Andhra Pradesh

News July 10, 2024

శ్రీకాకుళం: పీజీ పరీక్షల టైం టేబుల్ విడుదల

image

ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో ఎంఏ కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్ థియరీ పరీక్షల టైంటేబుల్ విడుదలైంది. జూలై 25 నుంచి ఆగస్టు 5 మధ్య జరగనున్న ఈ పరీక్షలను ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకూ యూనివర్సిటీ పరీక్షల విభాగం ఆయా కేంద్రాలలో నిర్వహించనుంది. సబ్జెక్టువారీగా షెడ్యూల్ వివరాలకై విద్యార్థులు https://exams.andhrauniversity.edu.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవచ్చు.

News July 10, 2024

నెల్లూరులో గంజాయి ముఠా అరెస్ట్

image

నెల్లూరు నగరంలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముఠాను నవాబ్ పేట పోలీసులు ఆట కట్టించారు. ఏఎస్పీ సిహెచ్ సౌజన్య మాట్లాడుతూ.. రాబడిన సమాచారం మేరకు ఐదుమంది ముద్దాయిలను అరెస్ట్ చేసి 2 కేజీల 200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. గంజాయి రహిత జిల్లాగా తీర్చి దిద్దటమే లక్ష్యంగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నిఘా బృందాలతో నవాబ్ పేట ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు.

News July 10, 2024

ఎన్టీఆర్: జగన్ పాలనలో వ్యవస్థలు కుదేలు- మాజీ మంత్రి

image

జగన్ విధ్వంస పాలనలో వ్యవస్థలు కుదేలయ్యాయని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్వీట్ చేశారు. అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే చంద్రబాబు రాష్ట్రాన్ని అన్నివిధాలుగా గాడిలో పెట్టే పని మొదలుపెట్టారని ఉమ వ్యాఖ్యానించారు. సంపద సృష్టి ద్వారా టీడీపీ ప్రభుత్వం పేదరిక నిర్మూలనకు ప్రణాళికలు చేపడుతోందని ఉమ ఈ మేరకు Xలో పోస్ట్ చేశారు.

News July 10, 2024

పులిచెర్ల : కమలాపురంలో వర్షం

image

పులిచెర్ల మండలం కమలాపురంలో వాతావరణం పూర్తిగా మారింది. ఒక గంట క్రితం నుంచి వర్షం భారీగా కురుస్తోంది. దీనితో చెట్లు, కొమ్మలు విరిగిపడే అవకాశం ఉన్నందువలన స్థానికులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలిపారు. పిడుగులు పడే అవకాశాలు ఉన్నందున పంట పొలాలు దగ్గరికి వెళ్లకూడదని అన్నారు.

News July 10, 2024

బనగానపల్లెలో వైఎస్సార్ విగ్రహం ధ్వంసం

image

టీడీపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సొంత గ్రామమైన బనగానపల్లె మండలం యనకండ్లలో గుర్తుతెలియని వ్యక్తులు వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. చేయి విరగ్గొట్టి, ముఖానికి తారు పూశారు. బత్తులూరులో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఏర్పాటు చేసిన మినరల్ వాటర్‌కు వైఎస్ జగన్, ఎమ్మెల్యే రామిరెడ్డి ఫొటోలకు బ్లాక్ రంగుతో శిలాఫలకాలు నాశనం చేశారు.

News July 10, 2024

శ్రీకాకుళం: పీజీ పరీక్షల టైం టేబుల్ విడుదల

image

ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో ఎంఏ కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్ థియరీ పరీక్షల టైంటేబుల్ విడుదలైంది. జూలై 25 నుంచి ఆగస్టు 5 మధ్య జరగనున్న ఈ పరీక్షలను ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకూ యూనివర్సిటీ పరీక్షల విభాగం ఆయా కేంద్రాలలో నిర్వహించనుంది. సబ్జెక్టువారీగా షెడ్యూల్ వివరాలకై విద్యార్థులు https://exams.andhrauniversity.edu.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవచ్చు.

News July 10, 2024

జగన్‌‌ను కలిసిన ప్రకాశం జిల్లా YCP కీలక నేతలు

image

గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్ కేపి.నాగార్జున రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసులు రెడ్డి బుధవారం మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఓటమితో ఎవరు అధైర్యపడాల్సిన పనిలేదని, ప్రజా సమస్యలపై పోరాడాలని జగన్ వారికి సూచించారు. పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఎల్లవేళలా అండగా ఉంటానని జగన్ చెప్పారన్నారు.

News July 10, 2024

శ్రీకాకుళం: నిరుద్యోగులకు గుడ్ న్యూస్

image

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) నిరుద్యోగులకు ఆన్‌లైన్‌లో సేల్స్ ఫోర్స్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనుంది. ఈ శిక్షణ జూలై 15 నుంచి 30 వరకు రోజుకు 2 గంటలపాటు ఇస్తామని APSSDC పేర్కొంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, పూర్తి వివరాలకు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ హెల్ప్ లైన్ నెంబరులో సంప్రదించాలని, APSSDC అధికారిక వెబ్‌సైట్ చూడాలని సూచించింది.

News July 10, 2024

కృష్ణా: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన APSSDC

image

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) నిరుద్యోగులకు ఆన్‌లైన్‌లో సేల్స్ ఫోర్స్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనుంది. ఈ శిక్షణ జూలై 15 నుంచి 30 వరకు రోజుకు 2 గంటలపాటు ఇస్తామని APSSDC పేర్కొంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, పూర్తి వివరాలకు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ హెల్ప్ లైన్ నంబరులో సంప్రదించాలని, అధికారిక వెబ్‌సైట్ చూడాలని సూచించింది.

News July 10, 2024

సరికొత్త కార్యక్రమానికి చిత్తూరు ఎమ్మెల్యే శ్రీకారం

image

ప్రజల సమస్యల పరిష్కారం కోసం చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి గురువారం డైలీ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతి గురువారం ఉదయం 10గంటల నుంచి 11 గంటల వరకు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఎమ్మెల్యే స్వయంగా పాల్గొని ఫోన్ ద్వారా సమస్యలను స్వీకరిస్తారు.