Andhra Pradesh

News July 11, 2024

‘గూగూడు’ పేరు ఎలా వచ్చిందంటే? (1/2)

image

ఈ విషయాన్ని తెలుసుకున్న శ్రీరాముడు ఆంజనేయుడిని గుహుడి వద్దకు పంపి త్వరలో సీతాలక్ష్మణ సమేతుడై దర్శనమిస్తానని సందేశం పంపుతారట. దీంతో గుహుడు ఆత్మాహుతి నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటారు. కొన్ని రోజుల తర్వాత సీతారామలక్ష్మణులు గుహుడికి దర్శనమిస్తారట. ఇక గుహుడు ఆత్మార్పణ చేసుకోవాలని నిర్ణయించుకున్న గుండమే నేడు ఆలయం ముందు ఉన్న గుండమని, తపస్సు చేసిన ఈ ప్రాంతం కాలక్రమంలో గూగూడుగా మారిందని పురాణాలు చెబుతున్నాయి.

News July 11, 2024

‘గూగూడు’ పేరు ఎలా వచ్చిందంటే? (1/1)

image

పురాణాల ప్రకారం.. ప్రస్తుతం కుళ్లాయిస్వామి ఉన్న చోట గుహుడు అనే మహర్షి శ్రీరాముడి కోసం తపస్సు చేసుకునేవారు. అరణ్యవాసంలో ఉన్న శ్రీరాముడు తన భార్యను వెతుకుతూ ఈ ప్రాంతానికి వచ్చారు. గుహుడి ఆతిథ్యాన్ని స్వీకరించి మరోసారి సీతాసమేతుడై దర్శనమిస్తానని గుహుడికి తెలియజేస్తారు. గుహుడికి ఇచ్చిన మాటను మరిచిన శ్రీరాముడు రావణుడిని సంహరించిన తర్వాత అయోధ్యకు వెళ్తారు. ఇది తెలిసి <<13608428>>గుహుడు<<>> ఆత్మాహుతికి సిద్ధపడతారట.

News July 11, 2024

కర్నూలు: ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ITI కాలేజీల్లో వివిధ ట్రేడ్‌లలో రెండో విడత ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ITI కాలేజీల జిల్లా కన్వీనర్ కృష్ణమోహన్ తెలిపారు. ఈనెల 24వ తేదీ వరకు గడువు ఉందని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారికి 25న సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News July 11, 2024

సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన MP చిన్నీ

image

విజయవాడలోని నాలుగో డివిజన్‌లో MP చిన్నీ గురువారం మధ్యాహ్నం పలు సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. నోవోటెల్ వైపు సర్వీస్ రోడ్ పరిశీలించి దానిని పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం నగర పాలక సంస్థలు 2014 నుంచి 2019 వరకు సీఎం చంద్రబాబు నిధులు మిగలాలని ఆ రోజు చేపట్టిన కార్యక్రమాల వల్లే మిగులు బడ్జెట్ వచ్చింది. అదే సీసీ రోడ్లు నిర్మించడానికి కారణమైందని అన్నారు.

News July 11, 2024

ఏయూ: 27 నుంచి ఎం.ఏ పరీక్షలు ప్రారంభం

image

ఏయూ పరిధిలో ఎం.ఏ ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం, తెలుగు, ఎకనామిక్స్, ఫిలాసఫీ, సోషియాలజీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ, యోగ, సోషల్ వర్క్, లైబ్రరీ సైన్స్, ఎంజెఎంసి, యాంత్రపాలజీ కోర్సుల రెండో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 27 నుంచి ప్రారంభమవుతాయని అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ జె.రత్నం ఒక ప్రకటనలో తెలిపారు. కోర్సులు వారీగా సబ్జెక్టులు వివరాలతో టైం టేబుల్ వెబ్సైట్లో ఉంచారు.

News July 11, 2024

పేదరిక నిర్మూలనకు జనాభా నియంత్రణ కీలకం: కలెక్టర్

image

జనాభా నియంత్రణపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలని, పేదరిక నిర్మూలనకు జనాభా నియంత్రణ కీలకమని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి పేర్కొన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా రాయచోటి ప్రాంతీయ వైద్యశాల నందు అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అధిక జనాభా వల్ల వచ్చే సమస్యలు, చిన్న కుటుంబాల ప్రాముఖ్యతపై అవగాహన పెంచడానికి జులై 11న ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు.

News July 11, 2024

ట్రిపుల్ ఐటీ ప్రవేశాల కౌన్సెలింగ్ తేదీలు ఇవే.!

image

రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీలకు ఎంపికైన అభ్యర్థులకు నిర్వహించనున్న కౌన్సెలింగ్ తేదీలను ఆర్జీయూకేటీ ఛాన్స్లర్ ఆచార్య కేసీరెడ్డి ప్రకటించారు. నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీకి ఎంపికైన వారికి ఈనెల 22, 23 తేదీల్లో, ఒంగోలు ట్రిపుల్ ఐటీకి ఎంపికైన వారికి ఈనెల 24, 25 తేదీల్లో ఇడుపులపాయలో, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీకి ఎంపికైన వారికి ఈనెల 26, 27 తేదీల్లో శ్రీకాకుళంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.

News July 11, 2024

ఘనంగా వెంగమాంబ అమ్మవారి 16 రోజుల పండుగ

image

నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలంలోని నర్రవాడ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ వెంగమాంబ అమ్మవారి 16 రోజుల పండుగను గురువారం ఘనంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లను ప్రత్యేక పుష్పాలంకరణతో గ్రామంలో ఊరేగించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కార్య నిర్వహణ అధికారి ఉషశ్రీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

News July 11, 2024

ఉమ్మడి విజయనగరం జిల్లా జనాభా ఎంతంటే..!

image

ఉమ్మడి విజయనగరంలో జిల్లా జనాభా 28,56,151కు చేరుకుంది. పార్వతీపురం మన్యం జిల్లాలో 9,25,340 మంది, విజయనగరం జిల్లాలో 19,30,811 మంది జనాభా ఉన్నట్లు ఏయూ జనాభా అధ్యయన కేంద్రం అంచనా వేసింది. 2011తో పోల్చితే ఉమ్మడి జిల్లాలో సుమారు ఐదు లక్షలకు పైగా జనాభా పెరిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి విజయనగరం జిల్లా జనాభా 23,42,868గా ఉంది.

News July 11, 2024

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకుందాం: సీఎం చంద్రబాబు

image

విశాఖ స్టీల్ ప్లాంట్ ఎంతోమంది అమరవీరుల త్యాగ ఫలితంగా ఏర్పడిందని సీఎం చంద్రబాబు అన్నారు. అటువంటి స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవడానికి తాను ప్రయత్నిస్తుంటే, అబద్ధాల పార్టీ(వైసీపీని ఉద్దేశించి)నాయకులు లేనిపోని బురద జల్లుతున్నారని మండిపడ్డారు. అనకాపల్లి జిల్లా పర్యటనలో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్‌కు అనుకూలంగా ఎన్డీఏ కూటమి ఉంటుందని చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందనవసరం లేదన్నారు.