Andhra Pradesh

News July 10, 2024

నంద్యాల: గుండెపోటుతో ఉద్యోగి మృతి

image

నంద్యాల మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కాకర్ల వెంకట రామారావు గుండెపోటుతో మృతిచెందారు. ఇవాళ ఉదయం తన ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలారు. ఆసుపత్రికి తీసుకు వెళ్లగా అప్పటికే చనిపోయారు. వీరి స్వస్థలం గిద్దలూరు మండలం రాజుపేట గ్రామం. చిన్న వయసులోనే ఆయన మృతిచెందారని పలువురు ఉద్యోగులు సంతాపం తెలిపారు. ఆయన అంత్యక్రియలు ఇవాళ మధ్యాహ్నం రాజుపేట గ్రామంలో జరుగుతాయని బంధువులు వెల్లడించారు.

News July 10, 2024

నిడదవోలు నుంచి విశాఖకు కొత్త సర్వీస్ ప్రారంభం

image

నిడదవోలు ఆర్టీసీ డిపో అభివృద్ధికి దశలవారీగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. నిడదవోలు ఆర్టీసీ డిపో నుంచి విశాఖపట్నానికి నూతన సర్వీసును బుధవారం ఆయన ప్రారంభించారు. గత పాలనలో ఆర్టీసీ డిపో అభివృద్ధి వెనక్కి పోయిందన్నారు. తాము డిపో అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు.

News July 10, 2024

రేగిడి: హోంగార్డ్ ఆత్మహత్య

image

రాజం పోలీసుస్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న ఘటన రేగడి మండలంలో జరిగింది. మండలంలోని లచ్చరాయపురానికి చెందిన శ్రీనివాసరావు ఈ నెల 8న గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. గమనించిన స్థానికులు రాజాం ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం శ్రీకాకుళం తరలించారు. చికిత్సపొందుతూ బుధవారం మృతిచెందినట్లు కుటుంబీకులు తెలిపారు.

News July 10, 2024

ప్రకాశం: ఇంటర్ పాసైన వారికి సర్టిఫికెట్లు సిద్ధం

image

2024లో ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థుల ఉత్తీర్ణత సర్టిఫికెట్లు సిద్ధంగా ఉన్నాయని ఆర్ఐఓ ఎ.సైమన్ విక్టర్ తెలిపారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాలు, జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లు మార్చి, అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల ఉత్తీర్ణత సర్టిఫికెట్లను బుధవారం ఉదయం ఆర్ఐవో కార్యాలయం నుంచి తీసుకెళ్లాలన్నారు. వాటిని తిరిగి విద్యార్థులకు పంపిణీ చేయాలన్నారు.

News July 10, 2024

సింహాద్రి అప్పన్న గిరిప్రదక్షిణ రూట్ మ్యాప్ ఇదే

image

ఈనెల 20న జరిగే సింహాద్రి అప్పన్న గిరి ప్రదర్శనకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 32 కిలోమీటర్ల మేర జరిగే ప్రదక్షిణలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. సింహాచలం, అడివివరం, బి.ఆర్.టీ.ఎస్ రహదారి మీదుగా, ముడసర్లోవ, హనుమంతువాక, వెంకోజిపాలెం, సీతమ్మధార, మాధవధార, ఎన్.ఎ.డి కూడలి నుంచి గోపాలపట్నం మీదుగా సింహాచలం వరకు భక్తులు కాలి నడకన చేరుకుంటారు. > Share it

News July 10, 2024

నేటి నుంచి సూర్యలంక బీచ్‌కు పర్యాటకులకు అనుమతి

image

సూర్యలంక బీచ్‌‌కు నేటి నుంచి పర్యాటకులను అనుమతిస్తున్నట్లు బాపట్ల డీఎస్పీ తెలిపారు. గత నెల రామాపురం బీచ్‌లో జరిగిన వరస ప్రమాదాల నేపథ్యంలో ఈ సముద్ర తీరానికి 15రోజులుగా పర్యాటకులను పోలీసులు అనుమతించలేదు. బుధవారం నుంచి కొన్ని షరతులు విధిస్తూ బీచ్‌లోకి పర్యాటకులను అనుమతిస్తున్నారు. మద్యం తాగి ఎవరూ సముద్రంలోకి వెళ్లవద్దని, అధికారులు చెప్పే సూచనలు పాటించాలని పోలీసులు తెలిపారు.

News July 10, 2024

22 ఏళ్ల క్రితం మూతపడిన ఆలమూరు సబ్ జైలు

image

ఆలమూరు సబ్ జైలు నుంచి 2002 మే 29 ముగ్గురు ఖైదీలు సిబ్బంది కళ్లుగప్పి పారిపోయిన కారణంగా జైలు మూతపడింది. మండపేట, అంగర, ఆలమూరు పోలీసు స్టేషన్లతో పాటు SEB స్టేషన్లలోని రిమాండ్ ఖైదీలను వాయిదాలకు రామచంద్రపురం నుంచి ఆలమూరు కోర్టుకు తీసుకురావాల్సి ఉంది. ఆలమూరు సబ్ జైలు మూసివేయడంతో ఇది పోలీసులకు సవాలుగా మారింది. అధికారులు స్పందించి సబ్ జైలును తెరిపించాలని కోరుతున్నారు.

News July 10, 2024

ప్రకాశం జిల్లాలో విషాదం

image

నరసరావుపేట హైవేపై మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. పెద్దారవీడు మండలం రామాయపాలెంకు చెందిన రమణ గౌడ్ (28), భార్యతో అత్తారింటికి బైకుపై వెళ్తున్నారు. ఈ క్రమంలో గుర్తు తెలియని వాహనం వీరిని ఢీ కొట్టటంతో రమణ గౌడ్ అక్కడికక్కడే మృతి చెందగా, భార్యకి గాయాలయ్యాయి. కాగా వీరికి పెళ్లి అయి ఏడాది గడవకముందే రమణ మృతి చెందాడని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

News July 10, 2024

సింహాద్రి అప్పన్న గిరిప్రదక్షిణ రూట్ మ్యాప్ ఇదే

image

ఈనెల 20న జరిగే సింహాద్రి అప్పన్న గిరి ప్రదర్శనకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 32 కిలోమీటర్ల మేర జరిగే ప్రదక్షిణలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. సింహాచలం, అడివివరం, బి.ఆర్.టీ.ఎస్ రహదారి మీదుగా, ముడసర్లోవ, హనుమంతువాక, వెంకోజిపాలెం, సీతమ్మధార, మాధవధార, ఎన్.ఎ.డి కూడలి నుంచి గోపాలపట్నం మీదుగా సింహాచలం వరకు భక్తులు కాలి నడకన చేరుకుంటారు. > Share it

News July 10, 2024

కాలువను శుభ్రం చేసిన తిరుపతి కలెక్టర్

image

పరిసరాల పరిశుభ్రతతో డయేరియాను అరికట్టవచ్చని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ పేర్కొన్నారు. తిరుపతి రూరల్ మండలం మంగళం పంచాయతీలో అతిసార నియంత్రణ మాసోత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానితో కలిసి కలెక్టర్ స్వయంగా కాలువను శుభ్రం చేశారు. పంచాయతీ కార్మికులతో కలిసి కాలువలోని పూడికలు తొలగించారు. అందరూ పరిసరాలతో పాటు వ్యక్తిగత శుభ్రత పాటించాలని కోరారు.