Andhra Pradesh

News July 10, 2024

నెల్లూరు జైలులో 2వ రోజు పిన్నెల్లికి 65 ప్రశ్నలు

image

సీఐపై దాడి కేసులో అరెస్టై నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంగళవారం రెండోరోజు విచారించారు. కారంపూడి దాడిపై పోలీసులు 65 ప్రశ్నలు సంధించగా పిన్నెల్లి పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు సమాచారం. పోలింగ్ తర్వాత రోజు ఇంటి నుంచి బయటకి వెళ్లలేదు. కారంపూడి ఎలా వెళ్తా? సీఐపై దాడి ఎలా చేస్తా? ‘ఆ ఘటనతో తనకు సంబంధం లేదంటూ బదులిచ్చినట్లు తెలుస్తోంది.’

News July 10, 2024

దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుపై దృష్టి సారించాలి: రామ్మోహన్ నాయుడు

image

ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక అయిన దక్షిణ కోస్తా రైల్వేజోన్ ఏర్పాటుకు సంబంధించి పనులు వెంటనే చేపట్టాలని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆదేశించారు. మంగళవారం రాత్రి ఉత్తరాంధ్ర రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై వాల్తేర్ డీఆర్ఎం సౌరభ్ ప్రసాద్, అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో విశాఖపట్నం ఎంపీ భరత్, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు.

News July 10, 2024

రాజానగరం: రూ.62 లక్షలకు చేరిన స్కామ్

image

రాజానగరం మండలం జి.యర్రంపాలెం బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో బిజినెస్ కరస్పాండెంట్ నానిబాబు చేసిన అవినీతిపై డీఆర్డీఏ చేపట్టిన విచారణ తుది దశకు చేరింది. బ్యాంకు పరిధిలోని ఐదు గ్రామాలకు చెందిన 116 స్వయం సహాయక సంఘాలలో 109 సంఘాల ప్రతినిధులను అధికారులు విచారించారు. రూ.62 లక్షల పైబడి స్కామ్ జరిగినట్లు ఉన్నతాధికారులకు ప్రాథమిక నివేదిక అందించారు. మరో ఏడు సంఘాలను విచారించాల్సి ఉందని పేర్కొన్నారు.

News July 10, 2024

నక్కపల్లి హాస్పిటల్‌లో వికటించిన ఇంజెక్షన్

image

నక్కపల్లి ఆస్పత్రిలో మంగళవారం అర్ధరాత్రి టెన్షన్ నెలకొంది. ఆస్పత్రిలోని రోగులకు సిపిటాక్సిం ఇంజెక్షన్ ఇచ్చారు. ఆ ఇంజెక్షన్లు వికటించడంతో 23 మంది రోగులు అస్వస్థతకు గురయ్యారు. వారందరికీ వాంతులై వణుకు మొదలవడంతో రోగులతో పాటు ఆస్పత్రి సిబ్బంది హడలిపోయారు. డా.జయలక్ష్మి సకాలంలో వైద్య సేవలు అందించడంతో 23 మంది రోగులు రికవరీ అయ్యారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

News July 10, 2024

కేతిరెడ్డి ఓటమిపై కేటీఆర్ స్పందన

image

ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఓటమిపై కేటీఆర్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు తమ అంచనాలకు అతీతంగా జరిగాయన్నారు. తన మిత్రుడు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి రోజూ ప్రజల్లో ఉన్నా ఓడిపోయారన్నారు. అందువల్ల ఎమ్మెల్యేలు జనాల్లో లేకపోవడంవల్ల ఓడిపోయారని చెప్పడానికి కూడా లేదన్నారు. జగన్ చాలా సంక్షేమ పథకాలు అమలు చేశారు కాబట్టి ఆయనవైపే ఓటర్లు ఉంటారని భావించామని పేర్కొన్నారు.

News July 10, 2024

సింహాద్రి అప్పన్న గిరిప్రదక్షిణ రూట్ మ్యాప్ ఇదే

image

ఈనెల 20న జరిగే సింహాద్రి అప్పన్న గిరి ప్రదర్శనకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 32 కిలోమీటర్ల మేర జరిగే ప్రదక్షిణలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. సింహాచలం, అడివివరం, బి.ఆర్.టీ.ఎస్ రహదారి మీదుగా, ముడసర్లోవ, హనుమంతువాక, వెంకోజిపాలెం, సీతమ్మధార, మాధవధార, ఎన్.ఎ.డి కూడలి నుంచి గోపాలపట్నం మీదుగా సింహాచలం వరకు భక్తులు కాలి నడకన చేరుకుంటారు. > Share it

News July 10, 2024

రేపు భోగాపురానికి రానున్న సీఎం

image

ఉత్తరాంధ్రలో గురువారం పర్యటించనున్న ముఖ్యమంత్రి ఆ రోజు భోగాపురం విచ్చేయునున్నారు. మధ్యాహ్నం12.35గంటలకు విమానాశ్రయం నిర్మాణ ప్రదేశానికి చేరుకుంటారన్నారు. సుమారు గంట పాటు ఇక్కడ జరుగుతున్న పనులపై అధికారులు, జీఎంఆర్ ప్రతినిధులు, ఎల్&టీ నిర్మాణ సంస్థ ప్రతినిధులతో సమీక్షిస్తారు. అనంతరం 1.35 గంటలకు విశాఖ బయలుదేరుతారని తెలిపారు. ఈ మేరకు జిల్లా అధికారులు సీఎం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లుచేస్తున్నారు.

News July 10, 2024

కడప టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మృతి

image

కడప మున్సిపల్ కార్పొరేషన్‌లో పనిచేస్తున్న టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మంగళవారం గుండుపోటుతో మృతి చెందారు. కుటుం సెలవులపై స్వగ్రామం నంద్యాలకు వెళ్లిన రామారావు(42) రెండు రోజుల క్రితం హార్ట్ స్ట్రోక్ రాగా చికిత్స నిమిత్తం హైదరాబాద్ తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి 9 గంటలకి మృతి చెందాడని తెలిపారు. వారి మరణానికి మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు దిగ్భ్రాంతి చెందారు.

News July 10, 2024

చిత్తూరులో టీచర్ ఆత్మహత్య

image

చిత్తూరులో ఓ టీచర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నగరంలోని గిరింపేట మున్సిపల్ హైస్కూల్లో షరీఫ్(38) హిందీ పండిట్‌గా పనిచేస్తున్నారు. ఈక్రమంలో దిశా పోలీస్ స్టేషన్ సమీపంలో సోమవారం పురుగు మందు తాగి పడిపోయాడు. కుటుంబ సభ్యులు వేలూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి చనిపోయారు. వ్యక్తిగత కారణాలతో సూసైడ్ చేసుకున్నట్లు సమాచారం.

News July 10, 2024

మంగళగిరి TDP కార్యాలయంపై దాడి.. ముగ్గురి అరెస్ట్

image

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. విజయవాడ కృష్ణలంకకు చెందిన పవన్ కుమార్, భాగ్యరాజ్, సుధాకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు మంగళగిరి గ్రామీణ పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరికొందరిని అతి త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.