Andhra Pradesh

News July 11, 2024

విజయనగరం పైడితల్లి అమ్మవారి హుండీ ఆదాయం లెక్కింపు

image

ఉత్తరాంధ్రుల ఇలవేల్పు విజయనగరం పైడితల్లి అమ్మవారి చదురు గుడి హుండీ ఆదాయాన్ని బుధవారం సిబ్బందితో స్థానిక కల్యాణ మండపంలో లెక్కించారు. 37 రోజులకు రూ.13,43,881 నగదు, 18.600 గ్రాముల బంగారం, 486 గ్రాముల వెండి వచ్చినట్లు ఆలయ సహాయ కమిషనర్ ప్రసాదరావు, దేవదాయశాఖ జిల్లా సహాయ కమిషనర్ టి.అన్నపూర్ణ తెలిపారు.

News July 11, 2024

ఏపీలోనే నెల్లూరు టాప్

image

అంధ్రవిశ్వవిద్యాలయంలోని జనాభా అధ్యాయన కేంద్రం గ్రోత్ రేట్ ఆధారంగా రాష్ట్రంలో ప్రస్తుత జనాభాను అంచనా వేసింది. దీని ప్రకారం రాష్ట్ర జనాభా 5,78,92,568 మంది ఉండగా 24,69,712 మంది జనాభాతో నెల్లూరు జిల్లా మొదటిస్థానంలో నిలిచింది. అదేవిధంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రతి 1000 మంది మగవాళ్లకు 985 మంది మహిళలు ఉన్నారు. అక్షరాస్యత 68.90 శాతంగా ఉంది.

News July 11, 2024

అగ్నివీర్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

అగ్నివీర్ పథకంలో భాగంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పనాధికారి కల్యాణి తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు తమ పేర్లను https:///agnipathvayu.cdac.in వెబ్ సైట్‌లో ఈ నెల 28వ తేదీ లోగా నమోదు చేసుకోవాలన్నారు.

News July 11, 2024

గుంటూరు: పిన్నెల్లి బెయిల్ పిటిషన్లు.. వాదనలు ఇలా.!

image

మాచర్ల మాజీ MLA పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్లపై బుధవారం గుంటూరు జిల్లా కోర్టులో వాదనలు జరిగాయి. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తూ.. రిగ్గింగ్‌ను ఆపడానికి పిన్నెల్లి ఈవీఎం పగలగొట్టినట్లు వైసీపీ అధ్యక్షుడు జగన్ ఇటీవల ఒప్పుకున్నారని చెప్పారు. పిన్నెల్లి తరఫు న్యాయవాది వాదిస్తూ, కక్షపూరితంగా కేసులు పెట్టారన్నారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు తీర్పును 18కి వాయిదా వేసింది.

News July 11, 2024

అనంతపురం జిల్లా జనాభా 40,81,148

image

ఉమ్మడి అనంతపురం జిల్లా జనాభా 40,81,148కు చేరుకుంది. అనంతపురం జిల్లాలో 22,41,105 మంది, సత్యసాయి జిల్లాలో 18,40,043 మంది జనాభా ఉన్నట్లు ఏయూ జనాభా అధ్యయన కేంద్రం అంచనా వేసింది. పురుషులు, మహిళల నిష్పత్తి చూస్తే ఉమ్మడి అనంతపురం జిల్లాలో అత్యల్పంగా ప్రతి 1000 మంది పురుషులకు 977 మంది మహిళలు ఉన్నారు.

News July 11, 2024

మృత్యు వారధిగా మారిన చించినాడ బ్రిడ్జి

image

ఉభయ గోదావరి జిల్లాలను కలుపుతూ నిర్మించిన చించినాడ బ్రిడ్జి మృత్యు వారధిగా మారింది. నిర్వహణ లోపంతో 24 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ వంతెన గోతులు పడి తరచు ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. వంతెనపై ఎక్కడికక్కడ గోతులు ఏర్పడడంతో ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. వంతెనపై ఏర్పాటు చేసిన సోలార్ లైట్లు అలంకార ప్రాయంగా మారాయి. రహదారిని అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

News July 11, 2024

నేటి నుంచి రాయితీ ధరకు బియ్యం కందిపప్పు

image

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు నేటి నుంచి రాయితీ ధరకు బియ్యం కందిపప్పు అందిస్తున్నారు. తిరుపతి ఆర్టీసీ రోడ్డు లోని రైతు బజారులు, చిత్తూరు నగరంలోని రైతు బజారుతో పాటు కొన్ని ప్రాంతాల్లో విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. బియ్యం రూ. 48కి, బియ్యం (స్టీమ్డ్) రూ.49కి, దేశవాళి కందిపప్పు రూ.160 కి సరఫరా చేయనున్నారు.

News July 11, 2024

నిడదవోలు: TDP, జనసేనలోకి YCP నాయకులు.?

image

నిడదవోలు నియోజకవర్గంలోని కొందరు వైసీపీ నేతలు టీడీపీ, జనసేనలో చేరేందుకు సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. 3ఏళ్ల కిందట పురపాలక ఎన్నికల్లో 27 వార్డుల్లో వైసీపీ, ఒక వార్డులో టీడీపీ అభ్యర్థి గెలవగా.. కూటమి ప్రభుత్వం ఏర్పాటు నేపథ్యంలో పలువురు కౌన్సిలర్లు పార్టీ మారేందుకు అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. నిడదవోలు నుంచి గెలిచిన కందుల దుర్గేశ్ మంత్రి అయిన విషయం తెలిసిందే.

News July 11, 2024

పొరపాటున గడ్డిమందు తాగి మహిళ మృతి

image

వీరఘట్టం మండలం యూ.వెంకంపేటకు చెందిన వాన రమణమ్మ(55) పొరపాటున గడ్డిమందు తాగి మృతిచెందారు. ఆమె బంధువులు తెలిపిన
వివరాల మేరకు.. కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న రమణమ్మ నిత్యం మందులు, టానిక్‌లు వాడుతున్నారు. ఈ క్రమంలో తాను వాడే టానిక్స్ పక్కనే పంట చేనులో పిచికారీ చేసేందుకు తెచ్చిన గడ్డిమందు ఉండటంతో అనుకోకుండా తాగారు. కుటుంబ సభ్యులు రిమ్స్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందారు.

News July 11, 2024

టీడీపీలోకి కుప్పం మునిసిపల్ ఛైర్మన్?

image

చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ సుధీర్‌, 9 మంది కౌన్సిలర్లతో అమరావతికి పయనమై వెళ్లినట్లు తెలిసింది. వైసీపీకి చెందిన ఛైర్మన్‌, టీడీపీలో చేరేందుకే బయలుదేరి వెళ్లినట్లు కుప్పంలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. నేడో, రేపో టీడీపీలో మునిసిపల్ ఛైర్మన్ సుధీర్, 9 మంది కౌన్సిలర్లు చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.