయంత్రం స్థానిక ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలోని ఈవీఎంల గోడౌన్లను రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. కలెక్టర్ గోడౌన్ల లోని ఈవీఎంలు, వివి ప్యాట్లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీలించారు.