Andhra Pradesh

News July 11, 2024

భీమవరం: పుణ్య క్షేత్రాల సందర్శనకు ‘భారత్ గౌరవ్’

image

భారతీయ రైల్వే సంస్థ (ఐఆర్సీటీసీ) దేశంలోని పర్యాటక ప్రదేశాలు, పుణ్య క్షేత్రాల సందర్శనకు భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ పేరుతో ప్రత్యేక రైళ్లు నడుపుతుందని ఏరియా మేనేజర్ ఎం. రాజు తెలిపారు. దీనికి సంబంధించి భీమవరం టౌన్ రైల్వే స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. జ్యోతిర్లింగ దివ్య దక్షిణయాత్ర పేరుతో ఆగస్టు 4న ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

News July 11, 2024

కడప: జీవిత ఖైదీల విడుదలకు ప్రతిపాదనలు

image

సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు జిల్లా అధికారులు ప్రతిపాదనలను పంపారు. ఇందులో భాగంగా కడప కేంద్ర కారాగారం నుంచి 2023లో 11 మంది, 2024లో ఐదుగురు, తాజాగా నలుగురు ఖైదీలను కలిపి మొత్తం 20 మంది పేర్లతో కూడిన జాబితాను రాష్ట్ర జైల్ల శాఖ ప్రధాన కార్యాలయానికి పంపారు. రాష్ట్ర ప్రభుత్వం ఖైదీల విడుదలపై కమిటీ ద్వారా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

News July 11, 2024

సరసమైన ధరలకు కందిపప్పు, బియ్యం: కలెక్టర్

image

నంద్యాలలోని పద్మావతి నగర్ రైతు బజార్‌లో నాణ్యమైన కర్నూలు సోనా బియ్యం, సార్టెక్స్ కందిపప్పు ప్రత్యేక విక్రయ కేంద్రాలను కలెక్టర్ రాజకుమారి గురువారం ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే కందిపప్పు, బియ్యం సరఫరా చేయాలని సంంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ రాహుల్ కుమార్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

News July 11, 2024

తిరుపతి లాయర్‌కు స్టేట్ 5th ర్యాంక్

image

వారిది సాధారణ రైతు కుటుంబం. చిన్నప్పుడే తండ్రి మృతి చెందాడు. తల్లి, సోదరుడి ప్రోత్సహంతో మనుషా రాష్ట్ర స్థాయి PG లాసెట్‌లో ఐదో ర్యాంకు సాధించింది. పొదలకూరు(M) లింగంపల్లి గ్రామానికి చెందిన గుండ్రా మస్తాన్‌రెడ్డి, మాధవిల కుమార్తె పదో తరగతి వరకు పొదలకూరు బాలికల ZP హైస్కూల్లో చదివింది. తిరుపతి SVUలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి ఇక్కడే న్యాయవాదిగా పనిచేస్తోంది. న్యాయమూర్తి కావడమే లక్ష్యమని మనుషా పేర్కొంది.

News July 11, 2024

శ్రీకాళహస్తి : స్కౌట్స్ విద్యార్థులను అభినందించిన కలెక్టర్

image

ఈ ఏడాదికి రాజ్య పురస్కార్ అవార్డులు పొందిన శ్రీకాళహస్తిలోని బాబూ అగ్రహారం మున్సిపల్ ఉన్నత పాఠశాలకు చెందిన ఐదుగురు స్కౌట్స్ విద్యార్థులు శ్రీనివాసులు, వినోద్, యస్వంత్, మురళి, లోకేష్లను తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో DEO శేఖర్, స్టేట్ ఆర్గనైజింగ్ కమిషనర్ శ్రీనివాసరావు, జిల్లా స్కౌట్స్ కమిషనర్ వంశీరాజా, స్కౌట్ గైడ్ డీటీసీ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

News July 11, 2024

నెల్లూరు: రైతు కుటుంబంలో పుట్టి.. స్టేట్ 5th ర్యాంక్

image

వారిది సాధారణ రైతు కుటుంబం. చిన్నప్పుడే తండ్రి మృతి చెందాడు. తల్లి, సోదరుడి ప్రోత్సహంతో మనుషా రాష్ట్ర స్థాయి PG లాసెట్‌లో ఐదో ర్యాంకు సాధించింది. పొదలకూరు(M) లింగంపల్లి గ్రామానికి చెందిన గుండ్రా మస్తాన్‌రెడ్డి, మాధవిల కుమార్తె పదో తరగతి వరకు పొదలకూరు బాలికల ZP హైస్కూల్‌లో చదివింది. తిరుపతి SV యూనివర్సిటీలో LLB పూర్తి చేసి న్యాయవాదిగా పనిచేస్తోంది. న్యాయమూర్తి కావడమే లక్ష్యమని మనుషా పేర్కొంది.

News July 11, 2024

విశాఖ ఎల్జీ పాలిమర్స్ బాధితులకు అదనపు సాయం

image

విశాఖలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ బాధితులతో పాటు ప్రభావిత గ్రామాలకు అదనంగా రూ.120కోట్ల సహాయం చేసేందుకు దాని మాతృ సంస్థ ఎల్జీ కెమ్ ముందుకు వచ్చింది. నిరంతరం వైద్య పరీక్షలకు ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఎల్జీ పాలిమర్స్ ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ఐదువేల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు సీఎం చంద్రబాబుతో సంస్థ ప్రతినిధులు చర్చించారు.

News July 11, 2024

కడప జిల్లా జనాభా ఎంతంటే?

image

నేడు అంతర్జాతీయ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని జనాభా అధ్యయన కేంద్ర గ్రోత్ రేట్ ఆధారంగా జనాభా గణాంకాలను విడుదల చేశారు. దీని ప్రకారం ప్రస్తుతం కడప జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో 20,60,654 జనాభా ఉన్నట్లు తెలిపారు. కాగా 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి కడప జిల్లాలో 28,84,524 మంది ఉన్నారు. కాగా ఈఏడాది జిల్లాలో భారీగా జనాభా పెరిగిందని తెలిపారు.

News July 11, 2024

మృత్యు వారధిగా మారిన చించినాడ బ్రిడ్జి

image

ఉభయ గోదావరి జిల్లాలను కలుపుతూ నిర్మించిన చించినాడ బ్రిడ్జి మృత్యు వారధిగా మారింది. నిర్వహణ లోపంతో 24 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ వంతెన గోతులు పడి తరచూ ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. వంతెనపై ఎక్కడికక్కడ గోతులు ఏర్పడడంతో ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. వంతెనపై ఏర్పాటు చేసిన సోలార్ లైట్లు అలంకార ప్రాయంగా మారాయి. రహదారిని అభివృద్ధి చేయాలని కోరుతూ స్థానికులు బుధవారం ధర్నా చేశారు.

News July 11, 2024

కొరిసపాడులో బాలిక సూసైడ్

image

కొరిసపాడు మండలం మేదరమెట్లలో బుధవారం రాత్రి ఖమ్మం జిల్లాకు చెందిన బాలిక (14) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కొద్దిరోజుల క్రితం కూలీ పనుల నిమిత్తం గ్రామంలోని తమ బంధువుల వద్ద నివాసం ఉంటూ, పనికి వెళుతుండేది. అర్ధరాత్రి ఇంటిలో నిద్రించిన బాలిక కనిపించకపోవడంతో పరిసర ప్రాంతాలు వెతకగా చెట్టుకు ఉరి వేసుకుని కనిపించిందని బాలిక తండ్రి దేవయ్య తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.