Andhra Pradesh

News July 11, 2024

విశాఖ: ఎంతైనా టీచరమ్మే కదా..!

image

గతంలో ఉపాధ్యాయురాలిగా పనిచేసిన రాష్ట్ర హోం మంత్రి విద్యార్థులతో మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం నిత్యం చేస్తున్నారు. ఏ కార్యక్రమంలో ఉన్నా, ఎక్కడికి వెళ్లినా పాఠశాల చిన్నారులు కనిపిస్తే చాలు కొద్దిసేపు వారితో గడుపుతున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను ఒక వైపు పర్యవేక్షిస్తూనే మరోవైపు దార్లపూడిలో ప్రభుత్వ పాఠశాల చిన్నారులను ఆప్యాయంగా పలకరించి వారితో కొద్దిసేపు ముచ్చటించారు.

News July 11, 2024

అనంతపురంలో 12న ఉద్యోగ మేళా

image

అనంతపురం నగరంలోని ఎస్వీ డిగ్రీ కళాశాలలో ఈ నెల 12న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు పూల్ క్యాంపస్ డ్రైవ్ సంస్థ వైస్ ఛైర్మన్ చక్రధర్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి అనంత జిల్లాలోని డిగ్రీ పూర్తి చేసిన యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. 2023, 2024లో బీబీఏ, బీసీఏ, బీఎస్సీ, బీకాం, బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. ఉదయం 8.30 గంటలకు అభ్యర్థులు మౌఖిక పరీక్షలకు హాజరుకావాలన్నారు.

News July 11, 2024

పెద్దపులి పాదముద్రల గుర్తింపు

image

నంద్యాల జిల్లాలోని మహానంది, రుద్రవరం మండలాల్లో కొంతకాలంగా చిరుత పులి సంచారంతో బెంబేలెత్తిన జనాలకు.. ఇప్పుడు పెద్దపులి భయం పట్టుకుంది. బుధవారం రుద్రవరం మండలం చెలిమ ఫారెస్టు రేంజ్‌లోని కోటకొండ పొలాల్లో పెద్దపులి సంచరించినట్లు రైతులు గుర్తించారు. పెద్దపులి పాదముద్రలు స్పష్టంగా కనిపించాయి. దీంతో రైతులు వ్యవసాయ పనులకు వెళ్లాలంటే భయపడుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సి వస్తోందని అన్నారు.

News July 11, 2024

జనాభా పరిశోధనల్లో 47 ఏళ్లుగా సేవలందిస్తున్న ఏయూ

image

జనాభా సంబంధిత పరిశోధనలో ఏయూ 47 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నట్లు కేంద్రం సంచాలకులు ఆచార్య బి.మునిస్వామి తెలిపారు. 1977లో ఏయూలో జనాభా పరిశోధన కేంద్రం ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి ఇటువంటి కేంద్రాలు 18 ఉన్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇవి నడుస్తున్నాయి. రాష్ట్ర దేశ జనాభా తెలిపే విధంగా డిజిటల్ గడియారాన్ని ఈ కేంద్రం బయట ఏర్పాటు చేశారు.

News July 11, 2024

నెల్లూరు: ఆ బస్సుల్లో సాధారణ చార్జీలే వసూలు

image

నెల్లూరు బారా షహీద్ దర్గా రొట్టెల పండుగకు వచ్చే భక్తుల సౌకర్యం మేరకు ఆర్టీసి బస్సులు తిప్పనున్నట్లు ఆర్ఎం విజయరత్నం తెలిపారు. జిల్లా బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ ఈ నెల 17వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరగనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జిల్లా నలుమూలల నుంచి దర్గా వరకు 44 ప్రత్యేక బస్సులను తిప్పనున్నట్లు ఆర్ఎం చెప్పారు. ఈ బస్సుల్లో సాధారణ చార్జీలే వసూలు చేస్తామని ప్రకటించారు.

News July 11, 2024

తాడేపల్లిగూడెం: 77 ఏళ్ల వృద్ధురాలికి HIV సోకిందని డబ్బు డిమాండ్

image

తాడేపల్లిగూడెంలోని ప్రైవేటు కంటి ఆసుపత్రిలో కంటి చికిత్సకు వెళ్లిన 77 వృద్ధురాలికి HIV ఉందని సొమ్ము డిమాండ్ చేశారు. ఆమె కంటి సమస్యతో గతనెల 28న ఆసుపత్రికి వెళ్లింది. ఈనెల 9న రక్త పరీక్షలు చేశారు. HIV సోకిందని చికిత్సకు మరో రూ.10వేలు డిమాండ్ చేశారు. నమ్మని కుటుంబీకులు మరో చోట పరీక్షలు చేయిస్తామనగా..మళ్లీ పరీక్షలు చేసి HIVలేదన్నారు.బాధితుల ఫిర్యాదుతో బుధవారం జిల్లా వైద్య సిబ్బంది వివరాలు సేకరించారు.

News July 11, 2024

విజయనగరం: సచివాలయ కార్యదర్శులకు మెమోలు

image

విజయనగరం పట్టణంలోని గోకపేటలో 45వ సచివాలయాన్ని విజయనగరం కమిషనర్ మల్లయ్య నాయుడు బుధవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇద్దరు సచివాలయ కార్యదర్శులు విధులకు గైర్హాజరు కావడంతో వారికి శ్రీముఖాలు జారీ చేశారు. రికార్డులను సక్రమంగా నిర్వహించకపోవడంపై సిబ్బందిపై మండిపడ్డారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News July 11, 2024

ప్రకాశం: ప్రియురాలే హత్య చేసింది 

image

సింగరాయకొండ జాతీయ రహదారి వద్ద ఈనెల 6వతేదీ జరిగిన యువకుడి హత్య కేసులో ప్రియురాలిని అరెస్టు చేసినట్లు సీఐ రంగనాథ్ తెలిపారు. దేవరకొండ గోపి (35) కూలి పనులు చేసుకుంటూ జీవించేవాడు. అతనితో నిందితురాలు లక్ష్మి ఎనిమిదేళ్లుగా సహజీవనం చేస్తోందన్నారు. గత ఆరు నెలలుగా నాగరాజు అనే వ్యక్తితో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ నేపథ్యంలో గోపిని నిందిలిద్దరూ కర్రలతో కొట్టి హత్య చేశారు. నాగరాజు పరారీలో ఉన్నాడన్నారు. 

News July 11, 2024

తిరుపతి: భార్య మృతదేహాన్ని ముళ్లచెట్లలో పడేసిన భర్త

image

భార్య మృతదేహాన్ని ముళ్లచెట్లలో భర్త పడేసిన ఘటన తిరుపతిలో జరిగింది. సీఐ జయనాయక్ వివరాల ప్రకారం.. ఒరిశాకు చెందిన ఓ బేల్దారి బాబురావు ఇద్దరు భార్యలతో తిరుపతికి వచ్చి వేర్వేరు కాపురం పెట్టాడు. బాబురావు రాత్రివేళల్లో మద్యం తాగి రెండోభార్య మిత్తాషబార్(29)తో రోజూ గోడవపడేవాడు. ఆమె ఇంట్లో ఉరికి వేలాడుతూ విగతజీవిగా కన్పించగా మృతదేహాన్ని గోనెసంచిలో వేసుకుని కరకంబాడి రోడ్డులోని ముళ్లచెట్లలో పారేశాడు.

News July 11, 2024

ఉచిత ఇసుక అనేది అబద్ధం: MLC గోవిందరెడ్డి

image

TDP ప్రభుత్వం చెప్పిన ఉచిత ఇసుక అనేది అబద్ధమని MLC డీసీ గోవిందరెడ్డి విమర్శించారు. ఉచిత ఇసుక మాటలకే పరిమితమైందని, చంద్రబాబు కొత్త రకం దోపిడీకి తెరలేపారన్నారు. జగన్ హయాంలో పారదర్శకంగా ఇసుకను అందజేయడంతో రూ.కోట్ల ధనం ప్రభుత్వ ఖజానాలోకి వచ్చేదన్నారు. ఇప్పుడు ఆ డబ్బంతా టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్తుందని ఆరోపించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రజల నుంచి ఒక్క రూపాయి తీసుకోకుండా ఇసుక ఇవ్వాలన్నారు.