Andhra Pradesh

News July 10, 2024

అద్దంకి: భార్యాభర్తల నడుమ వివాదం.. ఇంట్లో చోరీ

image

బల్లికురవ మండలంలోని కొప్పరపాలెంలో రెండు రోజుల నుంచి భార్యాభర్తల మధ్య వివాదం నడుస్తోంది. ఈక్రమంలో వారి కుటుంబ సభ్యులు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై మరొకరు దాడికి యత్నించారు. భార్య బంధువులు మంగళవారం ఉదయం భర్త ఇంటిపై దాడి చేశారు. భర్తతో పాటు మరో వ్యక్తిపై దాడి చేసి బీరువాలో ఉన్ననగదును ఎత్తుకెళ్లినట్లుగా చెప్పాడు. భయభ్రాంతులకు గురైన వారు బల్లికురవ పోలీసులను ఆశ్రయించగా, ఘటనపై విచారణ చేపట్టారు.

News July 10, 2024

పవన్ నిర్ణయం.. పిఠాపురం మారేనా..?

image

పిఠాపురంలో రోజూ 25 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతుండగా ఇందులో 1.3 టన్నులు ప్లాస్టిక్ వ్యర్థాలే ఉన్నాయి. అలాగే పాదగయ క్షేత్రంలో దాదాపు 1200 ప్యాకెట్ల ప్రసాదాలు విక్రయిస్తున్నారు. మరోవైపు నియోజకవర్గ వ్యాప్తంగా 1200 పీవోపీ గణపతి విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. పిఠాపురంలో ప్లాస్టిక్ వాడకం నిషేధించం, మట్టి విగ్రహాలు ఏర్పాటు చేయాలన్న పవన్ కళ్యాణ్ <<13594334>>ప్రతిపాదనతో <<>>ఏ మేర మార్పు వస్తుందో చూడాలి మరి.

News July 10, 2024

శ్రీకాకుళం యువతిపై లైంగిక దాడికి యత్నించిన యువకుడు

image

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం వాటర్ ట్యాంక్ తండా సమీపంలో రన్నింగ్ విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో యువతి పట్ల ఓ యువకుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. వాష్ రూమ్‌కి వెళ్లిన యువతిపై మద్యం మత్తులో లైంగిక దాడికి యత్నించాడు. దీంతో పెనుగులాటలో ట్రైన్ నుంచి ఇద్దరు జారిపడినట్లు బాధితురాలు తెలపారు. తీవ్ర గాయాలైన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. ఆ యువతిది జములూరు మండలం. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

News July 10, 2024

VZM: రోడ్డు ప్రమాదంలో విశ్రాంత పశువైద్యాధికారి మృతి

image

పూసపాటిరేగ మండలం చోడమ్మఅగ్రహారం వద్ద హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో విశ్రాంత పశువైద్యాధికారి మృతి చెందారు. శ్రీకాకుళం నుంచి విశాఖ వెళ్తున్న లారీని వెనుక నుంచి కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో విశ్రాంత పశువైద్యాధికారి పక్కి నర్సింగరావు మృతి చెందగా.. డ్రైవర్ గాయాలతో బయటపడ్డాడు. మృతుడిని విశాఖ జిల్లా మర్రిపాలెం చెందినవారుగా పోలీసు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News July 10, 2024

పెండ్లిమర్రి: టిప్పర్ బోల్తా.. డ్రైవర్ మృతి

image

కడప – పులివెందుల ప్రధాన రహదారిలో పెండ్లిమర్రి మండలంలోని గుర్రాల చింతలపల్లె వద్ద మంగళవారం రాత్రి అదుపుతప్పి మినీ టిప్పర్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో వేములకు చెందిన టిప్పర్ డ్రైవర్ గంగాధర్ అక్కడికక్కడే మృతి చెందాడు. వేముల నుంచి కడపకు ముగ్గురాయి లోడుతో వెళుతున్న టిప్పర్ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో గంగాధర్ టిప్పర్ క్యాబిన్లో ఇరుక్కుపోయి తీవ్ర గాయాలతో మృతి చెందగా, క్లీనర్ గాయపడ్డాడు.

News July 10, 2024

హిజ్రాను మోసం చేసిన కర్నూల్ జిల్లా యువకుడు

image

కర్నూల్ జిల్లా యువకుడు హిజ్రాను మోసం చేసిన ఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది. హైదరాబాద్‌ నగరానికి చెందిన హిజ్రా హసీనా గౌడ్‌తో ఆదోని మండలం బైచిగేరి గ్రామానికి చెందిన గణేశ్ కొన్ని రోజులుగా సహజీవనం చేస్తున్నాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి తీరా మోసం చేయడంతో హసీనా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్‌ తరలించారు.

News July 10, 2024

నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ బదిలీ

image

నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ వికాస్ మర్మత్‌ను బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల కార్పొరేషన్‌లో కమిషనర్ సంతకాలను కొందరు ఫోర్జరీ చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. దీనిపై విచారణ కొనసాగుతున్న సమయంలోనే ఆయనను బదిలీ చేశారు. కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా ఆయనను నియమించారు.

News July 10, 2024

అల్లూరి జిల్లాలో గంజాయి తోటల ధ్వంసం: ఎస్పీ

image

ఆపరేషన్ పరివర్తన కార్యక్రమంలో భాగంగా అల్లూరి జిల్లాలో 7,500 ఎకరాలలో గంజాయి తోటలను పోలీసుశాఖ ధ్వంసం చేసిందని ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. గంజాయి సాగుచేసే గిరిజనుల్లో మార్పు తీసుకువచ్చామన్నారు. గంజాయి సాగు చేసే రైతులపై కేసులు నమోదు చేయడంతో పాటు, వారిని ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మళ్లించి ఉచితంగా విత్తనాలు, పండ్ల జాతుల మొక్కలు అందజేశామన్నారు. వారికి ఉపాధి రంగాల్లోను శిక్షణ ఇచ్చామని తెలిపారు.

News July 10, 2024

పెద్దిరెడ్డి సంస్థ ఇసుక నిల్వలు స్వాధీనం

image

ఉమ్మడి చిత్తూరు జిల్లా ములకలచెరువు(M) రెడ్డివారిపల్లి సమీపంలోని ఇసుక డంప్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డికి చెందిన PLR సంస్థ పాపఘ్ని నదిలో ఇసుక తవ్వి టిప్పర్ల ద్వారా రెడ్డివారిపల్లికి తరలించారు. హంద్రీ-నీవా కాలువ పనులు చెప్పి అప్పట్లో ఇసుక నిల్వ చేశారు. కొన్ని నెలలుగా కాలువ పనులు జరగడం లేదు. దీంతో అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇసుకను స్వాధీనం చేసుకున్నారు.

News July 10, 2024

కోడుమూరు మండలంలో గుండెపోటుతో మాజీ సర్పంచ్ మృతి

image

కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలోని వర్కూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ అచ్చిరెడ్డిగారి ఈశ్వరరెడ్డి (55) మంగళవారం గుండెపోటుతో మృతి చెందాడు. మధ్యాహ్నం ఇంట్లో ఆయన తీవ్ర అస్వస్థతకు గురికాగా ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆయనకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. ఈశ్వరరెడ్డి మృతిపై మాజీ ఎమ్మెల్యే మణిగాంధీ, కోట్ల హర్షవర్దన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.