Andhra Pradesh

News July 10, 2024

విజయవాడ- బిట్రగుంట మెమూ ఎక్స్‌ప్రెస్ రద్దు

image

విజయవాడ నుంచి బిట్రగుంట మధ్య ప్రయాణించే మెమూ ఎక్స్‌ప్రెస్‌లను ట్రాఫిక్ నిర్వహణ కారణాల రీత్యా,  కొద్దిరోజులపాటు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ నెల 29 నుంచి ఆగస్టు 4 వరకు నం.07977 బిట్రగుంట- విజయవాడ, నం.07978 విజయవాడ- బిట్రగుంట మెము ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెల 29 నుంచి ఆగస్టు 2 వరకు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది.

News July 10, 2024

కిడ్నీ కొట్టేసిన ఆసుపత్రిపై చర్యలకు హోం మంత్రి ఆదేశం

image

కిడ్నీ కొట్టేసిన ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని హోం మంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. విజయవాడలో కిడ్నీ రాకెట్ వార్తలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె మంగళవారం గుంటూరు కలెక్టర్, ఎస్పీ విజయవాడ సీపీతో ఫోన్‌లో మాట్లాడారు. ఇలాంటి ఘటనలపై పోలీసులు నిఘా పెట్టాలని సూచించారు. బాధితుడి ఫిర్యాదుపై హోం మంత్రి ఆదేశాలతో పోలీసులు విచారణ ప్రారంభించారు.

News July 10, 2024

రేపు కడపలో జాబ్ మేళా.. అర్హతలివే!

image

జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో గురువారం ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి సురేశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. హెచ్డీఎఫ్సీ లైఫ్, ఆల్ డిక్సన్, కాంపోజిట్ టెక్నాలజీ, ట్రయోవిజన్ కంపెనీల్లో వివిధ హోదాలలో పనిచేయుటకు టెన్త్, ఇంటర్, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ చదివిన విద్యార్థులు అర్హులని తెలిపారు. 18 నుంచి 32 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలని తెలిపారు.

News July 10, 2024

జగ్గయ్యపేట: ‘ఐదుగురి కార్మికుల పరిస్థితి విషమం’

image

జగ్గయ్యపేట పరిధి బూదవాడలోని సిమెంట్ ఫ్యాక్టరీ బాయిలర్ పేలుడు ఘటనలో క్షతగాత్రులైన ఐదుగురు కార్మికుల ఆరోగ్య పరిస్థితి, విషమంగా ఉందని DMHO సుహాసిని తెలిపారు. తీవ్రగాయాలైన అర్జున్, గుగులోతు స్వామి, గోపి, సైదా, శ్రీమన్నారాయణలకు ప్రస్తుతం చికిత్స అందుతోందని ఆమె తెలిపారు. ఈ ఘటనలో గాయపడినవారిలో 10 మంది కోలుకున్నారని, ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న కార్మికులు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారన్నారు.

News July 10, 2024

కర్నూలు: డిగ్రీ ప్రవేశాల దరఖాస్తుకు నేడే ఆఖరు

image

శ్రీకాకుళం డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తు గడువు బుధవారంతో ముగుస్తుంది. ఈ మేరకు ఈనెల 1వ తేదీన నోటిఫికేషన్ విడుదల కాగా 10వ తేదీలోపు విద్యార్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 102 డిగ్రీ కళాశాలల్లో మొత్తం 25వేల వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ ఏడాది డిగ్రీ ఆరో సెమిస్టర్‌లో 9,832మంది విద్యార్థులు రిలీవ్ అయ్యారని తెలిపారు.

News July 10, 2024

శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం

image

తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది. 14 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి దర్శనానికి 8 నుంచి 10 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు వెల్లడించారు. స్వామివారిని మంగళవారం 67,245 మంది దర్శించుకున్నారు. 25,054 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.51 కోట్లు వచ్చింది.

News July 10, 2024

ప్రతిభ చూపితే భవిత విద్యార్థులదే: డీఈవో

image

ప్రతిభ చూపితే భవిత విద్యార్థుల దేనని జిల్లా విద్యాశాఖ అధికారిని జి.పగడాలమ్మ పేర్కొన్నారు. విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనలు పెంపొందించేందుకు విద్యార్థి విజ్ఞాన్ మందన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆమె తెలిపారు. 6-11 తరగతి విద్యార్థులకు అర్హులని వెల్లడించారు. సెప్టెంబర్ 15 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని అన్నారు.

News July 10, 2024

ఆకాశవాణిలో ‘జంధ్యాల’ ధార్మిక బాణి

image

కేంద్రప్రభుత్వ నిర్వహణలోని శ్రేష్ఠ భారత్ కార్యక్రమాల్లో భాగంగా, సిక్కు సంప్రదాయ గురువుల గురించిన పది భాగాల ధారావాహికను విశాఖ ఆకాశవాణి రేడియో స్టేషన్ ప్రసారం చేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే శ్రీకాకుళం రచయిత జంధ్యాల శరత్ బాబు ప్రసంగాల పరంపరను రికార్డు చేసింది. ఆ ధార్మిక ఉపన్యాసాలు వచ్చే ఆదివారం నుంచి సాయంత్రం వేళల్లో మొదలై, ప్రతీ వారం రెండున్నర నెలలపాటు ఉంటాయని ఏఐఆర్ ఉన్నతాధికారులు ప్రకటించారు.

News July 10, 2024

మరికాసేపట్లో కృష్ణా డెల్టాకు సాగునీటి విడుదల

image

విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా డెల్టాకు మరికొద్దిసేపట్లో అధికారులు సాగునీటిని విడుదల చేయనున్నారు. పోలవరం కుడి కాలువ (పట్టిసీమ) ద్వారా గోదావరి జలాలు కృష్ణా నదికి చేరుకోవటంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద 11.01 అడుగుల మేర నీటి నిల్వలు చేరాయి. దీంతో గోదావరి జలాలను మరికాసేపట్లో మంత్రులు నిమ్మల రామానాయుడు, కొల్లు రవీంద్ర విడుదల చేయనున్నారు.

News July 10, 2024

కంభం: పది రోజుల్లో ముగ్గురు మృతి

image

జంగంగుంట్ల- కంభం హైవే రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారింది. ఈ ప్రాంతంలో నిత్యం ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదం జరుగుతూనే ఉందని వాహనదారులు అంటున్నారు. గత పది రోజుల్లో ముగ్గురు మృతి చెందగా, ఆరుగురు తీవ్రగాయాల బారిన పడ్డారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం, రోడ్డు వెడల్పు తక్కువ, మలుపులు వంటివి ప్రమాదాలకు కారణాలుగా తెలుస్తోంది. రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తే ప్రమాదాలను అరికట్టవచ్చని పోలీసులు సూచిస్తున్నారు.