Andhra Pradesh

News July 10, 2024

కృష్ణా: బాస్కెట్ బాల్‌లో సత్తాచాటిన ద్వారకానాథ్

image

రాష్ట్రానికి చెందిన బాస్కెట్ బాల్‌ ఆటగాడు కె ద్వారకానాథ్ రెడ్డి సౌత్ ఏషియన్ బాస్కెట్ బాల్‌ ఛాంపియన్‌‌షిప్‌లో ఆడే భారత జట్టుకు ఎంపికయ్యాడు. ఈ మేరకు రాష్ట్ర బాస్కెట్ బాల్‌ సంఘ ప్రధాన కార్యదర్శి జి చక్రవర్తి తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. కొలంబోలో (శ్రీలంక) నేటి నుంచి 13వ తేదీ వరకు జరిగే సౌత్ ఏషియన్ బాస్కెట్ బాల్‌ ఛాంపియన్‌‌షిప్‌‌లో ద్వారకానాథ్ రెడ్డి భారత్ తరఫున ఆడతారని చక్రవర్తి చెప్పారు.

News July 10, 2024

అనంతలో నేడు ఉద్యోగమేళా

image

అనంతపురం జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో ఇవాళ ఉద్యోగం మేళా నిర్వహిస్తున్నట్లు కల్పనాధికారి కళ్యాణి తెలిపారు. ఎమ్మెస్ నవభారత్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ సేల్స్ రిప్రజెంటేటివ్ ఉద్యోగాలకు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఉద్యోగ మేళాకు పదో తరగతి నుంచి డిగ్రీ చదివి, 18-25 సంవత్సరాల వయసున్న అభ్యర్థులు అర్హులన్నారు. అభ్యర్థులు కుల ధ్రువీకరణపత్రంతో హాజరు కావాలన్నారు.

News July 10, 2024

తూ.గో జిల్లా ఇన్‌ఛార్జ్ జాయింట్ కలెక్టర్ వీరే..!

image

తూర్పుగోదావరి జిల్లా ఇన్‌ఛార్జ్ జాయింట్ కలెక్టర్‌గా రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ దినేశ్ కుమార్‌కు మంగళవారం బాధ్యతలు అప్పగించారు. జిల్లా జేసీగా వ్యవహరిస్తున్న తేజ్ భరత్ 15 రోజుల పాటు పితృత్వ (వెటర్నిటీ) సెలవులో వెళ్లడంతో ..ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. కాగా సెలవుల అనంతరం జేసీ తిరిగి జాయిన్ అవుతారు.

News July 10, 2024

కోడుమూరు మండలంలో గుండెపోటుతో మాజీ సర్పంచ్ మృతి

image

కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలోని వర్కూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ అచ్చిరెడ్డిగారి ఈశ్వరరెడ్డి (55) మంగళవారం గుండెపోటుతో మృతి చెందాడు. మధ్యాహ్నం ఇంట్లో ఆయన తీవ్ర అస్వస్థతకు గురికాగా ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆయనకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. ఈశ్వరరెడ్డి మృతిపై మాజీ ఎమ్మెల్యే మణిగాంధీ, కోట్ల హర్షవర్దన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

News July 10, 2024

నెల్లూరు జైలులో పిన్నెల్లికి 65 ప్రశ్నలు

image

సీఐపై దాడి కేసులో అరెస్టై నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంగళవారం రెండోరోజు విచారించారు. కారంపూడి దాడిపై పోలీసులు 65 ప్రశ్నలు సంధించగా పిన్నెల్లి పొంతనలేని సమాధానాలు చెప్పిట్లు సమాచారం. పోలింగ్ తర్వాత రోజు ఇంటి నుంచి బయటకి వెళ్లలేదు. కారంపూడి ఎలా వెళ్తా? సీఐపై దాడి ఎలా చేస్తా? ఆ ఘటనతో తనకు సంబంధం లేదంటూ బదులిచ్చినట్లు తెలుస్తోంది.

News July 10, 2024

నేడు కేంద్ర మంత్రి కుమారస్వామి విశాఖ రాక

image

కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రి హెచ్ఎ కుమారస్వామి బుధవారం విశాఖ వస్తున్నారు. సాయంత్రం 6.30గంటలకు ప్రత్యేక విమానంలో విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా విశాఖ ఉక్కు అతిథి గృహానికి చేరుకొని రాత్రికి బస చేస్తారు. 11న ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12.30గం టల వరకు ఉక్కు కర్మాగారం సందర్శించి సమీక్షా సమావేశాల్లో మంత్రి పాల్గొంటారు. అనంతరం హైదరాబాద్ బయలుదేరి వెళతారు.

News July 10, 2024

‘ఇన్‌స్పైర్‌ అవార్డులకు దరఖాస్తు చేసుకోండి’

image

2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇన్‌స్పైర్‌ అవార్డులకు విద్యార్థులు దరఖాస్తు చేసుకునేలా జిల్లా విద్యాశాఖ అధికారి వరలక్ష్మీ ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించి జిల్లాలోని ప్రతి ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 6-10 తరగతుల విద్యార్థుల నుంచి నాణ్యమైన నమూనాలను ఉపాధ్యాయులు సిద్ధం చేయించి ఇన్‌స్పైర్‌ మనక్‌ www.inspireawards-dst.gov.in వెబ్‌సైట్‌లో సెప్టెంబరు 15లోగా నమోదు చేసేలా చూడాలన్నారు.

News July 10, 2024

పల్నాడు జిల్లాలో పులి సంచారం

image

పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం దావుపల్లి అటవీ ప్రాంతంలో పులి సంచారం వెలుగుచూసింది. బొటుకులపాయ బేస్‌ క్యాంపు వద్ద పులి తిరుగుతున్నట్లు CC కెమెరాల్లో రికార్డయ్యింది. అటవీ ప్రాంతంలో నీరులేక జంతువులు సాసర్‌పిట్‌ల వద్దకు వస్తున్నాయని విజయపురిసౌత్‌ రేంజర్‌ సత్యనారాయణరెడ్డి అన్నారు. అయితే 4 రోజుల కిందట ఈ పులి సంచరించినట్లు తెలిపారు. నల్లమల అటవీ ప్రాంతం కావడంతో పులుల సంచారం ఇక్కడ ఉంటుందని వివరించారు.

News July 10, 2024

కొవ్వూరు: యువకుడిపై పోక్సో కేసు

image

ఓ బాలికను వరుసకు అన్న అయ్యే యువకుడు వేధిస్తున్న ఘటన కొవ్వూరు పట్టణంలో జరిగింది. ప్రతిరోజూ కళాశాలకు వెళ్లి వస్తున్న సమయంలో వెంట పడి, అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని మంగళవారం రాత్రి బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో యువకుడిపై పోక్సో కేసు నమోదు
చేసినట్టు హెడ్ కానిస్టేబుల్ సాంబశివమూర్తి తెలిపారు.

News July 10, 2024

విశాఖలో డ్యూక్ బైక్ ఢీ.. ఒకరి మృతి

image

విశాఖలో డ్యూక్ బైక్‌తో మంగళవారం రాత్రి ఓ యువకుడు బీభత్సం సృష్టించాడు. మాధవధార నుంచి వెళుతూ జ్యోతినగర్ వద్ద రోడ్డు దాటుతున్న ఇద్దరిని కంచరపాలెం నుంచి వస్తున్న క్రాంతి బలంగా ఢీకొట్టి కొంత దూరం ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనలో త్రినాథరావు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. సన్యాసిరావు అనే వ్యక్తి తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నాడు. వీరిద్దరూ రోజువారి కూలీలే. ఈ ఘటనలో బైకర్‌కు స్వల్పగాయాలయ్యాయి.