Andhra Pradesh

News July 11, 2024

మంగళగిరి- తాడేపల్లి కమిషనర్ బదిలీ

image

మంగళగిరి – తాడేపల్లి కార్పోరేషన్ కమిషనర్ నిర్మల్ కుమార్‌ని బదిలీ చేస్తూ బుధవారం అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. ఆయన్ను బాపట్ల మున్సిపల్ కమిషనర్‌గా.. సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్‌గా పనిచేస్తున్న షేక్ అలీమ్ బాషా‌ను ఎంటీఎంసీ కమిషనర్ గా నియమించారు. అలానే బాపట్ల మున్సిపల్ కమిషనర్ బి.శ్రీకాంత్‌ను ఎంటీఎంసీ డిప్యూటీ కమిషనర్‌గా బదిలీ చేశారు. ఇక్కడి డిప్యూటీ కమిషనర్ శివారెడ్డిని సీడీఎంఏకి అటాచ్ చేశారు.

News July 11, 2024

బందరు పోర్టు పురోగతిపై నివేదికలు ఇవ్వండి: కలెక్టర్

image

బందరు పోర్టు నిర్మాణ పనుల పురోగతిపై ప్రతివారం ప్రగతి నివేదికలు ఇవ్వాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. పోర్టు, జలజీవన్ మిషన్ కింద జరుగుతున్న పనులపై బుధవారం ఆయన సంబంధిత శాఖాధికారులతో సమీక్షించారు. పోర్టు నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. రోడ్ కం రైల్ కనెక్టివిటీకి సంబంధించి భూసేకరణపై దృష్టిసారించాలన్నారు.

News July 11, 2024

ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జయప్రదం చేయండి: కలెక్టర్

image

కుటుంబ సంక్షేమ, ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు ప్రపంచ జనాభా అవగాహన దినోత్సవాన్ని జయప్రదం చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. కలెక్టర్ ఛాంబర్ నందు కుటుంబ సంక్షేమ, ఆరోగ్య శాఖ నేషనల్ హెల్త్ మిషన్ లో ప్రపంచ జనాభా దినోత్సవ బ్యానర్ ను, పోస్టర్లను కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.శ్రీహరి ఇతర వైద్య సిబ్బందితో కలిసి ఆవిష్కరించారు.

News July 11, 2024

తూ.గో.: మంత్రులు కలిసిన ‘పిల్లి’ దంపతులు

image

విజయవాడలో మంత్రులు వాసంశెట్టి సుభాష్, కొల్లు రవీంద్ర, గొట్టిపాటి రవి కుమార్‌లను బుధవారం కాకినాడ రూరల్ టీడీపీ కో-ఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణ మూర్తి, మాజీ MLA పిల్లి అనంత లక్ష్మి దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రులను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

News July 11, 2024

ఏలూరు: ‘దత్తత తీసుకున్న పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దాలి’

image

తెలంగాణ రాష్ట్రానికి చెందిన సురేందర్, మహాలక్ష్మి దంపతులకు ఏలూరు శిశు గృహంలో ఆశ్రయం పొందుతున్న 3 నెలల వయస్సు గల మనోజ్ అనే బాబును జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సమక్షంలో దత్తత తల్లిదండ్రులకు బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ నిబంధనల ప్రకారం 2021లో వీరు దత్తత కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. దత్తత తీసుకున్న పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దాలన్నారు.

News July 10, 2024

హత్య కేసులో నిందితులను అరెస్టు చేస్తాం: ఎస్పీ గౌతమిశాలి

image

రాయదుర్గం మండలం మెచ్చిరి గ్రామానికి చెందిన ఆదికేశవులు హత్యకేసులో నిందితులను త్వరగా అరెస్టు చేయాలని ఎస్పీ గౌతమిశాలి ఆదేశించారు. ఎవరినీ వదలకుండా దర్యాప్తు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. నిందితులకు శిక్షలు పడేలా తగిన ఆధారాలు సేకరించాలని సూచించారు. ఈ తరహా ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా పటిష్ఠ నిఘా వేయాలన్నారు. మెచ్చిరి నుండి కర్నాటకలోని నాగసముద్రానికి వెళ్లే రహదారిపై ఘటనా స్థలాన్ని ఆమె పరిశీలించారు.

News July 10, 2024

శ్రీకాకుళం జిల్లాలో TODAY TOP NEWS

image

☞ మద్యం మత్తులో యువతీపై లైంగిక దాడికి యత్నించిన యువకుడు ☞ కప్పకర్ర చెరువు ఆక్రమణ కొనసాగుతున్న కోర్టు వివాదం ☞ ఆర్థిక ఇబ్బందులతో హోంగార్డ్ ఆత్మహత్య ☞ వాలంటీర్ల రాజీనామాలపై నోటీసులు జారీ ☞ టెక్కలిలో ఇసుక కోసం క్యూ కట్టిన ట్రాక్టర్లు ☞ వైసీపీ సోషల్ మీడియా సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి: గౌతు శిరీష ☞ విద్యార్థుల్లో ఆత్మ స్థైర్యాన్ని నింపాలి: కలెక్టర్ ☞ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్సిటీలో పాలనా నియామకాలు

News July 10, 2024

కడప జిల్లా TODAY టాప్ న్యూస్

image

➤ IIITలో గంజాయి.. లోకేశ్ ఆగ్రహం
➤ కడప హైవేపై రోడ్డు ప్రమాదం
➤ కడప టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మృతి
➤ ఒంటిమిట్టలో నీళ్లు లేక భక్తుల ఇక్కట్లు
➤ జగన్ రాజీనామా వార్తల్లో నిజం లేదు: సురేశ్
➤ కొండాపురంలో ఏడుగురి అరెస్ట్
➤ సీఎంకు మండిపల్లి పాలాభిషేకం
➤ పౌర సరఫరాల శాఖలో భారీ అవినీతి: ఎమ్మెల్సీ రాం గోపాల్ రెడ్డి

News July 10, 2024

విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం

image

విజయవాడ వన్ టౌన్ మెయిన్‌రోడ్‌లో విజయా కాంప్లెక్స్‌లోని కృష్ణ బ్యాంగిల్స్ షాప్‌లో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఫ్యాన్సీ సామగ్రి, పైపులు అగ్నికి ఆహుతయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కృష్ణ బ్యాంగిల్స్ దుకాణంలో అగ్నిప్రమాదం జరిగి మంటలు వ్యాపించాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.

News July 10, 2024

కృష్ణా: రేపు త్రిబుల్ ఐటీ అభ్యర్థుల జాబితా విడుదల

image

రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ పరిధిలో ఉన్న నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం త్రిబుల్ ఐటీలకు సంబంధించిన అడ్మిషన్లలో భాగంగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఈనెల 11న ఉదయం 11 గంటలకు ఛాన్సలర్ ఆచార్య కేసిరెడ్డి విడుదల చేయనున్నట్లు ట్రిపుల్ ఐటీ వర్గాలు తెలిపాయి. నూజివీడు ట్రిపుల్ ఐటీలోని స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్‌లో ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు.