Andhra Pradesh

News July 11, 2024

‘ఈ రైళ్లు విజయవాడ మీదుగా ప్రయాణించవు’

image

నాన్ ఇంటర్‌ లాకింగ్ పనులు జరుగుతున్నందున విజయవాడ మీదుగా వెళ్లే హైదరాబాద్- షాలిమార్, ఈస్ట్‌ కోస్ట్ ఎక్స్‌‌ప్రెస్‌లను దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.18046 రైలును ఆగస్టు 3-11 వరకు, నం.18045 ట్రైన్‌ను ఆగస్టు 2-10 వరకు విజయవాడ మీదుగా కాక గుణదల, రాయనపాడు మీదుగా నడుపుతామన్నారు. ఆయా రోజుల్లో ఈ రైళ్లు విజయవాడ మీదుగా వెళ్లవని, సమీపంలోని రాయనపాడులో ఈ రైళ్లకు స్టాప్ ఇచ్చామన్నారు. 

News July 11, 2024

శ్రీకాకుళం: 50,945 మంది విద్యార్థుల ఎదురుచూపు

image

డిగ్రీ, పీజీ, డిప్లొమా, ఐటీఐ సెమిస్టర్ పరీక్షలు పూర్తిచేసుకుని రిలీవ్ అయిన విద్యార్థులకు ఫీజు బకాయిలు చెల్లిస్తేనే ధ్రువపత్రాలు అందిస్తామని కాలేజీ యాజమాన్యాలు చెప్పడంతో విద్యార్థులకు నిరీక్షణ తప్పడం లేదు. దీంతో విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో విద్యాదీవెన కింద రూ.35.17 కోట్లను 50,945 మంది విద్యార్థులకు అందజేయాల్సి ఉంది.

News July 11, 2024

కడప: 23 మంది మద్యం ప్రియులకు జరిమాన

image

కడపలో వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు 23 మందికి జిల్లా న్యాయస్థానం జరిమాన విధించిందని కడప ట్రాఫిక్ సీతారామరెడ్డి తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వారిపై BNS యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసి కోర్టులో హజరు పరిచామన్నారు. న్యాయస్థానం వారికి జరిమానా విధించింది. ఎవరైనా తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ CI V. సీతారామిరెడ్డి తెలిపారు.

News July 11, 2024

పార్వతీపురం కలెక్టర్ పేరిట స్కామ్

image

జిల్లా కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ పేరిట +977 ISD కాల్స్ వస్తున్నాయని అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికార యంత్రాంగం గురువారం తెలిపింది. +977 970-2640751 నంబర్ పేరిట కాల్ చేసి కొంత మొత్తాన్ని ట్రాన్స్‌ఫర్ చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. ఇటువంటి నంబర్‌తో వచ్చిన కాల్స్‌ను ఎవరు లిఫ్ట్ చేయవద్దని అధికారులు చెబుతున్నారు. ఈ స్కామ్‌కి సంబంధించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

News July 11, 2024

చంద్రబాబును కలిసిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు

image

సీఎం చంద్రబాబును టీడీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి మర్యాదపూర్వకంగా కలిశారు. విజయనగరం జిల్లా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు సందర్శనకు వచ్చిన చంద్రబాబుకు కలమట స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబును శాలువాతో సత్కరించారు. జిల్లాలోని ప్రస్తుత రాజకీయాల అంశాలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.

News July 11, 2024

ఏలూరు: రైలులోంచి జారిపడి వ్యక్తి మృతి

image

ఏలూరు రైల్వే స్టేషన్ పరిధిలోని తేలప్రోలు రైల్వే గేటు సమీపంలో గురువారం ఓ వ్యక్తి రైలులోంచి జారిపడి మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే SI నరసింహారావు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహన్ని పరిశీలించారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో భద్రపరిచి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI పేర్కొన్నారు. మృతుడి వివరాలు తెలిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు.

News July 11, 2024

కర్నూలు: రోకలి బండతో బాది తల్లిని చంపిన కొడుకు

image

పాణ్యం మండలం వడ్డుగండ్ల గ్రామంలో కన్న కొడుకే తల్లిని కడతేర్చిన ఘటన గురువారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. మహేశ్ అనే వ్యక్తి కొంతకాలంగా మద్యానికి బానిసై మతిస్తిమితం కోల్పోయాడు. ఈ క్రమంలో గురువారం తల్లి నాగలక్ష్మమ్మ(58)ను రోకలితో తలపై బాదడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పాణ్యం సీఐ నల్లప్ప, ఎస్సై అశోక్ ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

News July 11, 2024

మున్సిపల్ కమిషనర్‌పై నంద్యాల JC ఆగ్రహం

image

నంద్యాల మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డిపై జాయింట్ కలెక్టర్ టీ.రాహుల్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు వివాదంలో ఉన్న రైతు బజార్ పక్కన గల స్థలంలో కాంపౌండ్ వాల్ తొలగించడాన్ని JC సీరియస్‌గా తీసుకున్నారు. దీనిపై కమిషనర్‌ను JC ప్రశ్నించగా ఆయన పొంతన లేని సమాధానం చెప్పారు. దీంతో కమిషనర్‌పై JC మండిపడ్డారు. ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం అవుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

News July 11, 2024

నెల్లూరులో జనసేన కార్యాలయం ప్రారంభం

image

నెల్లూరు నగరంలోని గోమతి నగర్‌లో జనసేన జిల్లా పార్టీ ఆపీసు ఏర్పాటు చేశారు. దీనిని పూజా కార్యక్రమాలతో గురువారం ప్రారంభించారు. జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ మాట్లాడుతూ.. ఎవరికి అన్యాయం జరిగినా తమ పార్టీ కార్యాలయం తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని చెప్పారు. జనసేన పార్టీ పేద ప్రజల బాధలు తెలుసుకుని వారికి సహాయం చేసేందుకు ముందుంటుందని తెలిపారు.

News July 11, 2024

నరసన్నపేట విద్యార్ధులు IIIT కి ఎంపిక

image

నరసన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివిన ముగ్గురు విద్యార్థులు IIITలో ప్రవేశాలు పొందినట్లు పాఠశాల సిబ్బంది గురువారం తెలిపారు. విద్యార్థులు మెర్సీ, మధుసూదన్ రావు నూజివీడు త్రిపుల్ ఐటీలో, దివ్య శ్రీకాకుళం త్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు అర్హత సాధించారని అన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఎంపిక కావడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.