Andhra Pradesh

News July 10, 2024

విశాఖ జనాభా గత ఏడాది కంటే 2.32 శాతం వృద్ధి

image

విశాఖ నగర జనాభా 23.85 లక్షలకు చేరింది. గత ఏడాది కంటే 2.32 శాతం వృద్ధి సాధించింది. 2021లో విశాఖ జనాభా 22.26 లక్షలు ఉండగా, 2022లో 22.78 లక్షలు, 2023లో 23.31 లక్షలుగా నమోదయింది. గురువారం ప్రపంచ జనాభా దినోత్సవం పురస్కరించుకొని ఏయూలోని పీ.ఆర్.సీ కేంద్రం సంచాలకులు ఆచార్య బీ.మునిస్వామి వివరాలను వెల్లడించారు. అత్యంత జనసాంద్రత కలిగిన జిల్లాగా.. తక్కువ విస్తీర్ణం కలిగిన జిల్లాగా కూడా విశాఖ నిలుస్తోంది.

News July 10, 2024

అనంత జిల్లాలో మహిళా ఆత్మహత్య

image

కళ్యాణదుర్గం మండలం మల్లికార్జునపల్లిలో మమత(24) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మమత మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతురాలికి భర్త శాంతి కుమార్, ఒక కూతురు ఉన్నారు.

News July 10, 2024

చేజర్ల: మంత్రి ఫ్లెక్సీ చించివేత

image

చేజర్ల మండల పరిధిలోని ఆదూరుపల్లి గ్రామంలో ఆత్మకూరు ఎమ్మెల్యే, రాష్ట్ర దేవదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి జన్మదినం సందర్భంగా టీడీపీ నాయకులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. మంత్రి ఫ్లెక్సీని ఓవ్యక్తి చించుతుండగా టీడీపీ నేత చీర్ల వెంకటేశ్వర్లు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వ్యక్తిపై చర్యలు తీసుకొని, ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని కోరారు.

News July 10, 2024

కర్నూలు: ఎడారిగా మారిన తుంగభద్ర నది

image

వర్షాభావం వల్ల తుంగభద్ర నది ఎడారిగా మారింది. కర్నూలు జిల్లా కౌతాళం మండలం నదిచాగి పంచాయతీ పరిధిలో తుంగభద్ర నది ఆంధ్రలో ప్రవేశిస్తుంది. వర్షాకాలం ప్రారంభమైనా ఇప్పటివరకు నదిలో నీళ్లు లేక ఎడారిగా మారింది. నది తీరాన ఉన్న రైతులు వరి సాగు కోసం నారుమళ్లు వేసి నీటి కోసం ఎదురుచూస్తున్నారు. ఆనకట్ట పైభాగాన వర్షాభావంతో నీటి నిల్వ గణనీయంగా తగ్గడమే ఇందుకు కారణమని డ్యాం అధికారులు తెలిపారు.

News July 10, 2024

శ్రీకాకుళం: పలు రైళ్ల గమ్యస్థానాల్లో మార్పులు

image

భద్రతా పనులు జరుగుతున్నందున విశాఖపట్నం, పలాస మధ్య ప్రయాణించే రైళ్ల గమ్యస్థానాల్లో మార్పులు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు వాల్తేరు డివిజన్ రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 11,13 తేదీల్లో నం.07470 విశాఖపట్నం- పలాస ట్రైన్‌ శ్రీకాకుళం రోడ్ వరకు మాత్రమే నడుపుతామని, నం.07471 పలాస- విశాఖపట్నం ట్రైన్‌ను శ్రీకాకుళం రోడ్ నుంచి విశాఖపట్నంకు నడుపుతామన్నారు.

News July 10, 2024

శ్రీకాకుళం: వాలంటీర్ల రాజీనామాలపై నోటీసులు జారీ

image

ఏపీలో గ్రామ సచివాలయాల వాలంటీర్లు వారి హక్కులను విస్మరించి బలవంతంగా రాజీనామాలు చేయించడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని ఆమదాలవలస మండలం న్యాయవాది పైడి విశ్వేశ్వరరావు బుధవారం అన్నారు. ఈ మేరకు దిల్లీ ఎన్‌హెచ్‌ఆర్‌సిలో పిటిషన్ దాఖలు చేశామన్నారు. దీనికి తగ్గట్టుగా తగు చర్యలు తీసుకోవాలని నోటీసులు జారీ అయ్యాయని తెలిపారు.

News July 10, 2024

కృష్ణా: ప్రయాణికుల రద్దీ మేరకు వన్ వే స్పెషల్ ట్రైన్

image

ప్రయాణికుల రద్దీ మేరకు మచిలీపట్నం- నాగర్‌సోల్(నం.07169) మధ్య వన్ వే స్పెషల్ ట్రైన్ నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ట్రైన్ జులై 15న మధ్యాహ్నం 12.20 గంటలకు మచిలీపట్నంలో బయలుదేరి 16వ తేదీ మధ్యాహ్నం 1.30 గంటలకు నాగర్‌సోల్ చేరుకుంటుందన్నారు. ఏపీలో ఈ ట్రైన్ గుడివాడ, విజయవాడ, మంగళగిరి, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్లలో ఆగుతుందని రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.

News July 10, 2024

వంతెన కోసం ఎంతో కృషి చేశా: మురళీ మోహన్

image

తాను ఎంపీగా ఉన్నప్పుడే మోరంపూడి ఫ్లైఓవర్ వంతెన కోసం కృషి చేశానని మాజీ ఎంపీ మురళీ మోహన్ అన్నారు. మోరంపూడి సెంటర్‌లో జరిగిన ప్రమాదాలను అప్పటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లి వంతెన నిర్మాణ పనులు మంజూరు చేయించానని తెలిపారు. వైసీపీ ఎంపీ మార్గాని భరత్ వంతెన నిర్మాణ పనులు ఆయనే మంజూరు చేయించినట్టు ప్రచారం చేసుకోవటం సరికాదన్నారు.

News July 10, 2024

పౌర సరఫరాల శాఖలో భారీ అవినీతి: ఎమ్మెల్సీ

image

గత వైసీపీ ప్రభుత్వంలో పౌర సరఫరాల శాఖలో భారీ అవినీతి జరిగిందని టీడీపీ ఎమ్మెల్సీ రాం గోపాల్ రెడ్డి ఆరోపించారు. పులివెందులలో ఆయన మాట్లాడుతూ.. బియ్యం మిల్లర్ల నుంచి గోడౌన్‌కు వచ్చే సమయంలో వైసీపీ నేతల ద్వారా భారీగా పక్క దారి పట్టయన్నారు. జిల్లాలో ఈ దోపిడీపై క్షేత్రస్థాయిలో పర్యటించి అవినీతిని బయటకు తీస్తానని స్పష్టం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్రంగా విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.

News July 10, 2024

కాశినాయన: విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్

image

విద్యార్థులకు పోషక విలువలతో కూడిన నాణ్యమైన భోజనం పెట్టాలని జిల్లా కలెక్టర్ శివ శంకర్ అన్నారు. కాశినాయన మండలంలోని నరసాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలు, మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.