Andhra Pradesh

News July 11, 2024

వైసీపీ నాయకులు ఆర్థిక నేరగాళ్లు: సీఎం చంద్రబాబు

image

వైసీపీ నాయకులపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్ల పాలనలో విశాఖ సహా ఉత్తరాంధ్రలో వనరులను, ప్రకృతిని దోచుకున్న ఆర్థిక నేరగాళ్లు.. వైసీపీ నాయకులని అన్నారు. గురువారం దార్లపూడిలో జరిగిన సభలో ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు. ప్రజల సొమ్మును దోచుకున్న ఆర్థిక నేరగాళ్లను వదిలే ప్రసక్తే లేదని స్పష్టం హెచ్చరించారు. వైసీపీ అంటే అబద్ధాల పార్టీ అని దుయ్యబట్టారు.

News July 11, 2024

పెళ్లి కాలేదని తాడిపత్రిలో యువకుడి ఆత్మహత్య

image

పెళ్లి కాలేదన్న మనస్తాపంతో జీవితంపై విరక్తి చెంది యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన తాడిపత్రిలో చోటుచేసుకుంది. పుట్లూరు రైల్వే గేట్ సమీపంలో మృతదేహం ఉన్నట్లు గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే ఎస్సై నాగప్ప ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు పట్టణంలోని పాత కోటకు చెందిన నాగయ్యగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News July 11, 2024

ఉత్తరాంధ్ర జిల్లాల్లో 2 లక్షల ఎకరాలకు సాగునీరు: చంద్రబాబు

image

పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా ఉత్తరాంధ్ర జిల్లాల్లో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. గురువారం దార్లపూడి పోలవరం ఎడమ ప్రధాన కాలువ వద్ద ప్రజల ఉద్దేశించి సీఎం మాట్లాడారు. గతంలో తాను 72% పోలవరం పనులు పూర్తిచేస్తే, వైసీపీ ప్రభుత్వం కనీసం ఒక శాతం పనులు కూడా చేపట్టలేదని ఆరోపించారు. ఉత్తరాంధ్రకు పోలవరం ఒక వరం అన్నారు.

News July 11, 2024

ఏయూ: 27 నుంచి ఎమ్మెస్సీ జాగ్రఫీ, సైకాలజీ పరీక్షలు

image

ఏయూ పరిధిలో ఈ నెల 27 నుంచి ఎమ్మెస్సీ జాగ్రఫీ 2వ సెమిస్టర్, ఎంఎస్సీ సైకాలజీ-పారా సైకాలజీ 2వ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు అడిషనల్ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ జె.రత్నం తెలిపారు. సబ్జెక్టు వారీగా పరీక్షలు తేదీలు, టైం టేబుల్ వివరాలను వెబ్సైట్లో ఉంచారు. జాగ్రఫీ పరీక్షలు మధ్యాహ్న 2 గంటల నుంచి 5:00 వరకు, సైకాలజీ-పారాసైకాలజీ పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరుగుతాయి.

News July 11, 2024

శ్రీకాకుళం: రెండో సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదల

image

ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో Msc జాగ్రఫీ కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్ థియరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. జులై 27-ఆగస్టు 2వ తేదీ మధ్య జరగనున్న ఈ పరీక్షలను మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ వర్శిటీ పరీక్షల విభాగం ఆయా కేంద్రాలలో నిర్వహించనుంది. సబ్జెక్టుల వారీగా షెడ్యూల్ వివరాలకై https://exams.andhrauniversity.edu.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవచ్చు.

News July 11, 2024

మైలవరం: పెట్రోల్, డీజల్ ఖనిజాల కోసం సర్వే

image

మైలవరం మండలం నార్జంపల్లెలో పెట్రోల్, డీజిల్ ఖనిజాల కోసం ప్రముఖ కంపెనీ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ సంస్థ సర్వే చేస్తున్నారు. గత రెండేళ్లుగా ఈ నియోజకవర్గంలో ఈ సంస్థ సర్వే నిర్వహిస్తుంది. నిన్నటితో పెద్దముడియం మండలంలో సర్వే ముగియడంతో నేటి నుంచి మైలవరం మండలంలో ఈ సర్వే ప్రారంభించారు. పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ యాజమాన్యంలోని ఈ సంస్థ సర్వే చేస్తోంది.

News July 11, 2024

ఒంగోలు: భార్యపై కత్తితో దాడి చేసిన భర్త

image

ఒంగోలు మండలంలోని తృవగుంట హరిజనవాడలో దారుణం చోటుచేసుకుంది. చెడు వ్యసనాలకు బానిసైన భర్త, భార్య నాగలక్ష్మిపై విచక్షణా రహితంగా దాడి చేసి గాయపరిచాడు. బుధవారం రాత్రి కత్తితో నాగలక్ష్మి గొంతు కోస్తుండగా ఆమె పెద్దగా అరవడంతో భర్త పరారయ్యాడు. దీంతో అకస్మారక స్థితిలో ఉన్న నాగలక్ష్మిని కుటుంబ సభ్యులు రిమ్స్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 11, 2024

వల్లభనేని వంశీపై కేసు

image

గన్నవరం టీడీపీ ఆఫీసుపై జరిగిన దాడిలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. వంశీతో పాటు ఆయన అనుచరులు 70 మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అందులో ఇప్పటికే 15 మందిని రిమాండ్‌కు తరలించామని తెలిపారు.

News July 11, 2024

పోలవరం కెనాల్‌ పనులు పరిశీలించిన సీఎం చంద్రబాబు

image

ఎస్.రాయవరం మండలం దార్లపూడి సమీపాన పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్‌‌కు గురువారం మధ్యాహ్నం 12గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. దార్లపూడిలో అసంపూర్తిగా నిలిచిపోయిన లెఫ్ట్ మెయిన్ కెనాల్‌ను ఆయన పరిశీలించారు. అనంతరం సంబంధించిన మ్యాపులపై ఆరా తీశారు. అధికారులు కాలువ పురోగతిపై చంద్రబాబుకు వివరించారు. ఎంపీ సీఎం రమేశ్, మంత్రులు రామానాయుడు, అనిత, తదితరులు పాల్గొన్నారు.

News July 11, 2024

విజయవాడ కనకదుర్గమ్మ హుండీలో 1300 US డాలర్లు

image

దుర్గామల్లేశ్వర స్వామి హుండీ ఆదాయ లెక్కింపు కార్యక్రమం జరిగింది. 20 రోజులకుగానూ రూ.3,36,59,796 నగదు, 436 గ్రా. బంగారం, 6.06 కిలోల వెండి వచ్చిందని అధికారులు చెప్పారు. 1300 US డాలర్లు, 85 UK పౌండ్లు, 7 ఆస్ట్రేలియా డాలర్లు, 12 సింగపూర్ డాలర్లు, 80 కెనడా డాలర్లు, 70 న్యూజిలాండ్ డాలర్లు, 625 కువైట్ దీనార్లు, 118 మలేషియా రింగెట్స్, ఈ-హుండీ ద్వారా రూ.1,91,787 ఆదాయం వచ్చిందన్నారు.