Andhra Pradesh

News July 11, 2024

కృషి విజ్ఞాన కేంద్రంలో నిరుద్యోగ యువతకు శిక్షణ తరగతులు

image

గుంటూరు లాంఫామ్ వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రంలో గ్రామీణ యువతకు ఆరురోజుల శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కేవీకే ప్రధాన శాస్త్ర వేత్త డాక్టర్ ఎం.యుగంధర్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 15 నుంచి 20వ తేదీవరకు ఆరు రోజులపాటు నిర్వహించే శిక్షణ కార్యక్రమంలో వానపాముల నుంచి ఎరువు తయారీపై శిక్షణ ఉంటుందన్నారు.

News July 11, 2024

విశాఖలో డ్యూక్ బైక్ ఢీ.. మరొకరు మృతి

image

విశాఖలో <<13598823>>డ్యూక్ బైక్‌<<>>తో మంగళవారం రాత్రి ఓ యువకుడు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. మాధవధార నుంచి వెళుతూ జ్యోతినగర్ వద్ద రోడ్డు దాటుతున్న ఇద్దరిని కంచరపాలెం నుంచి వస్తున్న క్రాంతి బలంగా ఢీకొట్టి కొంత దూరం ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనలో త్రినాథరావు అక్కడికక్కడే మృతి చెందగా.. సన్యాసిరావు తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. వీరిద్దరూ రోజువారి కూలీలే. ఈ ఘటనలో బైకర్‌కు స్వల్పగాయాలయ్యాయి.

News July 11, 2024

జోగి చుట్టూ కేసుల ఉచ్చు

image

ప్రభుత్వం జప్తు చేసిన భూములను కబ్జా చేసిన వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేశ్‌పై విచారణ ప్రారంభమైంది. ఈ వ్యవహారంలో కొందరు అవినీతికి, అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. మరింత లోతైన విచారణకు DGP ఏసీబీని ఆదేశించారు. ఇప్పటివరకు విచారణలో తేలిన అంశాల మేరకు జోగిపై కేసు నమోదు చేసే అవకాశమున్నట్లు సమాచారం. అరెస్టు ముప్పూ పొంచి ఉండటంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు.

News July 11, 2024

తూ.గో: ఏడుగురి మృతికి కారణం.. జైలు పాలు

image

తూ.గో జిల్లాకు చెందిన ఏడుగురి మృతికి కారణమైన షేక్ మహబూబ్ జానీ అనే వ్యక్తికి యావజ్జీన కారాగార శిక్ష పడింది. వీరవల్లి ఏఎస్సై వివరాల మేరకు..2014లో ప్రమాదకర రసాయనాలు ఉన్న డ్రమ్ములను హైదరాబాద్ నుంచి తణుకుకు బయలుదేరాడు. దారి మధ్యలో తూ.గో జిల్లా వాసులు ఏడుగురిని వ్యానులో ఎక్కించుకున్నాడు. రసాయనాల నుంచి మంటలు వ్యాపించడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు . దీనిపై బుధవారం నూజివీడు న్యాయస్థానం తీర్పు చెప్పింది.

News July 11, 2024

నేడు విశాఖకు సీఎం చంద్రబాబు.. షెడ్యూల్ ఇదే

image

ఉమ్మడి విశాఖ పర్యటనలో భాంగా సీఎం చంద్రబాబు ఈరోజు ఉ. 11 గంటలకు ఎస్.రాయవరం మండలం దార్లపూడి వద్ద పోలవరం ఎడమ కాలువ పనులను పర్యవేక్షిస్తారు. అనంతరం హెలికాప్టర్లో 12 గంటలకు బయలుదేరి భోగాపురం విమానాశ్రయం నిర్మాణ ప్రాంతానికి వెళ్తారు. తిరిగి మధ్యాహ్నం1:35కు బయలుదేరి పెదగంట్యాడ మండలం మెడ్‌టెక్ జోన్‌కు బయలుదేరుతారు. సాయంత్రం 4:45 నిమిషాలకు ఎయిర్ పోర్టుకు చేరుకుని అధికారులతో సమీక్షిస్తారు.

News July 11, 2024

హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించి

image

భార్యను హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించిన ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. ఇల్లూరుకు చెందిన ఎర్రిస్వామి, సువర్ణ(26) దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త ఓ మహిళతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడన్న అనుమానంతో భార్య గొడవపడేది. నిన్న ఇద్దరూ గొడవపడగా భర్త భార్యను కొట్టడంతో ఆమె మృతిచెందింది. ఆ తర్వాత ఉరేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News July 11, 2024

శ్రీకాకుళం: ఉద్యోగాల పేరుతో మోసం

image

ఓ ప్రభుత్వ ఉద్యోగి ఉద్యోగాల పేరుతో మోసం చేశాడు. శ్రీకాకుళం 1టౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మందస మండలంలో విధులు నిర్వర్తిస్తున్న ఓ పంచాయతీ కార్యదర్శి శ్రీకాకుళం శ్రీనివాసనగర్‌ కాలనీలో వాచ్‌మెన్‌ గౌరీశంకర్‌కు ప్రభుత్వ వాహనం ఇప్పిస్తానని రూ.1.36 లక్షలు, కుమారుడికి ఉద్యోగం వేయిస్తానని రూ.లక్ష లాగేశాడని పోలీసులు తెలిపారు. మోసపోయానని గుర్తించి బాధితుడు ఫిర్యాదు చేశారన్నారు.

News July 11, 2024

కడప: ‘విద్యుత్ సమస్యనా.. ఈ నంబర్‌కు వాట్సాప్‌లో పంపండి ‘

image

ప్రజలు వ్యయ ప్రయాసలకు గురి కాకుండా వాలిపోయిన స్తంభాలు, తక్కువ ఎత్తులో ఉన్న లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు వంటి విద్యుత్ సమస్యలను వాట్సాప్‌ ద్వారా తెలపాలని విద్యుత్ శాఖ అధికారి రమణ అన్నారు. ఈ మేరకు ఫిర్యాదుదారుని పేరు, చిరునామా, వారి చరవాణితో వాట్సాప్‌ నంబర్ 9440814264కు పంపించాలని కోరారు. హెల్ప్‌ డెస్క్‌ సిబ్బంది సంబంధిత అధికారులకు తెలిపి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు అనుసరిస్తారని వివరించారు.

News July 11, 2024

లభించని బాలిక ఆచూకీ

image

పగిడ్యాల మండలం ఎల్లాలలో అదృశ్యమైన బాలిక ఆచూకీ లభ్యం కాలేదు. నిన్న చీకటిపడే వరకు గాలించినా ఫలితం లేదు. పోలీసులు ముగ్గురు బాలురను అదుపులోకి తీసుకుని విచారించారు. బాలికపై లైంగిక దాడికి పాల్పడి, హత్యచేసి హంద్రీనీవా కాలువలో పడేసినట్లు ఒప్పుకున్నారని తెలిపారు. గాలింపు చేపట్టినా ఆచూకీ లభ్యం కాలేదు. వారిని గట్టిగా ప్రశ్నించడంతో పంపుహౌస్‌ సమీపంలో పడేసినట్లు చెప్పడంతో ఆ ప్రాంతంలో గాలిస్తున్నారు.

News July 11, 2024

విజయనగరం: టీచర్ ఖాతా నుంచి నగదు మాయం

image

గజపతినగరం మండలానికి చెందిన ఓ ఉపాధ్యాయుడి బ్యాంకు ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు రూ.1.40 లక్షలు తస్కరించారు. ఈ మేరకు ఆయన బుధవారం గజపతినగరం సబ్ ఇన్స్పెక్టర్ మహేశ్‌కు ఫిర్యాదు చేశారు. నగదు ఖాతా నుంచి డెబిట్ అయినట్లు సంక్షిప్త సందేశాలు వచ్చాయని, బ్యాంక్ ఖాతాను పరిశీలిస్తే సొమ్ము లేదని వాపోయారు.