Andhra Pradesh

News July 11, 2024

ఎస్.రాయవరం: సీఎం పర్యటనకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు

image

ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 11న ఎస్.రాయవరం మండలం దార్లపూడిలో పర్యటించనున్న నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు విశాఖ రేంజ్ డీఐజీ విశాల్ గున్ని తెలిపారు. దార్లపూడిలో సీఎం భద్రతా ఏర్పాట్లపై అనకాపల్లి కలెక్టర్ విజయ కృష్ణన్, ఎస్పీ మురళీకృష్ణతో సమీక్షించారు. భద్రత ఏర్పాట్లపై నిర్లక్ష్యం వహించవద్దని పోలీస్ సిబ్బందిని ఆదేశించారు.

News July 11, 2024

కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం

image

ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని పలు ప్రాంతాలలో గురువారం అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) అధికారులు తెలిపారు. ఈ మేరకు APSDMA అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. అటు పొరుగున ఉన్న గుంటూరు, బాపట్ల జిల్లాలలో సైతం రేపు అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడతాయని APSDMA వర్గాలు పేర్కొన్నాయి.

News July 11, 2024

సీఎం బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన డీఐజీ

image

భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులను పరిశీలించేందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్న నేపథ్యంలో భద్రతా, బందోబస్తు ఏర్పాట్లను విశాఖపట్నం రేంజ్ డీఐజీ విశాల్ గున్ని బుధవారం పరిశీలించారు. జిల్లా ఎస్పీ దీపిక పాటిల్‌తో కలిసి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం పోలీస్ అధికారులు, సిబ్బందికి పలు భద్రతాపరమైన సూచనలు అందజేశారు.

News July 11, 2024

డెంగ్యూ వ్యాధిపై ప్రకాశం కలెక్టర్ సమీక్ష

image

కలెక్టర్ తమీమ్ అన్సారియా డెంగ్యూ మాసోత్సవంపై బుధవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎక్కడ డెంగ్యూ కేసులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో పనిచేస్తున్న ఎ.ఎన్.ఎంలు విధిగా వారికి కేటాయించిన ఇండ్లను సందర్శించి జ్వరంతో బాధపడుతున్న వారి వివరాలను నమోదు చేయాలన్నారు.

News July 11, 2024

15న జిల్లాస్థాయి సాప్ట్ బాల్ ఎంపిక పోటీలు

image

ఈ నెల 15న ఔట్‌డోర్ స్టేడియంలో జిల్లాస్థాయి సీనియర్స్ సాప్ట్ బాల్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సాఫ్ట్ బాల్ సంఘం కార్యదర్శి విజయ్ కుమార్ బుధవారం తెలిపారు. జిల్లా స్థాయిలో క్రీడా నైపుణ్యాలను కనబరచిన వారు ఆగస్టు నెలలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు 4 పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలతో హాజరు కావచ్చని వెల్లడించారు.

News July 11, 2024

SKLM: పాఠశాలల్లో పరిశుభ్రత పాటించాలి: కలెక్టర్

image

జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలను పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచించారు. బుధవారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విద్యా శాఖపై సమీక్షలో భాగంగా మాట్లాడారు. విద్యా సంస్థల ఆవరణ, తరగతి గదుల్లో ఎలాంటి చెత్త, చెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణకు పెద్దపీట వేయాలని స్పష్టం చేశారు.

News July 11, 2024

కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రి ఆనం

image

విజయవాడలోని శ్రీ కనకదుర్గ అమ్మవారిని కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మకూరు ఎమ్మెల్యే, రాష్ట్ర దేవదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి బుధవారం దర్శించుకున్నారు. వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం వారికి అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రములు, చిత్రపటం అందజేశారు. ఆలయం నందు జరుగుతున్న అభివృద్ధి పనులు గురించి ఈవో వివరించారు.

News July 11, 2024

హాకీ రాష్ట్ర జట్టుకు జిల్లా క్రీడాకారుల ఎంపిక

image

హాకీ ఏపీ రాష్ట్ర జట్టుకు జిల్లా క్రీడాకారులు ఎంపికయ్యారు. హాకీ శ్రీ సత్యసాయి జిల్లా జనరల్ సెక్రటరీ సూర్యప్రకాశ్ తెలిపారు. వారు మాట్లాడుతూ.. ఈనెల 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు కడప జిల్లా పులివెందులలో జరగనున్న దక్షిణాది రాష్ట్రాల జూనియర్ బాలుర, బాలికల హాకీ ఛాంపియన్‌షిప్ పోటీలలో రాష్ట్ర జట్టుకు శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన మహబూబ్ బాషా, పవిత్ర, సింధు, నసీమా ఎంపికయ్యారు.

News July 11, 2024

ఒంటిమిట్ట: జులై 21న స్వామివారి పౌర్ణమి కళ్యాణం

image

ఒంటిమిట్ట కోదండ రామాలయంలో జులై 21న స్వామివారి పౌర్ణమి కళ్యాణం నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు బుధవారం వెల్లడించారు. రూ.1,000 ఆన్‌లైన్ ద్వారా గానీ, నేరుగా ఆలయంలో గాని సమర్పించి కళ్యాణంలో ఉభయదారులుగా వ్యవహరించవచ్చని వారు తెలిపారు. జులై 21న వ్యాస పౌర్ణమి కూడా ఉందని చెప్పారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.

News July 11, 2024

పాడేరు: ‘ఈనెల 11 నుంచి సూపర్ 50 శిక్షణ తరగతులు’

image

10వ తరగతి విద్యార్థులకు ఈనెల 11వ తేదీ నుంచి సూపర్ 50 శిక్షణ తరగతులు నిర్వహిస్తామని ఐటీడీఏ పీవో వీ.అభిషేక్ తెలిపారు. విద్యార్థులు సూపర్ 50ని సద్వినియోగం చేసుకుని, 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించి, కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో సీట్లు సంపాదించాలని సూచించారు. బుధవారం ఐటీడీఏ కార్యాలయంలో విద్యార్థులు, తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. విద్యార్థులను పండుగలకు ఇంటికి పంపించరని చెప్పారు.